కవాసాకి కొత్త బైక్స్‌ లాంచ్‌..ధరలు? | Kawasaki launches Z1000, Z1000R Edition in India; prices start at Rs 14.4 lakh | Sakshi
Sakshi News home page

కవాసాకి కొత్త బైక్స్‌ లాంచ్‌.. ధరలు?

Published Tue, Apr 25 2017 12:33 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

కవాసాకి కొత్త  బైక్స్‌ లాంచ్‌..ధరలు?

కవాసాకి కొత్త బైక్స్‌ లాంచ్‌..ధరలు?

న్యూఢిల్లీ: కవాసాకి తన  ఫ్లాగ్ షిప్‌ మోడల్‌  బైక్‌లను భారతదేశంలో లాంచ్‌ చేసింది. జెడ్‌ 1000, జెడ్‌ 1000ఆర్‌  ఎడిషన్‌లను  విడుదల చేసింది. వీటి ధర ధర రూ .14 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. కొత్త బీఎస్‌-2 ప్రమాణాలతో  రూపొందించిన ఈ సరికొత్త  బైక్స్‌ అమ్మకాలను   ప్రారంభించింది.

జపాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన  స్పోర్ట్స్‌  బైక్‌ కవాసకీ 2017 మోడల్స్‌ను ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి   ధరలను వరసగా రూ 14.49 లక్షల (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ) మరియు రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) ప్రారంభ ధరలుగా ప్రకటించింది. కొత్త కవాసకీ జెడ్‌ 1000 లోఒక సున్నితమైన విద్యుత్ సరఫరా కోసం సవరించిన ఈసీయుని అమర్చింది.

ఈ  రెండింటిలో ముందువైపు డ్యూయల్ 310 మిమీ డిస్క్ బ్రేక్ , వెనుకవైపు 250 ఎంఎం డిస్క్‌ పొందుపర్చింది.. అంతేకాకుండా  41 మిల్లీమీటర్ల సైడ్ డౌన్ ఫోర్క్,  ముందు ఓహ్లిన్స్ వెనుక షాక్తో పాటు బ్రమ్బో ఎం50 మోనోబ్లోక్ బ్రేక్ కాలిపర్స్‌ ప్రధాన ఆకర్షణ.

జె 1000 ఇంజీన్‌
104 సీసీ ఇంజీన్‌,  లిక్విడ్‌ కూల్డ్‌ బీఎస్‌ -4 ఇంజీన్‌
142 మాగ్జిమం పవర్‌, 111 ఎన్‌ఎం గరిష్ట  టార్క్‌, విత్ సిక్స్‌ స్పీడ్‌ గేర్ బ్యాక్స్‌
సవరించిన ఫ్రంట్ ఫోర్క్ సెట్టింగులు,
 రివైజ్‌డ్‌ వెనుక బ్రేక్ ప్యాడ్,  మెరుగైన షాక్అబ్జార్బర్స్
1435, 2045 వీల్‌ బేస్‌, 17 లీటర్ల ఇంధన సామర్ధ్యం

జెడ్‌1000 మెటాలిక్ స్పార్క్ బ్లాక్ , గోల్డెన్ బ్లేజ్ గ్రీన్ లోనూ,జెడ్‌1000ఆర్‌ ఎడిషన్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ అండ్ మెటాలిక్ గ్రాఫైట్ గ్రే కలర్స్‌లోను లభ్యంకానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement