4 year Old Girl Dies In Air Gun Misfire In Sangareddy Farmhouse, సంగారెడ్డిలో ఎయిర్‌ గన్‌ పేలి నాలుగేళ్ల చిన్నారి మృతి - Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో ఎయిర్‌ గన్‌ పేలి నాలుగేళ్ల చిన్నారి మృతి

Published Wed, Mar 16 2022 11:59 AM | Last Updated on Wed, Mar 16 2022 1:40 PM

4 yeras Old Girl Dies In Air Gun Misfire In Sangareddy Farmhouse  - Sakshi

సాక్షి, సంగారెడ్డి(మెదక్‌): ఎయిర్‌ గన్‌ పేలి చిన్నారి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్‌ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలింది. పిల్లలు గన్‌తో ఆడుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంలో శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప గాయపడింది. దీంతో బాలికను హుటాహుటినా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చదవండి: హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్‌ లేదా.. నో ప్రాబ్లమ్‌!

అయితే చికిత్స పొందుతూ తెల్లవారు జామున 2 గంటలకు మృతి చెందింది. పాప మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా ఈ ఘటన మంగళవారం రాత్రి పది గంటల సమయంలో జరిగినట్లు పఠాన్ చెరువు డీఎస్పీ భీం రెడ్డి తెలిపారు. ప్రసాద్ అనే వ్యక్తి ఫామ్‌ హౌజ్‌లో సంఘటన జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 
చదవండి: ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement