కవాసాకి బైక్ @ 8 లక్షలు | Kawasaki launches new bike Z800 priced at Rs.8 lakh | Sakshi
Sakshi News home page

కవాసాకి బైక్ @ 8 లక్షలు

Published Tue, Jan 21 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

కవాసాకి బైక్ @ 8 లక్షలు

కవాసాకి బైక్ @ 8 లక్షలు

 న్యూఢిల్లీ: జపాన్ టూవీలర్ కంపెనీ కవాసాకి కొత్త బైక్ మోడల్, జడ్800ను భారత మార్కెట్లోకి సోమవారం విడుదల చేసింది. ఈ  బైక్ ధరను రూ.8.05 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా  నిర్ణయించామని ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ షిగెతో నిషికవ పేర్కొన్నారు. ఈ మోడల్‌బైక్‌ను పూర్తిగా తయారైన బైక్(సీబీయూ-కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో దిగుమతి చేసుకొని విక్రయిస్తామని వివరించారు. ఇప్పటికే ఇలాంటి సీబీయూ మోడళ్లు నాలుగు (14ఆర్, 10ఆర్, జడ్1000, నింజా 1000)ఉన్నాయని,  ఇది ఐదవదని, ఈ ఐదు సీబీయూ మోడళ్లను ఈ ఏడాదికి 400 వరకూ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.  స్థానికంగా అసెంబుల్ చేసే సీకేడీ మోడళ్లు నింజా 300, నింజా 650 మోడళ్లను 1,400 వరకూ అమ్మడం లక్ష్యమని పేర్కొన్నారు. తాజా మోడల్‌తో కలుపుకుంటే ప్రస్తుతం ఈ కంపెనీ భారత్‌లో  మొత్తం ఏడు మోడళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం తమకు భారత్‌లో గతేడాది ఈ కంపెనీ రూ. 12 లక్షల విలువైన జడ్1000, నింజా 1000 బైక్‌లను మార్కెట్లోకి తెచ్చింది.
 
 ప్రత్యేకతలు
 జడ్ ఫ్యామిలీలో రెండో బైక్ ఇది.
 806 సీసీ
 4 స్ట్రోక్
 లిక్విడ్ కూల్ ఇంజిన్, 6 గేర్లు.   గరిష్ట వేగం
 గంటకు 233 కిమీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement