వోడాఫోన్ ఆ మహిళలకు అపూర్వ అవకాశం
న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ అంతర్జాతీయ మహిళా దినం సందర‍్భంగా మహిళలకు బంపర్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే మహిళలకు మెటర్నీటీ సెలవు పథకాన్ని అమలు చేస్తున్న సంస్థ మరోసారి మహిళలకోసం మరో వినూత్నమైన పథకాన్ని లాంచ్ చేసింది. వృత్తిలో విరామం తీసుకున్న మహిళలకు ప్రపంచంలో అతిపెద్ద నియామక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కుటుంబ అవసరాలకోసం ఉద్యోగాలను వదిలిపెట్టిన ప్రతిభ కల మహిళలకు మరో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికోసం రీకనెక్ట్ అనే ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది.
రీ ఎంట్రీ ప్రోగ్రామ్
అనేక సంవత్సరాలు పాటు ఉద్యోగంనుంచి వైదొలిగిన ప్రతిభావంతులైన మహిళల కోసం రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా రాబోయే మూడేళ్ళలో 1,000మంది నిపుణులైన మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నిర్ణయించింది. సుమారు 26 దేశాలలో ఈ నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అంతే కాదు ఈ రీఎంట్రీకోసం అవసరమైన శిక్షణను, మనో ధైర్యాన్ని కూడా వారికి అందించనుంది. శిక్షణ , ప్రేరణ కార్యక్రమాలు రిఫ్రెష్ మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుక సహాయం చేస్తుంది. తద్వారా ప్రొఫనల్ లైప్ లో మళ్లీ పురోగతి సాధించేందుకు వీరిని ప్రోత్సహించనుంది. తన ప్రధాన మార్కెట్లలోని కస్టమర్ బేస్ లో 'లింగవివక్ష' పై కొత్త దృష్టి పెట్టిన సంస్థ భారతదేశం , ఆఫ్రికాలలో ఉన్న ప్రపంచంలోని అతి పేదలుగా ఉన్న 50 మిలియన్ల మహిళలకు మొబైల్ నెట్వర్కును, సేవలను గణనీయంగా విస్తరించాలని భావిస్తోంది.
వోడాఫోన్ మెటర్నిటీ పాలసీ
2015 మార్చిలో అంతర్జాతీయమహిళా వారోత్సవాల సందర్భంగా మహిళలకు మెటర్నిటీ ప్రయోజనాలను ప్రకటించింది. 16 వారాల పెయిడ్ లీవ్, 1 వారం పెటర్నిటీ లీవ్( పురుషులకు) , ప్రసవానంతరం తిరగి ఉద్యోగంలో చేరిన మహిళలు తమ బిడ్డ సంరక్షణార్ధం 6 నెలలపాటు 6 గంటల పనిదినాలను ప్రకటించింది.
మరోవైపు వోడాఫోన్ నియోగించిన ఆర్థిక పరిశోధన కేపీఎంజీ నివేదిక ప్రకారం కరియర్ లో బ్రేక్ తీసుకున్న 30-35 సం.రాల మధ్య ఉన్న మహిళల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 96 మిలియన్లుగా తేలింది. మేనేజర్ స్థాయి,అంతకంటే పై స్థాయిలో 55 మిలియన్లుగా అంచనా వేసింది. అనుభవమున్న వీరిందరికీ తిరిగి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయని నివేదించింది. స్థూల విలువ ఆధారిత పరంగా అదనపు ఆర్ధిక ప్రయోజనాలు సమకూరతాయని, దాదాపు ఒక సంవత్సరానికి సుమారు 151 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.