Vulcan
-
2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే
సాక్షి, ముంబై: కవాసకి ఇండియా భారత మార్కెట్లో వినియోగదారుల కోసం 2023 వల్కన్ ఎస్ బైక్‌ను లాంచ్ చేసింది. మిడిల్‌వెయిట్ క్రూజర్ బైక్ వల్కన్ ఎస్ మోడల్‌తో పోలిస్తే 2023 వెర్షన్ బైక్‌ను కొన్ని అప్గ్రేడ్లతో విడుదల చేసింది. (2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్!) 2023 కవాసకి వల్కాన్ ఎస్ ఇంజీన్ 659 సీసీ ప్యార్లల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. ఇది 7500rpm వద్ద 59.9bhp శక్తిని , 6600rpm వద్ద 62.4Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా జతచేసింది. 14 లీటర్ ఇంధన ట్యాంక్, 705 మిమీ సీట్ ఎత్తు, 18 అంగుళాల ఫ్రంట్వీల్స్, 17 అంగుళాల రియర్వీల్స్, 130 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ ఛానల్ ABS (ప్రామాణికం)తో ఈ బైక్‌ను అందిస్తోంది. అయితే బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులేవీలేవు. ఈ క్రూయిజర్ బైక్‌లో సింగిల్ పాడ్ హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. 2023 కవాసకి వల్కాన్ ఎస్ ధర ఇండియాలో దీని రూ.7.10లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మెటాలిక్ మ్యాక్ కార్బన్ గ్రే కలర్ స్కీమ్‌లో మాత్రమే ఈ 2023 వెర్షన్ బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 , బెనెల్లీ 502C ఈ సరికొత్త బైక్‌కి గట్టి పోటీ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (ఇదీ కూడా చదవండి: వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!) -
ఫ్యూచర్ చేతికి ‘వల్కన్ ఎక్స్‌ప్రెస్’!
న్యూఢిల్లీ: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ కంపెనీ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు చెల్లించి వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేశామని, ఈ డీల్ విలువ రూ.35 కోట్లని ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియానీ తెలిపారు. వల్కన్ చేరికతో ఈ కామర్స్, రిటైల్ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించగలమని చెప్పారాయన. కాగా పూర్తిగా ఈ–కామర్స్ వ్యాపారంపైననే దృష్టి సారించే వ్యూహంలో భాగంగా స్నాప్‌డీల్ కంపెనీ వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను విక్రయించిందని స్నాప్‌డీల్ చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జేసన్ కొఠారి పేర్కొన్నారు. ఫ్యూచర్ సప్లై చెయిన్‌కు దేశవ్యాప్తంగా 44 గిడ్డంగులు, 14 లాజిస్టిక్స్ కేంద్రాలు, 106 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఫ్యూచర్ జోరు..: ఇటీవల కాలంలో ఫ్యూచర్ కంపెనీ జోరుగా కంపెనీలను కొనుగోలు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కంపెనీ షాపర్స్ స్టాప్‌కు చెందిన హైపర్ సిటీ రిటైల్‌ను రూ.655 కోట్లకు కొనుగోలు చేసింది. గత వారమే ట్రావెల్ న్యూస్ సర్వీసెస్ ఇండియాను (టీఎన్ఎస్ఐ) రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. -
‘ఫ్యూచర్’ చేతికి స్నాప్‌డీల్ ‘వల్కన్’!
ముంబై: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్ విభాగం, వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ రూ.50 కోట్లు ఉండొచ్చు. తన సరఫరా చెయిన్ వ్యాపారాన్ని మరింత పటిష్టవంతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఫ్యూచర్‌గ్రూప్ వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గా లు వెల్లడించాయి. ఈ డీల్‌కు సంబంధించి చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో ఖరా రు కావచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్‌లో భాగంగా వల్కన్ సిబ్బంది ఫ్యూచర్ గ్రూప్‌కు బదిలీ అవుతారు. వల్కన్ ఎక్స్‌ప్రెస్ చేరికతో ఫ్యూచర్ గ్రూప్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కార్యకలాపాలు మరింత శక్తివంతమవుతాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి స్నాప్‌డీల్, ఫ్యూచర్గ్రూప్లు నిరాకరించాయి. వంద నగరాల్లో వల్కన్ కార్యకలాపాలు... వల్కన్ ఎక్స్‌ప్రెస్ రిటైల్ కంపెనీలకు ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలకు సరఫరా సేవలందిస్తోంది. మొత్తం వంద నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్ గ్రూప్‌కు సొంత లాజిస్టిక్స్ సంస్థ ఉంది. ఇటీవలే ఈ సంస్థ, ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.650 కోట్లు సమీకరించింది. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్, ఫుడ్, బేవరేజేస్, ఎఫ్ఎమ్సీజీ, ఈ కామర్స్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల సంస్థలకు లాజిస్టిక్స్ సేవలందిస్తోంది. కీలకం కాని ఆస్తుల విక్రయంలో భాగంగా స్నాప్‌డీల్ సంస్థ వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను విక్రయిస్తోంది. అత్యంత తీవ్రమైన పోటీ ఉన్న ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల నుంచి నిలదొక్కుకోవడానికి కావలసిన నిధులను ఇలాంటి కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా సమకూర్చుకుంటోంది. గత ఏడాది జూలైలో తన పేమెంట్ వాలెట్ ఫ్రీచార్జ్‌ను స్నాప్‌డీల్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్‌కు రూ.385 కోట్లకు విక్రయించింది. -
ఫ్లిప్‘కార్ట్’లోకి 6 వేల కోట్లు
దేశీ ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద నిధుల సమీకరణగా రికార్డు వ్యాపార విస్తరణ, మొబైల్ కామర్స్‌కు వినియోగిస్తామంటున్న కంపెనీ ఐపీఓ ఆలోచనలేదని స్పష్టీకరణ... తాజా డీల్‌తో కంపెనీ విలువ రూ. 42,000 కోట్లుగా అంచనా బెంగళూరు: దేశీ ఈ-కామర్స్ అగ్రగామి ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లోనేకాదు.. నిధుల సమీకరణలోనూ బిలియన్ డాలర్ల రికార్డును నమోదు చేసింది. ఇన్వెస్టర్ల నుంచి తాజాగా బిలియన్ డాలర్ల(సుమారు రూ.6,000 కోట్లు) నిధులను సమీకరించినట్లు మంగళవారం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇప్పటివరకూ భారత్‌లోని ఆన్లైన్ షాపింగ్ రంగంలో ఇదే అతిపెద్ద నిధుల సమీకరణ కావడం గమనార్హం. ఇప్పటికే కంపెనీలో పలు వెంచర్ క్యాపిటల్(వీసీ), ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో ప్రస్తుత వాటాదారులైన టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, నాస్పర్స్‌తో పాటు సింగపూర్‌కు చెందిన సావరీన్ వెల్త్ ఫండ్, జీఐసీ, యాక్సెల్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్, ఐకానిక్ క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంటల్, సోఫ్నియాలు ఉన్నాయి. కాగా, తాజా పెట్టుబడులతో ఎవరికి ఎంత వాటాలున్నాయన్న వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ఇదిలాఉండగా.. ఈ భారీ నిధుల సమీకరణ నేపథ్యంలో కంపెనీ మార్కెట్ విలువ(వేల్యుయేషన్) దాదాపు రూ.42,000 కోట్లకు ఎగబాకినట్లు పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలే డీఎస్టీ గ్లోబల్ 21 కోట్ల డాలర్లను(సుమారు రూ.1,260 కోట్లు) ఫిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం తెలిసిందే. తాజా పెట్టుబడులను కలిపితే కంపెనీ ఇప్పటిదాకా వివిధ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం 1.7 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా. ఐపీఓ ప్రణాళికలేవీ లేవు... విక్రేతల సంఖ్యను పెంచుకోవడం, కస్టమర్లకు మరింత మెరుగైన సదుపాయాలు, పరిశోధన- అభివృద్ధి(ఆర్అండ్డీ), ఆన్లైన్-మొబైల్ సేవల విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. భవిష్యత్‌లో తమ కంపెనీని మొబైల్ ఈ-కామర్స్‌లో దూసుకెళ్లేలా చేయడం... ఉత్పత్తులు, టెక్నాలజీలకు సంబంధించి వినూత్న ఒరవడులు తీసుకొచ్చేలా పెట్టుబడులు చేయనున్నామని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సచిన్ బన్సల్ పేర్కొన్నారు. తాము దీనిపై దృష్టిని కేంద్రీకరించేందుకు 2020కల్లా దేశంలో మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 50 కోట్లకు ఎగబాకనుండటమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మారేందుకు తాజా నిధులు ఉపయోగపడనున్నాయన్నారు. పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) కి వచ్చే ప్రణాళికలు, ఆలోచనలేవీ లేవని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. ప్రజల నుంచి నిధులు సమీకరించేంత స్థాయికి ఇంకా తమ బిజినెస్ మోడల్ చేరుకోలేదన్నారు. అమెరికాలో ఫ్లిప్‌కార్ట్‌ను లిస్టింగ్ చేయనున్నారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో బన్సల్ ఈవిధంగా స్పందించారు. అనతికాలంలోనే.... 2007లో బెంగళూరు కేంద్రంగా సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు ఫ్లిప్‌కార్ట్‌ను నెలకొల్పారు. ఆన్లైన్ బుక్‌స్టోర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్ యాక్సెసరీస్, దుస్తులు ఇలా సమస్త ఉత్పత్తుల అమ్మకానికి వేదికగా నిలుస్తోంది. కంపెనీలో 14,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 2.2 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లను సంపాదించింది. రోజుకు 40 లక్షలకుపైగా విజిట్స్(వెబ్సైట్లో సెర్చ్) నమోదవుతున్నాయి. నెలకు 50 లక్షల మేర ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. గతేడాదిలోనే బిలియన్ డాలర్ల ఆదాయ మార్కును అందుకుంది కూడా. విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఈబేలతోపాటు స్నాప్‌డీల్ ఇతరత్రా దేశీ కంపెనీల నుంచి విపరీతమైన పోటీని తట్టుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఈ ఏడాది మే నెలలో ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ ‘మింత్రా’ను రూ.2,000 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేయడం తెలిసిందే.