ఆటోమొబైల్ సెక్టార్‌లో చిన్నా పెద్దా, దేశీ, విదేశీ తేడా లేకుండా వరుసగా ఒక్కో కంపెనీ తమ ఉత్పత్తుల ధర పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం కవాసాకి చేరింది.
స్పోర్ట్స్‌లో స్పెషల్
ఒకప్పుడు బజాజ్‌తో జత కట్టి ఇండియాలో బైకుల మార్కెట్‌లో అడుగు పెట్టింది కవాసాకి. ఆ తర్వాత ఇండియన్ మార్కెట్ ఇక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగిల్‌గా స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా కవాసాకిలో నింజా సిరీస్ బైకులు చాలా పాపులర్. స్టైలింగ్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో ఇండియాలో మార్కెట్‌లో తనదైన ముద్ర వేసింది కవాసాకి.
పాపులర్ మోడళ్లపై
స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కి చక్కని ప్రత్యామ్నాయంగా మారిన కవాసాకి తాజాగా తన ప్రొఫైల్‌లో ఉన్న పాపులర్ మోడల్ బైకుల ధరలను పెంచాలని నిర్ణయించింది. 2022 జనవరి 1 నుంచి తమ కంపెనీ నుంచి మార్కెట్‌లో ఉన్న అన్ని రకాల బైకుల ధరలను పెంచుతున్నట్టు కవాసాకి ప్రకటించింది.
రూ.23,000 పెంపు
కవాసాకిలో తక్కువ ధర బైకుగా నింజా 300 మోడల్ ఉంది. ఈ బైకు ధర ప్రస్తుతం రూ.3,24,00 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ మోడల్‌పై కనిష్టంగా రూ.6000 వంతున ధర పెరిగింది. ఇక హైఎండ్ మోడల్ నింజా జెడ్‌ఎక్స్ -10ఆర్ ధర రూ. 15,37,000లు ఉండగా ఈ మోడల్‌పై రూ.23,000 వంతున ధర పెరిగింది. ఇక లేటెస్ట్ మోడల్ జెడ్ 650 ఆర్‌ఎక్స్ ధర రూ.13,000 పెరిగి జనవరి 1 నుంచి రూ.6,72,000లు కానుంది.
ముందుగా బుక్ చేసుకుంటే
డిసెంబరు 31లోపు బైకులను కొనుగోలు చేసిన వారికి పాత ధరలే వర్తిస్తాయని, అయితే బుక్ చేసిన తర్వాత 45 రోజుల్లోగా డెలివరీ ఇస్తామని కవాసాకి అంటోంది. ఇక ధరల పెంపు నుంచి వెర్సేస్ 650, జెడ్ 650, జెడ్ హెచ్2, జెడ్ హెచ్2 ఎస్‌ఈ మోడళ్లకు ధరల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది.
చదవండి:పాత కార్లలో యూత్ రైడ్
Comments
Please login to add a commentAdd a comment