launche
-
ప్రధాని మోదీ మెచ్చిన ఆలూ.. అందరూ తినొచ్చంటున్న వైద్యులు
సాధారణంగా చాలామంది వైద్యులు బంగాళదుంపలు(ఆలూ) ఆరోగ్యానికి అంతమంచివి కావని చెబుతుంటారు. మరోవైపు ఆరోగ్య స్పృహ కలిగినవారిలో కొందరు బంగాళాదుంపలకు దూరంగా ఉంటారు. అయితే మార్కెట్లోకి ఇటీవలే వచ్చిన ఒకరకం బంగాళదుంపలను నిరభ్యంతరంగా తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ బంగాళదుంపను ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (పూసా) వారు రూపొందించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మోదీపురంలోని రీజనల్ సెంటర్లోని పూసాలోని సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కనుగొన్న ఈ కొత్త రకం బంగాళదుంప పేరు కుఫ్రీ జామునియా. ఈ రకాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలకు సుమారు తొమ్మదేళ్లు పట్టింది. దీనికి సంబంధించిన పరిశోధనలు 2015లో ప్రారంభమయ్యాయి. శాస్త్రవేత్తలు ఈ నూతన తరహా బంగాళదుంపను ప్రధానికి చూపించి, దాని ప్రత్యేకతను కూడా వివరించారు.ఈ బంగాళాదుంపను కనుగొన్న పూసా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్కె లూత్రా మీడియాతో మాట్లాడుతూ కుఫ్రీ జామునియా అనేది యాంటీ-ఆక్సిడెంట్లుతో పాటు ఊదారంగు గుజ్జు కలిగిన బంగాళాదుంప రకం. 100 గ్రాముల దుంపలోని గుజ్జులో అధిక యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ సి (52 మి.గ్రా), ఆంథోసైనిన్ (32 మి.గ్రా), కెరోటినాయిడ్స్ (163 మైక్రోగ్రాములు) ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. కుఫ్రీ జామునియాను హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ , మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒరిస్సా, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్లలో పండించేందుకు అనువైన వాతావరణం ఉంది. -
నదిలో విహరిస్తూ...దేవాలయాలను దర్శిస్తూ..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా నది జల విహారం పర్యాటకులకు మరింతగా ఆహ్లాదాన్ని పంచనుంది. నదీ తీరంలోని ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్ టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ చుట్టు పక్కల ఉన్న 7 ప్రధాన దేవాలయాలను ఒకే రోజు సందర్శించేలా ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి రూ.50 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కృష్ణా నది ద్వారా టెంపుల్ టూరిజంకు సంబంధించిన జెట్టీల నిర్మాణం, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో పర్యాటక, దేవాలయాలను కలిపే విధంగా ప్రణాళిక రచించింది. ఒక్క రోజులోనే కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, జలవిహారం చేస్తూ 80 కిలోమీటర్లు ప్రయాణం చేయటం ద్వారా7 ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇన్ లాండ్ వాటర్ వేస్ చర్యలు తీసుకొంటోంది. జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చూస్తోంది. పర్యాటక ప్రాంతాల్లో పిల్లలకు ఆట వస్తువులు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, ఓపెన్, ఎడ్వంచర్ గేమ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. జలవిహారం సాగనుంది ఇలా... ♦ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరం ఉదయం దుర్గాఘాట్ నుంచి భవానీ ద్వీపానికి జెట్టీ వెళ్తుంది. అక్కడ గంట సేపు ద్వీపం అందాలను ఆస్వాదించవచ్చు. ♦ అక్కడ నుంచి జెట్టీ పవిత్ర సంగమంకు చేరుకుంటుంది. కొద్దిసేపటి తరువాత అక్కడి నుంచి గుంటూరు జిల్లా వైకుంఠపురంలో ఉన్న వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. ♦ అక్కడ నుంచి అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళతారు. ఆ తరువాత జగ్గయ్యపేట వద్దనున్న వేదాద్రికి చేరుకొని లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి. సాయంత్రానికి ముక్త్యాల భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడంతో జలవిహారం ముగుస్తుంది. అక్కడ స్వామి వారి దర్శనం పూర్తయిన తర్వాత ..బస్సులో రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుస్తారు. మౌలిక వసతులకు ప్రతిపాదనలు... ప్రస్తుతం ఆయా ప్రదేశాల్లో జెట్టీ నిర్మాణాలు, దేవస్థానాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గాలు,వెయిటింగ్ లాంజ్‌లు, టికెట్ కౌంటర్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నుంచి ఓ జెట్టీ, ముక్త్యాల నుంచి ఓ జెట్టీ ప్రతి రోజు ఉదయం బయలుదేరే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిపాదనలు ఇలా.. 2 యాంత్రీకరణ బోట్లు కొనుగోలుకు అయ్యే ఖర్చు: రూ.22 కోట్లు 7 ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, సౌకర్యాలకు: రూ.24 కోట్లు జెట్టీలు ని ర్మించే ప్రాంతంలో రూఫ్‌టాప్ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి: రూ. 4 కోట్లు మొత్తం అయ్యే ఖర్చు : రూ.50 కోట్లు జలవిహారానికి ఏర్పాట్లు... కృష్ణా నదిలో జలవిహారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. పర్యాటకులను ఆకర్షించే విధంగా టెంపుల్‌టూరిజం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఒక్క రోజులోనే కృష్ణా నదిలో 80 కిలోమీటర్ల మేర జలవిహారం చేస్తూ, ఏడు ప్రదేశాలను సందర్శించే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గంలో వెళ్లే విధంగా లాంచీ సర్విసులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. – ఎస్వీకే రెడ్డి, సీఈవో, ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ -
సీమాను పాక్ పంపాలంటూ హిందూ దేవాలయంపై దాడి
పాకిస్తాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌కు చెందిన సింధ్‌లోని ఒక హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. సింధ్‌లోని కాష్మోర్ జిల్లాలో స్థానిక హిందూ సంఘాలు నిర్మించిన ఒక దేవాలయంపై దాడి చేయడానికి దుండగులు రాకెట్ లాంచర్‌ను ఉపయోగించారు. అలాగే మైనారిటీ హిందూ కమ్యూనిటీ సభ్యుల ఇళ్లపై వారు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న కాష్మోర్-కంద్‌కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ఇర్ఫాన్ సమ్మో నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. రాకెట్ లాంచర్‌తో దాడి పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం బగ్రీ కమ్యూనిటీ వార్షిక మతపరమైన సేవల కోసం తెరిచిన ఆలయంపై దుండగులు రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడి అకస్మాత్తుగా జరిగింది. కాగా పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకునేంతలో దాడికి పాల్పడినవారు అప్పటికే పారిపోయారు. ఈ దాడిలో 8-9 మంది సాయుధ దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. బగ్రీ వర్గానికి చెందిన డాక్టర్ సురేష్ మాట్లాడుతూ దుండగులు ప్రయోగించిన రాకెట్ వల్ల ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతవాసులు భయంతో కాలం గడుపుతున్నారు. సీమా హైదర్‌ను తిరిగి పాకిస్తాన్ పంపించకపోతే ఇలానే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తామని ఆ దుండగులు బెదిరించారు. 2019లో పాక్‌కు చెందిన సీమా ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ, హిందూ వ్యక్తిని ప్రేమించానంటూ, తన నలుగురు పిల్లలతో సహా భారతదేశానికి వచ్చింది. వీసా లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు సీమాను గ్రేటర్ నోయిడాలోని రబూపురా ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆమె ప్రేమికుడు సచిన్ ఆ ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అక్రమ వలసదారునికి ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే అతను ఇటీవలే విడుదలయ్యాడు. హిందూ సభ్యుల కిడ్నాప్ కాష్మోర్, ఘోట్కీ జిల్లాల్లో శాంతిభద్రతలు క్షీణించడంపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీపీ) ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ సమాజానికి చెందిన 30 మంది సభ్యులను వ్యవస్థీకృత క్రిమినల్ ముఠాలు కిడ్నాప్ చేశాయని హెచ్ఆర్సీపీ పేర్కొంది. ఈ ముఠాలు అధునాతన ఆయుధాలను ఉపయోగించి హిందూ ప్రార్థనా స్థలాలపై దాడి చేస్తామని బెదిరించినట్లు తమకు సమాచారం అందిందని వివరించింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని సింధ్ హోం శాఖను కమిషన్ కోరింది. కరాచీ అనేక పురాతన హిందూ దేవాలయాలకు నిలయంగా ఉంది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ కమ్యూనిటీ సభ్యులు అధికంగా ఉన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్‌లో చైనా ‘పెంగ్’.. భారత్‌లోకి చొరబడుతూ.. -
ఒప్పో కొత్త ఫోన్
చైనా మొబైల్ మేకర్ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎ 71 పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉన్న ఈ డివైస్ ధర రూ.12,990గా ఉంవచ్చని అంచనా. గ్లోబల్‌గా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లను పలకరించనుంది. ఒప్పో ఎ 71 ఫీచర్లు 5.2 డిస్ ప్లే ఆండ్రాయిడ్ నోవాట్ 7.1 720x1280 రిజల్యూషన్ 13 ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3జీబీ ర్యామ్ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే అవకాశం 3000 బ్యాటరీ సామర్ధ్యం -
లెనోవో కె8ప్లస్ లాంచ్.. లాంచింగ్ ఆఫర్స్
సాక్షి,న్యూఢిల్లీ: మొబైల్ ఉత్పత్తిదారు లెనోవా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. లెనోవో కె 8, కె 8 ప్లస్ పేరుతో రెండు డివైస్‌లను ఇండియాలో బుధవారం విడుదల చేసింది. దీని ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా లభించనుంది. ఈ విక్రయాలు రేపటిను నుంచి ప్రారంభంకానున్నాయని లెనోవా ట్విట్టర్‌ద్వారా ప్రకటించింది. కొన్ని వారాలలో ఇది ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్భంగా లాంచింగ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. రూ.10వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్, జియో ఖాతాదారులకు 30జీబీ అదనపుడేటా, మోటోప్లస్ 2 హెడ్ ఫోన్స్ రూ. 599లకే అందిస్తోంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ బై ద్వారా 5 వా. బ్లూటూత్ స్పీకర్‌పై రూ.100 తగ్గింపు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై 15శాతం తగ్గింపును ప్రకటించి. సెప్టెంబర్ 7-8 తేదీల మధ్య ఈ ఆఫర్లు వర్తిస్తాయి. లెనోవో కె8 ప్లస్ ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డాక్ హెలియో పీ25 ఆక్టా కోర్ 2.6 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 13ఎంపీ+ 5ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, And that's a wrap from the #LenovoK8Launch! Hope you're ready for the sale tomorrow for the #LenovoK8Plus, exclusively on @Flipkart. pic.twitter.com/n1oclDVamD — Lenovo India (@Lenovo_in) September 6, 2017 -
అతిచవకధరలో మరో స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ మేకర్ మాఫే మొబైల్ అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎఫర్డబుల్ ధర రూ. 3,999 వద్ద 'ఎయిర్' పేరుతో 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఎయిర్ ను ఫస్ట్ టైం స్మార్ట్‌ఫోన్ యూజర్లనుద్దేశించి రూపొందించామని సావరియా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా ప్రకటించారు. మాఫే ‘ఎయిర్’ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 4 అంగుళాల డిస్ప్లే 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్‌ట్రం ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 2 జీబి ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మెమరీ 32 జీబీకి విస్తరించుకునే అవకాశం 5ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2ఎంపీ సెల్ఫీ కెమెరా 2000ఎంఏహెచ్ బ్యాటరీ , పది గంటల టాక్ టైమ్ -
కొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ ‘బియాండ్’.. ధర?
బ్లాక్‌బెర్రీ బ్రాండ్ స్టార్ట్ఫోన్లను విక్రయించే కల్ట్ ఇపుడు తన సొంత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. 4జీ వీఒఎల్టీఈ ఆధారిత కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ‘బియాండ్’ పేరుతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. తక్కువ ధర సెగ్మెంట్లో దీన్ని రూ. 6,999 లకే అందుబాటులోకి తెచ్చింది. ఈ రీటైలర్ అమెజాన్‌లో ప్రత్యేకంగా ఇది లభ్యం కానుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్న ఈ ఫోన్‌ను ఆగష్టు 18 నుంచి అమెజాన్ సైట్ లో యూజర్లు కొనుగోలు చేయవచ్చని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కంపెనీ ప్రకటించింది. విస్తోసో (Vistoso) ఫీచర్‌తో (టి- షర్ట్స్ , మగ్స్మీద వారి ఇష్టమైన చిత్రాలు ప్రింట్ తీసుకునేలా) కస్టమర్లకు ఆకట్టుకోనుంది. 3 స్లాట్లకు మద్దతు ఇస్తుంది.. రెండు స్లిమ్ స్లాట్ లు, మరో ఎస్డీ స్లాట్లను పొందుపర్చింది. లాంచింగ్ సందర్భంగా ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ హరిప్ సింగ్ మాట్లాడుతూ లక్షలాది మండి అభిలాషకనుగుణంగా గొప్ప కెమెరా నాణ్యత, హై పెర్ఫామెన్స్ లాంటి లక్షణౠలను కల్ట్ బియాండ్ కలిగి ఉందని చెప్పారు. మంచి ఫీచర్లు, అదనపు ప్రయోజనాలతో చాలా ఆకర్షణీయమైన ధర లో లాంచ్ చేసినట్టు చెప్పారు. కల్ట్ బియాండ్ ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ అదనంగా మరో 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ వీవోఎల్టీఈ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ నుంచి వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కల్ట్. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ , నేపాల్‌లో బ్లాక్‌బెర్రీ-బ్రాండ్ పరికరాలు రూపకల్పన, తయారీ, మార్కెటింతోపాటు ప్రత్యేకమైన హక్కులను కలిగి ఉంది. ఇటీవల కల్ట్ ఇటీవల భారతదేశంలో రూ. 39,990 ధరలో బ్లాక్‌బెర్రీ కీ వన్ స్మార్ట్‌ఫోన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
కవాసాకి కొత్త బైక్స్ లాంచ్..ధరలు?
న్యూఢిల్లీ: కవాసాకి తన ఫ్లాగ్ షిప్ మోడల్ బైక్‌లను భారతదేశంలో లాంచ్ చేసింది. జెడ్ 1000, జెడ్ 1000ఆర్ ఎడిషన్లను విడుదల చేసింది. వీటి ధర ధర రూ .14 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. కొత్త బీఎస్-2 ప్రమాణాలతో రూపొందించిన ఈ సరికొత్త బైక్స్ అమ్మకాలను ప్రారంభించింది. జపాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ బైక్ కవాసకీ 2017 మోడల్స్‌ను ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరలను వరసగా రూ 14.49 లక్షల (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ) మరియు రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) ప్రారంభ ధరలుగా ప్రకటించింది. కొత్త కవాసకీ జెడ్ 1000 లోఒక సున్నితమైన విద్యుత్ సరఫరా కోసం సవరించిన ఈసీయుని అమర్చింది. ఈ రెండింటిలో ముందువైపు డ్యూయల్ 310 మిమీ డిస్క్ బ్రేక్ , వెనుకవైపు 250 ఎంఎం డిస్క్ పొందుపర్చింది.. అంతేకాకుండా 41 మిల్లీమీటర్ల సైడ్ డౌన్ ఫోర్క్, ముందు ఓహ్లిన్స్ వెనుక షాక్‌తో పాటు బ్రమ్బో ఎం50 మోనోబ్లోక్ బ్రేక్ కాలిపర్స్ ప్రధాన ఆకర్షణ. జె 1000 ఇంజీన్ 104 సీసీ ఇంజీన్, లిక్విడ్ కూల్డ్ బీఎస్ -4 ఇంజీన్ 142 మాగ్జిమం పవర్, 111 ఎన్ఎం గరిష్ట టార్క్, విత్ సిక్స్ స్పీడ్ గేర్ బ్యాక్స్ సవరించిన ఫ్రంట్ ఫోర్క్ సెట్టింగులు, రివైజ్డ్ వెనుక బ్రేక్ ప్యాడ్, మెరుగైన షాక్అబ్జార్బర్స్ 1435, 2045 వీల్ బేస్, 17 లీటర్ల ఇంధన సామర్ధ్యం జెడ్1000 మెటాలిక్ స్పార్క్ బ్లాక్ , గోల్డెన్ బ్లేజ్ గ్రీన్ లోనూ,జెడ్1000ఆర్ ఎడిషన్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ అండ్ మెటాలిక్ గ్రాఫైట్ గ్రే కలర్స్లోను లభ్యంకానుంది. -
గెలాక్సీకి పోటీగా ఎల్జీ ‘జీ 6’ లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ ఎల్జీ మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఎల్జీ జీ 6 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఫిబ్రవరిలో మొబైల్ వరల్ఢ్ కాంగ్రెస్ లో ప్రకటించిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ధరను కంపెనీ రూ.51,990గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో వస్తున్న జీ 6 ఏప్రిల్ 25నుంచి అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉండనుంది. డాల్బీ విజన్ ఫీచర్ తో వస్తున్న ప్రపంచంలో మొట్టమొదిటి ఫోన్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు హై ఎండ్ టీవీలలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండడం ఈ జీ6 ప్రత్యేకత. ఎల్జీ జీ 6 ఫీచర్లు 5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 2880 x1400 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ క్వాల్కామ్ ఎంఎస్ఎం 8996 స్నాప్ డ్రాగన్821 ప్రోసెసర్ 4జీబీ ర్యామ్ 32జీబీ, 64 ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ దాకా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం 13 మెగాపిక్సెల్ రియర్ డబుల్ కెమెరా 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా జీ 5కి కొనసాగింపుగా వస్తున్న జీ6లో అసాధారణంగా ఫుల్ విజన్ డిస్ప్లేను అందిస్తున్న ట్టు ప్రకటించింది. మిస్టిక్ వూట్, అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. రూ.51,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు రేపటి నుంచి లభ్యం కానుంది. మరోవైపు రూ. 57,990 రేంజ్ లో ఇటీవల లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌కి గట్టిపోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. -
వోడాఫోన్ ఆ మహిళలకు అపూర్వ అవకాశం
న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మహిళలకు బంపర్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే మహిళలకు మెటర్నీటీ సెలవు పథకాన్ని అమలు చేస్తున్న సంస్థ మరోసారి మహిళలకోసం మరో వినూత్నమైన పథకాన్ని లాంచ్ చేసింది. వృత్తిలో విరామం తీసుకున్న మహిళలకు ప్రపంచంలో అతిపెద్ద నియామక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కుటుంబ అవసరాలకోసం ఉద్యోగాలను వదిలిపెట్టిన ప్రతిభ కల మహిళలకు మరో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికోసం రీకనెక్ట్ అనే ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది. రీ ఎంట్రీ ప్రోగ్రామ్ అనేక సంవత్సరాలు పాటు ఉద్యోగంనుంచి వైదొలిగిన ప్రతిభావంతులైన మహిళల కోసం రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా రాబోయే మూడేళ్ళలో 1,000మంది నిపుణులైన మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నిర్ణయించింది. సుమారు 26 దేశాలలో ఈ నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాదు ఈ రీఎంట్రీకోసం అవసరమైన శిక్షణను, మనో ధైర్యాన్ని కూడా వారికి అందించనుంది. శిక్షణ , ప్రేరణ కార్యక్రమాలు రిఫ్రెష్ మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుక సహాయం చేస్తుంది. తద్వారా ప్రొఫనల్ లైప్ లో మళ్లీ పురోగతి సాధించేందుకు వీరిని ప్రోత్సహించనుంది. తన ప్రధాన మార్కెట్లలోని కస్టమర్ బేస్ లో 'లింగవివక్ష' పై కొత్త దృష్టి పెట్టిన సంస్థ భారతదేశం , ఆఫ్రికాలలో ఉన్న ప్రపంచంలోని అతి పేదలుగా ఉన్న 50 మిలియన్ల మహిళలకు మొబైల్ నెట్వర్కును, సేవలను గణనీయంగా విస్తరించాలని భావిస్తోంది. వోడాఫోన్ మెటర్నిటీ పాలసీ 2015 మార్చిలో అంతర్జాతీయమహిళా వారోత్సవాల సందర్భంగా మహిళలకు మెటర్నిటీ ప్రయోజనాలను ప్రకటించింది. 16 వారాల పెయిడ్ లీవ్, 1 వారం పెటర్నిటీ లీవ్( పురుషులకు) , ప్రసవానంతరం తిరగి ఉద్యోగంలో చేరిన మహిళలు తమ బిడ్డ సంరక్షణార్ధం 6 నెలలపాటు 6 గంటల పనిదినాలను ప్రకటించింది. మరోవైపు వోడాఫోన్ నియోగించిన ఆర్థిక పరిశోధన కేపీఎంజీ నివేదిక ప్రకారం కరియర్ లో బ్రేక్ తీసుకున్న 30-35 సం.రాల మధ్య ఉన్న మహిళల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 96 మిలియన్లుగా తేలింది. మేనేజర్ స్థాయి,అంతకంటే పై స్థాయిలో 55 మిలియన్లుగా అంచనా వేసింది. అనుభవమున్న వీరిందరికీ తిరిగి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయని నివేదించింది. స్థూల విలువ ఆధారిత పరంగా అదనపు ఆర్ధిక ప్రయోజనాలు సమకూరతాయని, దాదాపు ఒక సంవత్సరానికి సుమారు 151 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. -
మేరా ఇస్రో మహాన్.
-
మార్కెట్లోకి అత్యంత కాస్లీ బైక్స్