misfired
-
తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే..
వాషింగ్టన్: అమెరికాలో ఒకే నెలలో ఒకే తరహా మరణాలు రెండు చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి మూడేళ్ళ తన చిట్టి చెల్లిని చేజేతులా చంపుకున్నాడు ఓ బుడతడు. ఆ సంఘటన ఇంకా మరువక ముందే అచ్చంగా అలాగే తన తుపాకీని తుడుచుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి తన భార్యను హతమార్చాడు మరో అభాగ్యుడు. వెంటనే అచేతన స్థితికి వెళ్ళిపోయిన అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత తాను ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో అర్ధం చేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. చికాగోకు చెందిన సిమియోన్ హెన్డ్రిక్సన్(61) తుపాకులు కాల్చడంలో శిక్షణనిస్తూ ఉంటాడు. జులై 15న తీరిక దొరికడంతో ఇంటిలోని తుపాకులను శుభ్రం చేసే పనికి ఉపక్రమించాడు. కానీ దురదృష్టవశాతూ ఒక తుపాకి తన చేతిలోనే పేలిపోయింది. ఆ తుపాకీ లోంచి వెళ్లిన బుల్లెట్ అక్కడే ఉన్న అతని భార్య లారీ హెన్డ్రిక్సన్(60) తలకు తగలడంతో ఆమె ఉన్నచోటనే కుప్పకూలింది. విభ్రాంతికి గురైన సిమియోన్ కొద్దీ సేపటికి తేరుకుని జరిగిన దారుణాన్ని తలచుకుని కుమిలిపోయి తుపాకిని తనవైపు ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. తుపాకీ పేలుళ్ల చప్పుడుకి చుట్టుపక్కలవారు సమాచారమిచ్చారో లేక స్వయంగా సిమియోనే చెప్పాడో స్పష్టత లేదని చెప్పిన పోలీసులు విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. సిమియోన్ అక్కడికక్కడే చనిపోగా అతని భార్య లారీ మాత్రం కోన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు చికాగో పోలీసులు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవంతో వారి ఒక్కగానొక్క కుమారుడు డెరెక్ హెన్డ్రిక్సన్ శోకతప్త హృదయంతో పేస్ బుక్ లో విచారాన్ని వ్యక్తం చేస్తూ.. "వారిని అందరూ ఎంతగానో ప్రేమించి, అభిమానించేవారు. వారు ఎప్పటికీ గొప్ప తల్లిదండ్రులుగా మిగిలిపోతారు." అని రాశాడు. ఇది కూడా చదవండి: కంపెనీ డబ్బులు రూ.21 లక్షలు కొట్టేసి ఏం చేశాడో తెలుసా? -
కాల్పుల కలకలం.. ఎయిర్‌గన్ మిస్‌ఫైర్
సాక్షి, సిద్ధిపేట: మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఎయిన్ గన్ మిస్‌ఫైర్ కావడంతో వ్యక్తి మృతి చెందాడు. ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి హైదరాబాద్ నుంచి స్నేహితులు రాగా, రాత్రి జరిగిన పార్టీలో ఎయిర్‌గన్ మిస్‌ఫైర్ అయ్యింది. గోడకు పాయింట్ రంథ్రం ఏర్పాటు చేసిఎయిర్ గన్‌తో పైరింగ్ చేస్తుండగా, ఎయిర్గన్లో ఒక బుల్లెట్ గోడకు తగిలి తిరిగి రివర్స్‌లో వెనక్కు వచ్చి యువకుడి తలకు బలంగా తగలడంతో మృతి చెందడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. -
చేతిలో పేలిన గన్.. పరిస్థితి విషమం!
-
చేతిలో పేలిన గన్.. పరిస్థితి విషమం!
సాక్షి, కొమురంభీం జిల్లా: తిర్యాణీ పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. స్పెషల్ పార్టీకి చెందిన కిరణ్ గన్ శుభ్రం చేస్తుండగా పేలింది. బుల్లెట్ అతని తలలోకి దూసుకెళ్లింది. క్షతగాత్రున్ని హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
మిస్‌ఫైర్ అయిన ఎస్ఎల్ఆర్ గన్
పశ్చిమగోదావరి : అది పోలీసు జిల్లా కార్యాలయం ...సమయం శనివారం తెల్లవారు జామున 5.30 గంటలు.. అకస్మాత్తుగా తుపాకీ పేలిన శబ్ధం ... దీంతో ఉలిక్కి పడిన సిబ్బంది.. అధికారులు అక్కడకు చేరుకుని ఏమైందో ఆర్ధంకాక ఉరుకులు పరుకులు పెట్టారు. సంఘటనా స్థలాన్ని చేరుకుని డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను ప్రశ్నించారు. తుపాకీ మిస్ ఫైర్ అయిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర కలవరాన్ని సృష్టించిన ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు పొలీస్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎన్.చినబాబు డ్యూటీపై ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న ఏఆర్ విభాగానికి శనివారం తెల్లవారు జామున వచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న కొవ్వూరు పోలీస్టేషన్‌కు చెందిన షాజహాన్తో కొతంసేపు ముచ్చటించాడు. ఇద్దరి వద్ద బందోబస్తు నిమిత్తం ఒకే రకమైన తుపాకీలు ఉన్నాయి. షాజహాన్ చేతిలో ఉన్న తుపాకీని బాత్రూమ్కు వెళ్లి వచ్చే వరకూ పట్టుకోమని చినబాబుకు ఇచ్చాడు. కొద్దిసేపటికే షాజహాన్ వచ్చి తన తుపాకీని తీసుకుని , డ్యూటీ పూర్తయిదంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే షాజహాన్‌కు ఆయన తుపాకీ బదులు పొరపాటున చినబాబుకు చెందిన లోడ్ కాని తుపాకీని ఇచ్చాడు. ఇంటికి వెళ్లే తొందరలో షాజహాన్ తుపాకీని పరిశీలించకుండానే తీసుకువెళ్ళి పోయాడు. కొద్దిసేపటి అనంతరం చినబాబు తన తుపాకీని లోడ్ చేయాలనే ప్రయత్నంలో ఖాళీ తుపాకీ అనుకుని షాజహాన్ లోడెడ్ తుపాకీ టిగర్ను నొక్కాడు. దీంతో ఒక్క సారిగా తుపాకీ పెద్ద శబ్దంతో మిస్ ఫైర్ అయింది. తుపాకీలు రెండూ ఒకే రకంగా ఉండటం, పొరపాటున షాజహాన్ తుపాకీ చినబాబు దగ్గరకు రావడం, దానిని ఖాళీ తుపాకీ అనుకుని అజాగ్రత్తగా హ్యండెల్ చేయడం వల్లే మిస్ ఫైర్ జరిగిందని ఏఆర్ డీఎస్పీ కె. కోటేశ్వరరావు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని, బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిస్‌ఫైర్ చేసిన కానిస్టేబుల్ చినబాబు సస్పెన్షన్ జిల్లా ఏఆర్ పోలీసు కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన తుపాకీ పేలుడు సంఘటనకు బాధ్యులైన మొగల్తూరుకు చెందిన కానిస్టేబుల్ ఎన్.చినబాబును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ విచారణ అధికారిగా ఏఆర్డీఎస్పీ కె.కోటేశ్వరరావును ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. (ఏలూరు)