సాక్షి, ముంబై: కవాసకి ఇండియా భారత మార్కెట్లో వినియోగదారుల కోసం 2023 వల్కన్ ఎస్ బైక్‌ను లాంచ్ చేసింది. మిడిల్‍వెయిట్ క్రూజర్ బైక్ వల్కన్ ఎస్ మోడల్‍తో పోలిస్తే 2023 వెర్షన్ బైక్‌ను కొన్ని అప్‍గ్రేడ్లతో విడుదల చేసింది. (2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్!)
2023 కవాసకి వల్కాన్ ఎస్ ఇంజీన్
659 సీసీ ప్యార్లల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. ఇది 7500rpm వద్ద 59.9bhp శక్తిని , 6600rpm వద్ద 62.4Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా జతచేసింది. 14 లీటర్ ఇంధన ట్యాంక్, 705 మిమీ సీట్ ఎత్తు, 18 అంగుళాల ఫ్రంట్‌వీల్స్, 17 అంగుళాల రియర్‌వీల్స్, 130 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ ఛానల్ ABS (ప్రామాణికం)తో ఈ బైక్‌ను అందిస్తోంది. అయితే బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులేవీలేవు. ఈ క్రూయిజర్ బైక్‌లో సింగిల్ పాడ్ హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి.
2023 కవాసకి వల్కాన్ ఎస్ ధర
ఇండియాలో దీని రూ.7.10లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మెటాలిక్ మ్యాక్ కార్బన్ గ్రే కలర్ స్కీమ్‍లో మాత్రమే ఈ 2023 వెర్షన్ బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 , బెనెల్లీ 502C ఈ సరికొత్త బైక్‌కి గట్టి పోటీ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
(ఇదీ కూడా చదవండి: వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!)
Comments
Please login to add a commentAdd a comment