
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో రెండు కొత్త బైకులను విడుదల చేసింది. ఇందులో ఒకటి ZH2 కాగా, మరొకటి ZH2 SE. వీటి ధరలు వరుసగా రూ. 23 లక్షలు, రూ. 27.22 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు వాటి మునుపటి మోడల్స్ కంటే రూ. 30,000 ఎక్కువ. బుకింగ్‌లు డీలర్‌షిప్‌లో లేదా ఆన్‌లైన్‌లో చేయవచ్చు.
కవాసకి ఈ రెండు కొత్త బైకులను ఒకే మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే కలర్ ఆప్షన్‌లో అందిస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే.. జెడ్‌హెచ్2, జెడ్‌హెచ్2 ఎస్ రెండూ కూడా 998 సీసీ ఇన్‌లైన్, ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ సూపర్ చార్జ్డ్ ఇంజిన్ కలిగి 197 బీహెచ్‌పి పవర్, 137 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
(ఇదీ చదవండి: రూ. 1,299కే కొత్త ఇయర్‌ఫోన్స్.. ఒక్క ఛార్జ్‌తో 40 గంటలు)
కవాసకి లేటెస్ట్ బైక్స్ ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ రైడింగ్ మోడ్‌లు, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకుండా స్కైహుక్ టెక్నాలజీతో కవాసకి క్విక్ షిఫ్టర్ (KQS), కవాసకి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సస్పెన్షన్ (KECS), కవాసాకి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సస్పెన్షన్ (KECS) వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment