న్యూఢిల్లీ: భారత్‌లో విక్రయించే ప్రతి స్మార్ట్‌ఫోన్‌ను స్థానికంగా తయారు చేయనున్నట్టు టెక్నాలజీ కంపెనీ నథింగ్ ప్రకటించింది. ఆడియో ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ సంస్థ స్మార్ట్‌ఫోన్ల వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్టు ఈ ఏడాది మార్చిలో వెల్లడించింది. తమిళనాడులో స్మార్ట్‌ఫోన్లు ఉత్పత్తి కానున్నాయి.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌పై సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధిలో నథింగ్ నిమగ్నమైంది. తొలి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) జూలై 12న భారత్‌లో ఆవిష్కరించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పే స్థాపించిన నథింగ్‌లో గూగుల్ పెట్టుబడి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment