కవాసాకి బైక్ @ 8 లక్షలు
న్యూఢిల్లీ: జపాన్ టూవీలర్ కంపెనీ కవాసాకి కొత్త బైక్ మోడల్, జడ్800ను భారత మార్కెట్లోకి సోమవారం విడుదల చేసింది. ఈ బైక్ ధరను రూ.8.05 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ షిగెతో నిషికవ పేర్కొన్నారు. ఈ మోడల్బైక్ను పూర్తిగా తయారైన బైక్(సీబీయూ-కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో దిగుమతి చేసుకొని విక్రయిస్తామని వివరించారు. ఇప్పటికే ఇలాంటి సీబీయూ మోడళ్లు నాలుగు (14ఆర్, 10ఆర్, జడ్1000, నింజా 1000)ఉన్నాయని, ఇది ఐదవదని, ఈ ఐదు సీబీయూ మోడళ్లను ఈ ఏడాదికి 400 వరకూ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. స్థానికంగా అసెంబుల్ చేసే సీకేడీ మోడళ్లు నింజా 300, నింజా 650 మోడళ్లను 1,400 వరకూ అమ్మడం లక్ష్యమని పేర్కొన్నారు. తాజా మోడల్‌తో కలుపుకుంటే ప్రస్తుతం ఈ కంపెనీ భారత్‌లో మొత్తం ఏడు మోడళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం తమకు భారత్‌లో గతేడాది ఈ కంపెనీ రూ. 12 లక్షల విలువైన జడ్1000, నింజా 1000 బైక్‌లను మార్కెట్లోకి తెచ్చింది.
ప్రత్యేకతలు
జడ్ ఫ్యామిలీలో రెండో బైక్ ఇది.
806 సీసీ
4 స్ట్రోక్
లిక్విడ్ కూల్ ఇంజిన్, 6 గేర్లు. గరిష్ట వేగం
గంటకు 233 కిమీ.