misfires gun
-
తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే..
వాషింగ్టన్: అమెరికాలో ఒకే నెలలో ఒకే తరహా మరణాలు రెండు చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి మూడేళ్ళ తన చిట్టి చెల్లిని చేజేతులా చంపుకున్నాడు ఓ బుడతడు. ఆ సంఘటన ఇంకా మరువక ముందే అచ్చంగా అలాగే తన తుపాకీని తుడుచుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి తన భార్యను హతమార్చాడు మరో అభాగ్యుడు. వెంటనే అచేతన స్థితికి వెళ్ళిపోయిన అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత తాను ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో అర్ధం చేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. చికాగోకు చెందిన సిమియోన్ హెన్డ్రిక్సన్(61) తుపాకులు కాల్చడంలో శిక్షణనిస్తూ ఉంటాడు. జులై 15న తీరిక దొరికడంతో ఇంటిలోని తుపాకులను శుభ్రం చేసే పనికి ఉపక్రమించాడు. కానీ దురదృష్టవశాతూ ఒక తుపాకి తన చేతిలోనే పేలిపోయింది. ఆ తుపాకీ లోంచి వెళ్లిన బుల్లెట్ అక్కడే ఉన్న అతని భార్య లారీ హెన్డ్రిక్సన్(60) తలకు తగలడంతో ఆమె ఉన్నచోటనే కుప్పకూలింది. విభ్రాంతికి గురైన సిమియోన్ కొద్దీ సేపటికి తేరుకుని జరిగిన దారుణాన్ని తలచుకుని కుమిలిపోయి తుపాకిని తనవైపు ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. తుపాకీ పేలుళ్ల చప్పుడుకి చుట్టుపక్కలవారు సమాచారమిచ్చారో లేక స్వయంగా సిమియోనే చెప్పాడో స్పష్టత లేదని చెప్పిన పోలీసులు విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. సిమియోన్ అక్కడికక్కడే చనిపోగా అతని భార్య లారీ మాత్రం కోన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు చికాగో పోలీసులు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవంతో వారి ఒక్కగానొక్క కుమారుడు డెరెక్ హెన్డ్రిక్సన్ శోకతప్త హృదయంతో పేస్ బుక్ లో విచారాన్ని వ్యక్తం చేస్తూ.. "వారిని అందరూ ఎంతగానో ప్రేమించి, అభిమానించేవారు. వారు ఎప్పటికీ గొప్ప తల్లిదండ్రులుగా మిగిలిపోతారు." అని రాశాడు. ఇది కూడా చదవండి: కంపెనీ డబ్బులు రూ.21 లక్షలు కొట్టేసి ఏం చేశాడో తెలుసా? -
విచిత్ర విధి.. ఒకటి కాదు రెండు ప్రాణాలు బలి!
బెంగళూరు: దేశ వ్యాప్తంగా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో.. ఎన్నో విషాదాలు జరిగి ఉండొచ్చు. వందల నుంచి వేల మంది ప్రాణాలు పోయి ఉండొచ్చు. కానీ, కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఘటన మాత్రం విధి ఎంత విచిత్రమైందో అని అనిపించేలా ఉంది. శివమొగ్గ విద్యానగర్‌లో జరిగిన కొత్త సంవత్సరం వేడుక.. ఇద్దరి ప్రాణాలు బలిగొంది. వేడుకలో ఓ పెద్దాయన అతి ప్రదర్శనకు దిగబోయాడు. ఈ క్రమంలో ఆ వ్యాపారవేత్త ఓ రీసెర్చ్ స్కాలర్‌ను బలి తీసుకోవడంతో పాటు తన ప్రాణం పొగొట్టుకున్నాడు కూడా. బిజ్‌మన్ మంజునాథ్ ఒలేకార్(67) అనే వ్యాపారవేత్త విద్యానగర్ 4వ క్రాస్‌లో కొత్త సంవత్సరం వేడుకను నిర్వహించాడు. ఆ ఈవెంట్‌కు కుటుంబంతో పాటు స్నేహితులను 50 మంది దాకా ఆహ్వానించాడు. అంతా పార్టీలో మునిగి తేలాక.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు తన డబుల్ బ్యారెల్ గన్ను పేల్చడానికి సిద్ధం అయ్యారు. సరిగ్గా 12 గంటల సమయంలో తూటా అమర్చి పేల్చే యత్నం చేశాడు. అయితే.. అది పొరపాటున పేలి తన పక్కనే ఉన్న వినయ్(34) అనే యువకుడిలోకి తూటా దూసుకెళ్లింది. వెంటనే వినయ్‌ని ఆస్పత్రికి తరలించారు అక్కడున్నవాళ్లు. అయితే ఆ ఘటనతో ఒలేకార్ షాక్ తిన్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న వినయ్‌కి ఏమైందోనని భయాందోళనకు గురయ్యాడు. ఆ క్రమంలో ఊపిరి ఆడక.. అక్కడికక్కడే కుప్పకూలాడు. షాక్‌లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు వినయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశాడు. ఒలేకర్ కొడుకు స్నేహితుడైన వినయ్.. పీహెచ్డీ స్కాలర్. అతని తండ్రి పీడబ్ల్యూడీ ఇంజినీర్. మంజునాథ్ ఒలేకార్ కాల్చింది లైసెన్స్డ్ రివాల్వర్ అవునా? కాదా? అనే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. గతంలోనూ ఆయన ఇలా బహిరంగంగా తుపాకినీ గాల్లోకి కాల్చాడని స్థానికులు కొందరు చెప్తున్నారు. -
రైఫిల్ మిస్‌ఫైర్
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం రైఫిల్ మిస్‌ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఏఆర్ విభాగంలో యార్లగడ్డ శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఎలక్ట్రానికల్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) గోడౌన్ వద్ద ఆయనకు గార్డు డ్యూటీ వేశారు. ఆదివారం విధులకు హాజరైన శ్రీనివాసరావు సెక్యూరిటీ రూమ్‌లో భద్రపర్చిన కార్బన్ రైఫిల్‌ను శుభ్రం చేసేందుకు బయటకు తీశాడు. దానిని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలింది. రైఫిల్‌లోంచి దూసుకొచ్చిన బుల్లెట్ ఎదురుగా ఉన్న గోడకు తగిలి వెనక్కి వచ్చి శ్రీనివాసరావు ఛాతి ఎడమ భాగంలోంచి వీపు గుండా బయటికి వెళ్లింది. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే గార్డు డ్యూటీలో ఉన్న మరో కానిస్టేబుల్ ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఏఆర్ ఏఎస్పీ ప్రసాద్, డీఎస్పీ విజయ్‌కుమార్, చిలకలపూడి సీఐ అంకబాబు తదితరులు హుటాహుటిన కలెక్టరేట్‌కు చేరుకున్నారు. శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రైఫిల్ ప్రమాదవశాత్తు పేలిందా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణ జరపాల్సిందిగా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పోలీసు అధికారులను ఆదేశించారు. -
తుపాకీ మిస్ ఫైర్.. హోంగార్డు భార్య మృతి
సాక్షి, విజయవాడ: తుపాకీ పేలి హోంగార్డు భార్య మృతి చెందిన ఘటన నగరంలో జరిగింది. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ శశిభూషణ్ వద్ద అసిస్టెంట్‌గా హోంగార్డు వినోద్ విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం శశిభూషణ్ అనంతపురం క్యాంప్‌కు వెళ్లగా.. హోంగార్డు వినోద్ వద్ద ఏఎస్పీ తుపాకీ ఉంది. హోంగార్డు.. ఆదివారం రాత్రి తన భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్‌ఫైర్ అయ్యింది. ఆమె గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో భార్య సూర్య రత్నప్రభ అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమ్మో.. కింగ్ కోబ్రా: భయంతో జనం పరుగులు పాజిటివ్ వచ్చింది బాబూ; పకోడీలు వేసి వస్తా! -
తుపాకీ మిస్ ఫైర్.. ఆర్మీ జవాన్ మృతి
అర్ధవీడు: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మృతి చెందాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులకు సోమవారం అధికారుల నుంచి సమాచారం అందింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన తమ్మినేని అశోక్‌కుమార్ (21) రెండేళ్ల కిందట ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం విధుల్లో ఉండగా తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అశోక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తల్లిదండ్రులు నరసింహారావు, కాశమ్మలకు సమాచారం అందింది. భౌతికకాయాన్ని స్వగ్రామమైన పాపినేనిపల్లెకు తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. మృతుడికి ఒక సోదరుడున్నాడు. -
పెద్దపల్లిలో తుపాకి మిస్ పైర్ కలకలం
-
గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే తల పేలిపోయింది
పట్నా : యువతీయువకులు తమ వెర్రి చేష్టలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలు, వీడియోకాల్‌లు అంటూ సిల్లీగా అనిపించే విషయాలను కూడా సీరియస్‌గా తీసుకుంటూ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తూ తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. చేతిలోని తుపాకీ అనూహ్యంగా పేలడంతో ఆ బుల్లెట్ నేరుగా తలలో నుంచి దూసుకుపోయి అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే, ఆ గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ పరీక్షల్లో తప్పాడని కుటుంబం వేధించిన క్రమంలో ఆ ఒత్తిడి తట్టుకోలేకే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మరో కథనం వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అకాష్ కుమార్ (బంటీ) అనే 19 ఏళ్ల యువకుడిది బిహార్‌లోని సాయిచాక్ అనే గ్రామం. అతడు సోమవారం తన ప్రియురాలికి వాట్సాప్ ద్వారా వీడియోకాల్ చేశాడు. ఆ సమయంలో సెమీ ఆటోమేటిక్ పిస్టల్ చేతిలో పట్టుకొని సరదాగా ఆటపట్టిస్తూ తలకు గురిపెట్టుకొని మాట్లాడాడు. ఆటలు కాదని, వెంటనే బుల్లెట్లు అందులో నుంచి తీసేయాలని తన గర్ల్‌ఫ్రెండ్ కోరడంతో బుల్లెట్లు తీసేశాడు. అయితే, అందులో ఒక బుల్లెట్ మాత్రం మిగిలిపోయింది. అది గమనించకుండా మరోసారి ప్రియురాలికి చూపిస్తూ అతడు ట్రిగ్గర్ నొక్కాడు. దాంతో అందులో ఉన్న ఒక్క బుల్లెట్ కాస్త నేరుగా అతడి తలలో నుంచి దూసుకెళ్లి తన ఇంట్లోని బెడ్‌పైనే చనిపోయాడు. కాగా, ఆకాశ్ బంధువులు మాత్రం అతడు చనిపోవడానికి గర్ల్‌ఫ్రెండ్ కారణం అని ఆమెపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించారు. -
మత్తులో రైఫిల్‌తో చెలగాటం
♦ పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు ♦ తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ దొడ్డబళ్లాపు(బెంగళూరు)రం: పోలీస్ కానిస్టేబుల్ ఒకరు స్టేషన్‌లోని రైఫిల్‌తో ఆట్లాడుతుండగా బుల్లెట్లు కడుపులోకి దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన దేవనహళ్లి తాలూకా చెన్నరాయపట్టణ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్(40) స్టేషన్లో సెంట్రి డ్యూటీకి హాజరయ్యాడు. రైఫిల్ తీసుకుని షూట్ చేసుకుంటున్నట్టు, పైకి ఎక్కిపెట్టినట్లు ఫొజులు ఇస్తుండగా ప్రమాద వశాత్తు మిస్‌ఫైర్ అయ్యి అతని పొట్టలోకి తూటా దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను బెంగళూరు కొలంబియా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్ చెన్నరాయపట్టణ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించి సిబ్బంది వద్ద సమాచారం తెలుసుకున్నారు. కాగా రమేష్ డ్యూటీకి హాజరైన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు రైటర్, సిబ్బంది చెబుతున్నారు.