కొత్త ఆల్టో 800 ఎప్పుడొస్తుందో తెలుసా?
కొత్త ఆల్టో 800 ఎప్పుడొస్తుందో తెలుసా?
Published Tue, Mar 7 2017 8:28 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
భద్రతకు పెద్ద పీట వేస్తూ కొత్త కొత్త ఫీచర్లతో ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో రకరకాల మోడల్స్ వాహన వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇగ్నిస్, బాలెనో, విటారా బ్రీజా కార్లను లాంచ్ చేసిన దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ ఎంట్రీ-లెవల్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్పై ఎక్కువగా దృష్టిసారించింది. ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేందుకు సేఫ్టీ ఈక్విప్ మెంట్, ఎక్కువ ఫీచర్లతో కూడిన కొత్త ఆల్టో 800 ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2018 ఆటో ఎక్స్ పోలో ఈ కొత్త మారుతీ సుజుకీ ఆల్టో 800ను ప్రదర్శించబోతున్నారు. ఇగ్నిస్, బాలెనో మాదిరిగానే కొత్త జనరేషన్ ఆల్టోలోనూ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంటుందని తెలుస్తోంది.
ఏబీఎస్, డ్యూయర్ ఎయిర్ బ్యాగ్స్ ను ఇది కల్పిస్తుందట. తమ మోడల్ కార్ల తయారీ రూపురేఖలనే మార్చుస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది. రెనాల్ట్ క్విడ్, డాట్సాన్ రెడీ-గో వంటి కంపెనీల నుంచి ఇప్పటికే మారుతీ సుజుకీ ఆల్టో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆల్టో మోడల్ కంపెనీకి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్ట్ గా నిలిచింది. ఫిబ్రవరి అమ్మకాల్లోనూ ఇదే టాప్ లో ఉంది. జనవరి నెలలోనూ బెస్ట్-సెల్లింగ్ ట్యాగ్ను మారుతీ ఆల్టో పొందినట్టు సియామ్ తాజా డేటా కూడా పేర్కొంది. ఈ కారు విక్రయాలు జనవరిలో 22,998 యూనిట్లను నమోదుచేసుకున్నాయి. ఈ విక్రయాలను మరింత పెంచేందుకు కొత్త ఆల్టో 800ను కంపెనీ రూపొందిస్తోంది.
Advertisement
Advertisement