
సాక్షి, సిద్ధిపేట: మద్దూరు మండలం సలాక్‌పూర్ గ్రామంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఎయిన్ గన్ మిస్‌ఫైర్ కావడంతో వ్యక్తి మృతి చెందాడు. ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి హైదరాబాద్ నుంచి స్నేహితులు రాగా, రాత్రి జరిగిన పార్టీలో ఎయిర్‌గన్ మిస్‌ఫైర్ అయ్యింది. గోడకు పాయింట్ రంథ్రం ఏర్పాటు చేసిఎయిర్ గన్‌తో పైరింగ్ చేస్తుండగా, ఎయిర్‌గన్‌లో ఒక బుల్లెట్ గోడకు తగిలి తిరిగి రివర్స్‌లో వెనక్కు వచ్చి యువకుడి తలకు బలంగా తగలడంతో మృతి చెందడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.