మన చుట్టుపక్కల వాళ్లు లేదా పక్కింటివాళ్లతో ఏదో చిన్న చిన్న విషయాలకే మాట మాట పెరిగి పెద్ద పెద్ద గోడవలకు దారితీసిన ఘటనలు మనం చూశాం. అయితే అవి అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఆ గొడవలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత తారాస్థాయికి చేరితేనే అందరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే నోయిడాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా సదోపూర్ గ్రామంలో పిట్ బుల్ కుక్క యజమానులు చూస్తుండగానే ఓ చిన్నారిపై దాడి చేసింది. అయితే ఆ మైనర్ బాలుడి కుటుంబంతో ఆ కుక్క యజమానులకు చిన్న వాగ్వాదం జరిగింది.
దీంతో కుక్క యజమానులైన రవీందర్, సౌరభ్‌లు వారి పెంపుడు కుక్క బుల్‌ని మైనర్ బాలుడి పైకి ఉసుగొల్పారు. అయితే స్థానికులు ఆ కుక్క బెదరగొట్టడానికి ముందుకు వస్తున్నప్పటికీ ఆ కుక్క యజమానులు మాత్రం జోక్యం చేసుకోకుండా అత్యంత పాశవికంగా నుంచుని చూశారు. పాపం ఆ కుక్క దాడిలో ఆ చిన్నారికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ఆ బాలుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ... రవీందర్ , సౌరభ్‌లను అరెస్టు చేశాం." అని తెలిపారు.
(చదవండి: ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్)
Comments
Please login to add a commentAdd a comment