న్యూఢిల్లీ: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా భారత మార్కెట్‌లో రెండు గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ బైక్‌లను విడుదలచేసింది. ఆర్‌ఎం–జెడ్ 250 పేరిట విడుదలైన బైక్ ధర రూ.7.10 లక్షలు కాగా, ఆర్‌ఎం–జెడ్ 450 మోడల్ ధర రూ.8.31 లక్షలుగా నిర్ణయించినట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిదా మాట్లాడుతూ.. ‘గత కొంత కాలంగా భారత్‌లో ఆఫ్–రోడింగ్ విభాగానికి చెందిన బైక్‌లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాహసోపేతమైన రైడింగ్ కోరుకునేవారి సంఖ్య ఊపందుకుంటోంది. ఈ కారణంగానే నేటితరం యువత అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకున్న ఈ బైక్‌లను విడుదలచేశాం.’ అని వ్యాఖ్యానించారు.
సుజుకీ.. రెండు ఆఫ్‌రోడ్ బైక్‌లు
Published Thu, Oct 4 2018 12:59 AM | Last Updated on Thu, Oct 4 2018 12:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment