స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగోలో ఉపన్యాసం చేసి సెప్టెంబర్ 11తో 120ఏళ్లు పూర్తయ్యాయి.
సిద్దిపేట, న్యూస్‌లైన్: స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగోలో ఉపన్యాసం చేసి సెప్టెంబర్ 11తో 120ఏళ్లు పూర్తయ్యాయి. భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటినది ఈ ఉపన్యాసమే. దీంతో స్వా మికి ఎనలేని కీర్తిప్రతిష్టలు వచ్చాయి. ఈ రోజు ను పురస్కరించుకుని బుధవారం జిల్లాలో చేపట్టిన ‘దేశం కోసం పరుగు’కు అనూహ్య స్పంద న లభించింది. ముఖ్యంగా యువత, విద్యార్థులు అధికసంఖ్యలో ఈ పరుగులో పాల్గొని దేశభక్తిని చాటారు. సిద్దిపేటలో జరిగిన ‘దేశం కోసం పరుగు’ను వన్‌టౌన్ సీఐ నాగభూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరసావర్క ర్ సర్కిల్ వద్ద జరిగిన సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరియాద అంజిరెడ్డి మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడిన వా ళ్లే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ నాయకులు ప్రవీణ్, మల్లారెడ్డి, బీజేపీ నాయకులు, హిందూ ప్రతి నిధులు శ్రీకాంత్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్, గోల్కొండ రాఘవులు, రాజేశం, చంద్రశేఖర్, భానుచందర్ పాల్గొన్నారు.
మానవసేవకే పరితపించారు: బాలేంద్రజీ
రామాయంపేట: రామాయంపేటలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశంకో సం పరుగులో విద్యార్థులు భారీగా పాల్గొన్నా రు. అనంతరం సిద్దిపేట ఎక్స్‌రోడ్‌లో నిర్వహించిన సమావేశానికి వివేకానంద ఉత్సవ సమితి రాష్ట్ర కన్వీనర్ బాలేంద్రజీ హాజరై మా ట్లాడారు. మానవ సేవే మాధవ సేవగా దీనజనోద్ధరణ కోసం వివేకా పరితపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ బాలకృష్ణారెడ్డి, విద్యార్థులు, వివేకానంద యూత్ నాయకులు, ఆవాస విద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు.
వివేకా ఆశయ సాధనకు కృషి చేయాలి
గజ్వేల్: వివేకానందా ఆశయ సాధనకు యువ త కృషిచేయాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నరేష్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్‌లో ‘దేశ భవితకు యువత పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వమత సమ్మేళనంలో వివేకానందా భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పారని కొని యాడారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశానికి నలువైపులు నుంచి ప్రమాదాలు ముం చుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ డ్రిగీ కళాశాల సైకాలజీ లెక్చరర్ శ్రీని వాసచారి మాట్లాడుతూ యువత శారీరక శక్తితో మానసిక శక్తిని అలవర్చుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. వివేకానందా ఉత్సవసమితి గజ్వేల్ నియోజకవర్గ శాఖ కన్వీనర్ తుమ్మ క్రిష్ణ మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తిని యువకుల్లో నింపేందుకే వివేకా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు స్వామి, క్రాంతి, క్రిష్ణ, కర్ణాకర్‌రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
వివేకానంద చూపిన మార్గంలో నడవాలి
స్వామి వివేకనంద చూపిన మార్గంలో యువత నడవాలని జిల్లా యువజన సంక్షేమాధికారి ఎస్. రామచంద్రయ్య సూచించారు. బుధవారం గజ్వేల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో ‘సేవా’ వలీంటరీ ఆర్గనైజేషన్, ఎన్‌ఎస్‌ఎస్(జాతీయ సేవా పథకం) అధ్వర్యంలో ‘వివేకనందుడు యువతకు ఆదర్శం’ అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ఈ సదస్సులో జూనియర్ కళశాల ప్రిన్సిపాల్ ఎలిజబెత్, ‘సేవా’ సంస్థ అధ్యక్షుడు దేశబోయిన నర్సింహులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి వం శీధర్, డీడబ్ల్యూఓ మేనేజర్ బాలయ్య, రామరాజు తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఆదర్శం స్వామి వివేకానంద
జోగిపేట: యువతుక ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడని సీఐ సైదానాయక్ అన్నారు. జోగిపేటలో నిర్వహించిన జాతీయ యువ పరుగును ఆయన ప్రారంభించారు. అనంతరం అందోలు వద్ద ఉన్న వివేకానందుడి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జయంతి ఉత్సవాల కమి టీ జిల్లా కార్యదర్శి జె.లక్ష్మన్,సభ్యులు ఆర్.ప్రభాకర్‌గౌడ్, డీసీసీబీ మాజీ డెరైక్టర్ ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.