సాక్షి, ముంబై: జపాన్‌కు చెందిన ప్రముఖ బైక్స్ తయారీదారు సరికొత్త అప్‌డేట్స కవాసాకి మరో సూపర్‌బైక్‌ను లాంచ్ చేసింది. సరికొత్త, డిజైన్, అప్‌డేట్స్‌తో ఈ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ 2021 పేరుతో తీసుకొచ్చిన దీని ధరను అక్షరాలా 15 లక్షలుగా నిర్ణయించింది. తద్వారా మరో సూపర్‌బైక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ (వరల్డ్‌ఎస్‌బికె) టైటిల్ రేసులో దూసుకుపోనుంది. లైమ్ గ్రీన్, ఫ్లాట్ ఎబోనీ టైప్ 2 అనే 2 రంగులలో ఇది లభిస్తుంది. (ఆల్‌న్యూ క్రెటా అమ్మకాల జోరు)
2021 కవాసాకి నింజా జెడ్‌ఎక్స్ -10 ఆర్ ఫీచర్లు
998 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజీన్ ( ఇన్-లైన్ 4 మోటారు) 13,200 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 203 పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 11,400 ఆర్‌పీఎం వద్ద 114.9 ఎన్‌ఎం గరిష్ట టార్క్ ను అందిస్తుంది . 6 స్పీడ్ గేర్‌బాక్స్ అప్‌డేటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఆల్-ఎల్ఇడి లైటింగ్, షోవా బిఎఫ్ఎఫ్ (బ్యాలెన్స్ ఫ్రీ ఫ్రంట్ ఫోర్క్), షోవా బిఎఫ్‌ఆర్‌సి లైట్ (బ్యాలెన్స్ ఫ్రీ రియర్ కుషన్) వెనుక మోనోషాక్, ఎలక్ట్రానిక్ థొరెటల్ వాల్వ్స్, కొత్త ఎయిర్-కూల్డ్ ఆయిల్ కూలర్, క్లోజ్-రేషియోను కలిగి ఉంది. ఇంకా టిఎఫ్‌టి డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, 3 పవర్ మోడ్స్ (ఫుల్,మీడియం, లో), మూడు రైడింగ్ మోడ్స్ (స్పోర్ట్ / రోడ్ /రైన్ /రైడర్ (మాన్యువల్) ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ అనే 5 మోడ్స్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. విండ్‌స్క్రీన్‌తోపాటు సైడ్ ప్యానెల్స్‌తో పాటు అప్‌డేట్ చేసింది. అలాగే హ్యాండిల్ బార్ అండ్ ఫుట్ పెగ్ పొజిషన్లను కూడా ఇచ్చింది. రియర్ సీటును సౌకర్యవంతంగా రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment