Air gun
-
Asian Airgun Championship 2022: భారత్ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు
డేగూ (కొరియా): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి. -
ఎయిర్ రివాల్వర్‌తో ఆటలు.. బల్లిని కాల్చబోతే బాలుడికి గాయం..
సాక్షి, హైదరాబాద్: క్రీడల కోసమంటూ ఖరీదు చేసిన ఎయిర్ రివాల్వర్‌తో ఓ పాతబస్తీ వాసి ఆటలాడాడు. అప్పటి వరకు వీధికుక్కలపై కాల్పులు జరిపిన అతగాడు గోడపై ఉన్న బల్లిని కాల్చాలని ప్రయత్నించాడు. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కావడంతో సమీపంలో ఉన్న బాలుడి వీపులోకి దూసుకుపోయింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మొఘల్‌పుర పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఎ.శివ కుమార్ వివరాలు వెల్లడించారు. సుల్తాన్‌షాహీ కైసర్ హోటల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీం కుమారుడు మహ్మద్ అఫ్జల్ అఫ్సర్ వాటర్ ప్లాంట్, పాన్ షాపు నిర్వహిస్తుంటాడు. ఇతడు 2021 అక్టోబర్ 21న అబిడ్స్‌లోని ఏషియన్ ఆరమ్స్ దుకాణం నుంచి 0.117 క్యాలిబర్ ఎయిర్ రివాల్వర్ ఖరీదు చేశాడు. ఆ సందర్భంలో క్రీడల కోసమంటూ (స్పోర్ట్స్) రూ.17,700 వెచ్చించి దీనిని కొన్నాడు. ఈ రివాల్వర్‌లో చెర్రాలను తూటాల మాదిరిగా వినియోగించే అఫ్సర్ ఇంట్లో గోడలపై ఉన్న బల్లులు, వీధికుక్కలను కాలుస్తుంటాడు. సోమవారం (ఈ నెల 1వ తేదీ) ఉదయం 10.30–11 గంటల మధ్య ఇలానే చేస్తున్న అఫ్సర్‌ను ఓ బాలుడు కలిశాడు. గోడపై ఉన్న బల్లిని కాల్చాల్సిందిగా కోరాడు. ఇతడు అదే పని చేయగా.. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కారణంగా దిశ మార్చుకుని దూసుకుపోయింది. ఇంటి పక్కన ఉండే సయ్యద్ మోహసీన్ అలీ కుమారుడు ఆజాన్ (9) బయటకు ఆడుకుంటున్నాడు. ఈ చెర్రా వేగంగా వెళ్లి ఆజాన్ వీపులోకి దూసుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న క్లీనిక్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆపై మెరుగైన వైద్య సేవల చికిత్స నిమిత్తం బుధవారం బహదూర్‌పురాలోని మరో ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న బాలుడిని వైద్యులు శుక్రవారం డిశ్చార్జి చేశారు. చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి ఆజాన్ తండ్రి సయ్యద్ మెహసీన్ అలీ ఫిర్యాదు మేరకు మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అఫ్సర్ కోసం గాలిస్తున్నారు. ఎయిర్ రివాల్వర్, పిస్టల్, గన్స్కు లైసెన్స్ అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇలా జంతువులను కాల్చడం, ఎదుటి వారిని గాయపరచడం మాత్రం నేరమేనని స్పష్టం చేస్తున్నారు. నిందితుడు చిక్కిన తర్వాత విచారణలో, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడికి బాలుడి కుటుంబానికి మధ్య ఆరి్థక లావాదేవీలు ఉన్నాయని, వీటి నేపథ్యంలోనే కొన్ని స్పర్థలు కూడా వచ్చాయని తెలుస్తోంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశాలపై ఫిర్యాదుదారుడి నుంచి వాంగ్మూలం సేకరించాలని నిర్ణయించారు. -
ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి.. కేసులో ట్విస్ట్.. జరిగింది ఇదే!
సాక్షి, సంగారెడ్డి: ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరమీదకొచ్చింది. ఇప్పటి వరకు నాలుగేళ్ల చిన్నారి సాన్వి ఎయిర్ గన్‌తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలడంతో ఆమె కణతలోకి గుండు దూసుకుపోయి చనిపోయిందని అనుకున్నారు. అయితే ఎయిర్ గన్ పేలుడులో చిన్నారిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగానే దగ్గరి నుంచి కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. పామ్‌హౌజ్‌లో 17 ఏళ్ల యువకుడు గన్‌తో ఆడుతూ ఫైర్ చేయగా అటుగా వెళ్తున్న బాలిక సాన్వీకి పిల్లిట్ తగిలినట్లు పోలీసులు తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలి శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు మృతిచెందిన చిన్నారి మృతదేహం ఇంకా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. గురువారం ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులోని నిందితులను పఠాన్ చెరు పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఎయిర్ గన్ ఘటనపై డీఎస్పీ భీమ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. చదవండి: రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు ‘మార్చి 16న 12 గంటల సమయంలో జిన్నారం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. ప్రసాద్ ఫామ్ హౌస్‌లో నాగరాజు అనే వ్యక్తి వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఆన్ లైన్లో రూ. 26 వేలకు ఎయిర్ గన్ ప్రసాద్ కొనుగోలు చేసి నిర్లక్ష్యంగా తన ఫామ్‌హౌజ్‌లో వాచ్మెన్ గదిలో ఉంచాడు. ఎయిర్ గన్‌కు లైసెన్స్ అవసరం లేదు. నాగరాజు ఇంటికీ బంధువులు వచ్చారు అందులో 17 ఏళ్ళ యువకుడు గన్‌తో అడుతూ ఫైర్ చేశాడు. దీంతో అటు వైపుగా వస్తున్న 4 ఏళ్ళ బాలికకు పిల్లెట్ తగిలింది. పిల్లెట్ కణతి మీద తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. 17 ఏళ్ళ బాలుడిని, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నాం. 109, 176 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం’ అని డీఎస్పీ తెలిపారు. -
పిల్లల చేతిలో పేలిన ఎయిర్‌గన్
జిన్నారం(పటాన్చెరు): ఎయిర్‌గన్ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబంలో విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన నాగరాజు, సుకన్యలు వావిలాలలోని ఓ ఫాంహౌస్‌లో వ్యవసాయ పనులు చేసేందుకు మూడునెలల క్రితం వలస వచ్చారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె సాన్వి, రెండేళ్ల కుమారుడు ప్రేమ్కుమార్లు ఉన్నారు. ఫాంహౌస్‌లో వివిధ రకాల పంటలను సాగు చేస్తుండటంతో కోతులు, పక్షులను చెదరగొట్టేందుకు ఎయిర్‌గన్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పటివరకు నాగరాజు దానిని ఉపయోగించలేదు. అందులో గుండ్లు ఉన్న విషయం కూడా అతనికి తెలియదు. సాన్వి, ప్రేమ్కుమార్లు గన్‌తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలింది. ఎదురుగా ఉన్న సాన్వి కణతలోకి గుండు గుచ్చుకుపోయి రక్తస్రావంతో కింద పడిపోయింది. హుటాహుటిన సాన్విని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాన్వి బుధవారం ఉదయం మృతి చెందింది. వైద్యులు పోలీసులకు సమాచారాన్ని అందించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్ గ్రామంలోనూ ప్రాక్టీస్ చేస్తుండగా ఎయిర్‌గన్ పేలి ఐదు నెలల క్రితం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. -
సంగారెడ్డిలో ఎయిర్ గన్ పేలి నాలుగేళ్ల చిన్నారి మృతి
సాక్షి, సంగారెడ్డి(మెదక్): ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలింది. పిల్లలు గన్‌తో ఆడుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంలో శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప గాయపడింది. దీంతో బాలికను హుటాహుటినా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్ లేదా.. నో ప్రాబ్లమ్! అయితే చికిత్స పొందుతూ తెల్లవారు జామున 2 గంటలకు మృతి చెందింది. పాప మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా ఈ ఘటన మంగళవారం రాత్రి పది గంటల సమయంలో జరిగినట్లు పఠాన్ చెరువు డీఎస్పీ భీం రెడ్డి తెలిపారు. ప్రసాద్ అనే వ్యక్తి ఫామ్ హౌజ్‌లో సంఘటన జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -
కాల్పుల కలకలం.. ఎయిర్‌గన్ మిస్‌ఫైర్
సాక్షి, సిద్ధిపేట: మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఎయిన్ గన్ మిస్‌ఫైర్ కావడంతో వ్యక్తి మృతి చెందాడు. ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి హైదరాబాద్ నుంచి స్నేహితులు రాగా, రాత్రి జరిగిన పార్టీలో ఎయిర్‌గన్ మిస్‌ఫైర్ అయ్యింది. గోడకు పాయింట్ రంథ్రం ఏర్పాటు చేసిఎయిర్ గన్‌తో పైరింగ్ చేస్తుండగా, ఎయిర్గన్లో ఒక బుల్లెట్ గోడకు తగిలి తిరిగి రివర్స్‌లో వెనక్కు వచ్చి యువకుడి తలకు బలంగా తగలడంతో మృతి చెందడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. -
ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. ఎయిర్‌గన్‌తో
జవహర్‌నగర్: ఆన్లైన్లో కొనుగోలు చేసిన బొమ్మ తుపాకీతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ పద్మశాలి టౌన్షిప్లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇన్చార్జి సీఐ మధుకుమార్ వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన యువతి గీతాంజలి కళాశాలలో బీటెక్ చదువుతూ దమ్మాయిగూడ లేక్‌వ్యూ కాలనీలోని బంధువుల ఇంట్లో నివాసముంటోంది. దమ్మాయిగూడ సాయిబాబానగర్‌కు చెందిన అభిషేక్(20) అదే కళాశాలలో చదువుతూ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం యువతి సోదరుడు భానుప్రకాశ్‌ను పద్మశాలి టౌన్‌షిప్‌కు పిలిపించి ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఎయిర్‌గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఉపయోగించిన ఎయిర్‌గన్ ఆన్లైన్లో కొనుగోలు చేసిన బొమ్మతుపాకీ అని పోలీసులు నిర్ధారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడియో కాల్.. లైవ్‌లో దుస్తులిప్పి చదవండి: పెళ్లి పేరుతో యువతిపై రెండేళ్లుగా లైంగిక దాడి -
ఎయిర్‌గన్‌తో వ్యక్తి హల్చల్
సాక్షి, శంషాబాద్: కొంతకాలంగా ఎయిర్‌గన్‌తో హల్చల్ చేస్తూ స్థానికులను బెదిరిస్తున్న ఓ వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని తొళ్లబస్తీకి చెందిన సోహైల్(22) గత కొన్ని రోజులుగా తుపాకీ వెంట పెట్టుకొని సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానని స్థానికులను బెదిరిస్తున్నాడు. శుక్రవారం రాత్రి సున్నంబట్టి సమీపంలో కొందరు వ్యాపారులను మామూళ్లు ఇవ్వాలంటూ బెదిరించడంతో వారు ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సోహైల్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న తుపాకీని పరిశీలించగా ఎయిర్గన్గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: పీపీఈ కిట్‌తో వ్యక్తి హల్చల్.. పరుగో పరుగు -
కుక్కను కాల్చి చంపిన వ్యక్తి
-
కుక్కే కదా అని కాల్చేశాడు
సాక్షి, హైదరాబాద్: రోజూ మొరుగుతూ ఇబ్బంది పెడుతుందన్న కారణంతో బర్రెల షెడ్డులో కాపలాగా ఉంటున్న కుక్కను ఓ వ్యక్తి ఎయిర్‌గన్‌తో కాల్చి చంపిన ఘటన సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని బాపూ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎడమ భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో కుక్క అక్కడికక్కడే చనిపోయింది. వివరాలు.. రాజు, దేవేందర్, సుదర్శన్ ముగ్గురు అన్నదమ్ములు కలసి ఓల్డ్ సరూర్‌నగర్ చౌడీ వద్ద బర్రెల షెడ్డును నిర్వహిస్తున్నారు. ఈ షెడ్డులో జాకీ అనే కుక్క కాపలాగా ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ షెడ్డు నుంచి బయటకు వచ్చిన కుక్క.. బాపూ కాలనీలోని జిమ్‌కోచ్, బ్యాంక్ ఉద్యోగి అవినాశ్ కరణ్ ఇంటికి వెళ్లింది. దీంతో అతడు తన వద్ద ఉన్న ఎయిర్ గన్‌తో కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయింది. దీంతో కుక్క యజమానులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ 429, 336 సెక్షన్లతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ యాక్ట్ సెక్షన్–11 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎయిర్‌గన్ కలిగి ఉండటంతో ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. -
ఎయిర్‌గన్‌తో యువకుడు హల్చల్..అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడు ఎయిర్‌గన్‌తో హల్చల్ సృష్టించాడు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట సమీపంలో ఇంజనీరింగ్ విద్యార్థి హేమంత్‌రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఎయిర్‌గన్‌తో పలువురిని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఎయిర్‌గన్‌తో పాటు 12 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎయిర్ గన్‌తో తిరుగుతున్న యువకుడి అరెస్ట్
చాంద్రాయణగుట్ట: ఎయిర్‌గన్ తిరుగుతున్న ఓ యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వై.ప్రకాష్ రెడ్డి కథనం మేరకు.. బార్కాస్ జమాల్‌బండ ప్రాంతానికి చెందిన అబ్దుల్ నహదీ(19) మంగళవారం ఇస్మాయిల్ నగర్ నుంచి ఎయిర్‌గన్‌తో వస్తుండగా, బక్రీద్ బందోబస్తులో ఉన్న ఎస్సై శ్రీనివాసారావు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
సరదా కోసమే షూట్ చేశా
కుక్కల కాల్చివేత కేసులో నిందితుడి అంగీకారం హైదరాబాద్ : కుక్కలను చంపిన కేసు కొలిక్కి వచ్చింది. సంఘటనకు కారకుడైన నాజర్ అలంఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలో బుధవారం విచారణ చేపట్టారు. కుక్కలను గన్ తో చంపింది తానేనని అతడు ఒప్పుకోవడంతో ఎలా చంపాడనే కోణంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు విచారణ చేపట్టారు. ముందుగా రంగారెడ్డి జిల్లా పూడూరు మండల పరిధిలోని ఎన్కేపల్లి డైరీ ఫాంలో ఓ కుక్కను ఎయిర్ గన్ తో కాల్చి చంపినట్లు, అనంతరం మన్నెగుడలోని గోల్కొండ టెక్స్‌టైల్స్‌లో గేటు వద్ద మరో కుక్కను కాల్చినట్లు అతడు ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు. సరదా కోసమే కుక్కలను ఎయిర్‌గన్ తో చంపానని నిందితుడు అంగీకరించాడని తెలిసింది. ముందుగా పోలీసులు నాజర్ అలంఖాన్ పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేసిన, వీడియోలో ఉన్న వ్యక్తి వేరే కావడంతో పోలీసులు దర్యప్తు ముమ్మరం చేశారు. కుక్కను చంపేందుకు వాడిన ఎరుుర్‌గన్ కు అనుమతి లేదని విచారణలో బయటపడింది. ఎరుుర్‌గన్ ను పోలీసులు సీజ్ చేసి మరోమారు కేసు నమోదు చేశారు. -
రాహుల్ సభలో ఎయిర్ గన్ కలకలం!
చంపారన్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఎయిర్ గన్ తో సంచరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ లోని పశ్చిమ చంపారన్ రామ్ నగర్లో శనివారం మధ్యాహ్నం జరిగిన బహిరంగసభలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు రాహుల్ బహిరంగసభకు హాజరవుతాడనగా తయ్యబ్ జాన్ అనే యువకుడు గన్ చేతపట్టుకుని తిరుగుతుంటే గుర్తించి అరెస్టు చేసినట్లు బాగహ ఎస్పీ ఆనంద్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే నిందితుడి మానసిక పరిస్థితి బాగాలేదని, అతడి రక్షణ కోసమే గన్ వెంటతెచ్చుకున్నట్లు చెప్పాడని ఎస్పీ వివరించారు. తయ్యబ్ నుంచి బట్టలు ఓ బ్యాగును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చంపారన్ జిల్లాకే చెందినవాడని ఎస్పీ వెల్లడించారు. తమ విచారణలో నిందితుడు చెప్పిన వివరాలపై తమకు స్పష్టత రాలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా వచ్చాడా లేదా మానసిక ఆనారోగ్యంతో బహిరంగ సభకు వచ్చాడా అనే విషయాలపై పూర్తి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్పీ ఆనంద్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. -
రాహుల్ ర్యాలీలో గన్ కలకలం
-
రాహుల్ ర్యాలీలో గన్ కలకలం
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం పాల్గోనున్న ర్యాలీలో గన్ కలకలం సృష్టించింది. బీహార్‌లోని చంపారన్‌లో రాహుల్ గాంధీ తలపెట్టిన భారీ ర్యాలీలోకి ఓ వ్యక్తి గన్‌తో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ర్యాలీ ప్రవేశ ద్వారం దగ్గర ఆ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేస్తుండగా అతని దగ్గర గన్ను గుర్తించారు. ఆ వ్యక్తిని పశ్చిమ చంపారన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
చందాలకు వచ్చి.. పోలీసులకు చిక్కి
ముగ్గురు మాజీ నక్సల్స్ అరెస్ట్ ఎయిర్‌గన్, టాయ్‌పిస్టల్ స్వాధీనం ములుగు : జనశక్తి పేరిట వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేసేందుకు వచ్చిన ముగ్గురు మాజీ నక్సలైట్లు పోలీసులకు చిక్కారు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం రచించి కటకటాలపాలయ్యూరు. ములుగు డీఎస్పీ బానోతు రాజమహేంద్రనాయక్ కథనం ప్రకారం.. వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్‌కు చెందిన బొడగాని సారంగం, ములుగు మండలం రాయినిగూడెంకు చెందిన యాట కుమారస్వామి, కరీంనగర్ జిల్లా మహముత్తారం గ్రామానికి చెందిన పల్లెర్ల తిరుపతి గతంలో నక్సల్స్ దళాల్లో పనిచేసి లొంగిపోయారు. ముగ్గురు భూపాలపల్లి మండలం నేరేడుపల్లికి చెందిన మీనవేని ఓదేలుతో కలిసి రెండు నెలల క్రితం కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అత్తని రాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. జనశక్తి పేరుతో చందాలు వసూలు చేయాలని నిర్ణయించుకుని, ఆయుధాల కోసం ప్రయత్నిం చారు. తన వద్ద ఎయిర్‌గన్ ఉందని యాట కుమారస్వామి చెప్పగా.. సారంగం మరో టాయ్‌పిస్టల్‌ను సమకూర్చాడు. రెండింటిని సారంగం వెంకటాపురం మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన దుంపాల నర్సయ్య ఇంటి వెనుక గోతి తీసి పాతిపెట్టారు. ప్రణాళిక ప్రకారం వాల్‌పోస్టర్లను ప్రింట్ చేయించారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందడంతో నర్సయ్య ఇంటి వెనక దాచిపెట్టిన డమ్మీ పిస్టల్, ఎరుుర్‌గన్‌ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం వెంకటాపురం పోలీసులు, సివిల్ ఫోర్స్ సిబ్బంది తాళ్లపాడు జంక్షన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆటోలో అనుమానాస్పదంగా కనిపించారు. వారిని సోదా చేయగా జనశక్తి పార్టీకి చెందిన మూడు వాల్‌పోస్టర్లు లభించాయి. వారు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. 176/2014,యూ/ఎస్ 25(1),(బీ) ఇండియన్ ఆర్మ్స్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో ములుగు సీఐ శ్రీధర్‌రావు, ఏటూర్‌నాగారం సీఐ కిషోర్‌కుమార్, వెంకటాపురం ఎస్సై ఎండీ హన్నన్, గణపురం ఎస్సై భూక్య రవికుమార్, సిబ్బంది ఉన్నారు.