కుక్కల కాల్చివేత కేసులో నిందితుడి అంగీకారం
హైదరాబాద్ : కుక్కలను చంపిన కేసు కొలిక్కి వచ్చింది. సంఘటనకు కారకుడైన నాజర్ అలంఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలో బుధవారం విచారణ చేపట్టారు. కుక్కలను గన్ తో చంపింది తానేనని అతడు ఒప్పుకోవడంతో ఎలా చంపాడనే కోణంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు విచారణ చేపట్టారు. ముందుగా రంగారెడ్డి జిల్లా పూడూరు మండల పరిధిలోని ఎన్కేపల్లి డైరీ ఫాంలో ఓ కుక్కను ఎయిర్ గన్ తో కాల్చి చంపినట్లు, అనంతరం మన్నెగుడలోని గోల్కొండ టెక్స్‌టైల్స్‌లో గేటు వద్ద మరో కుక్కను కాల్చినట్లు అతడు ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు.
సరదా కోసమే కుక్కలను ఎయిర్గన్ తో చంపానని నిందితుడు అంగీకరించాడని తెలిసింది. ముందుగా పోలీసులు నాజర్ అలంఖాన్ పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేసిన, వీడియోలో ఉన్న వ్యక్తి వేరే కావడంతో పోలీసులు దర్యప్తు ముమ్మరం చేశారు. కుక్కను చంపేందుకు వాడిన ఎరుుర్‌గన్ కు అనుమతి లేదని విచారణలో బయటపడింది. ఎరుుర్‌గన్ ను పోలీసులు సీజ్ చేసి మరోమారు కేసు నమోదు చేశారు.
సరదా కోసమే షూట్ చేశా
Published Thu, Jul 28 2016 6:18 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement
Advertisement