చికాగో : తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (టీఏజీసీ) వాలీబాల్, త్రో బాల్ పోటీలను ఈ నెల 8వ తేదీన బౌలింగ్ బ్రూక్‌లోని పెలికాన్ హార్బర్ ఇండోర్ ఆక్వాటిక్ పార్కులో ఇండ్‌సాఫ్ట్, హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సహకారాలతో ఘనంగా నిర్వహించింది. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్ర ప్రతిపాదించిన బొబ్బిలి మాధవరెడ్డి జ్ఞాపక వాలీబాల్, త్రో బాల్ పోటీలను పిలవాలని ప్రతిపాదించారు.
ఆయన ప్రతిపాదనను టీఏజీసీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. దివంగత మాధవ రెడ్డి అధ్యక్షుడిగా, టీఏజీసీ స్థాపక సభ్యుడిగా ఉన్నారు. టీఏజీసీ సభ్యులను, తెలుగు వారందరిని సరదాగా ఉండటానికి సాధారణ జీవితాల నుండి ఉపశమనం పొందడానికి, అలాగే కొత్త స్నేహితులను సంపాదించడానికి ప్రోత్సహించడం ఈ పోటీల యొక్క ప్రధాన లక్ష్యమని టీఏజేసీ పేర్కొంది.
టీఏజీసీ కార్యవర్గం, క్రీడా విభాగం అంకితభావంతో ఈ సంవత్సరము నమోదు చేసిన జట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియాను ఉపయోగించడం ద్వారా ఈ కార్యక్రమానికి బాగా ప్రాచుర్యం వచ్చింది. టీఏజీసీ పురుషుల కోసం వాలీబాల్ టోర్నమెంట్‌ను 3 విభాగాలలో నిర్వహించింది. మహిళలకు త్రో బాల్ పోటీలను నిర్వహించారు. వాలీబాల్ విభాగంలో బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్‌డ్ కేటగీరీల్లో పోటీలు జరిగాయి.
మొత్తం ౩౦ వాలీబాల్ జట్లు, 4 గ్రూపులు, 90 పైగా మ్యాచ్‌లు జరిగాయి. 280 మంది పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే, ఆటల పర్యవేక్షణ, విజయాలు, నష్టాలను నమోదు చేయడం, స్కోర్లను నవినీకరించడం, తదుపరి మ్యాచ్‌లకు కచ్చితంగా జట్లు మరియు రిఫరీలు సమకూర్చడము చేయడం వంటివి సమయానుసారంగా అందుబాటులో ఉన్నవాలంటీర్స్, బీఓడీ ప్రవీణ్ వేమలపల్లి, అవినాష్ లట్టుపల్లి, విజయ్ భీరమ్, అంజి కందిమళ్ల, రాము బిల్లకంటి, మమతా లంకల, ప్రదీప్ కందిమళ్ల, జ్యోతి చినాతలాపని, వాలంటీర్స్ శశి, రమణ కాల్వ, రోహిత్ అకులా, సంతోష్ కొండూరి ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు.
టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే, ఇండ్ సాఫ్ట్, హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సంస్థల యజమాని వినోజ్ చనుమోలు, టీఏజీసీ కార్యవర్గ సభ్యులు, క్రీడా విభాగ సభ్యులతో కలిసి పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు.
త్రో బాల్ :
విజేత: వెస్ట్ మాంట్ ఫ్యూరియస్ సిక్స్
రన్నరప్: రుద్ర జట్టు
వాలీబాల్ (అడ్వాన్స్డ్):
విజేత : వాలీబాల్ ఆడిక్ట్స్
రన్నరప్ : స్పార్టాన్స్
ఇంటర్మీడియట్ వాలీబాల్:
విజేతలు : దేశీ బాయ్స్ -1
రన్నరప్ : చికాగో బుల్స్
పురుషుల వాలీ బాల్:
విజేతలు :స్మ్న్-1
రన్నరప్ : దేశీ బాయ్స్ -2
టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే, ఇండోర్ త్రో బాల్. వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ఇండ్ సాఫ్ట్ సీఈవో వినోజ్ చనుమోలు, హైదరాబాద్ హౌస్ శంబుర్గ్ వాసు వల్లభనేని, ఆటస్థలం నిర్వహణ యాజమాన్యానికి, వాలంటీర్లకు, రిఫరీలకు, లైన్ మెన్లకు, టీఏజీసీ కార్యవర్గ సభ్యులకు, క్రీడా కమిటీ, జట్టు కెప్టెన్లు అలాగే అన్ని జట్ల సభ్యులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment