చికాగో: చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) ఆధ్వర్యంలో ఎల్లో బాక్స్ఆడిటోరియంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ , వారి బృందం ధనుంజయ్, పృథ్విచంద్ర, రోల్ రిదా, భార్గవి పిళ్ళై, ఉమా నేహా, రినైనా రెడ్డిల గాన కచేరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రముఖులతో పాటూ దాదాపు 2000మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేశారని సంస్థ కోశాధికారి వెంకట్ గునుగంటి తెలిపారు. సప్త సముద్రాలూ దాటి విదేశాల్లో ఉన్న తెలుగు వారిని తమ సంస్కృతి సంప్రాదాయాలకు టీఏజీసీ ఈ సంబరాల ద్వారా మరింత దగ్గర చేసిందన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా స్వాగత ద్వారం వద్ద టీఏజీసీ బ్యానర్, తోరణాలు కట్టారు. స్టేజి వద్ద టీఏజీసీ లోగోతో చాలా చక్కగా కనిపించేలా కార్యదర్శి దీప్తి ముత్యంపేట, ప్రదీప్ గింగు టీమ్ చక్కగా అలంకరించారు.
టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే, సంస్కృతిక కమిటీ సభ్యులు, సంస్థ కార్యవర్గ సభ్యులతో కలిసి దీపావళి ఉత్సవ కార్యక్రమాలను గణపతి ప్రార్ధనతో ప్రారంభించారు. సంస్థ సభ్యులకు అతిథులకు రామచంద్రా రెడ్డి ఏడే దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలు, దీపావళి పండుగ ఔన్నత్యాన్ని కొనియాడారు. సంస్కృతిక కమిటీ సభ్యులు, కార్యదర్శి సుజాత కట్ట, కో-ఛైర్మన్ ప్రవీణ్ వేములపల్లి ఈ దీపావళి వేడుకలను పురస్కరించుకొని పలు సాంసకృతిక కార్యాక్రమాలను 330 మంది స్థానిక కళాకారులతో రూపొందించారు. దీపావళి పండుగ విశిష్టతను తెలుపుతూ చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే విధముగా చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. నిన్న- మొన్నటి -నేటి తరాల హిందీ నటుల పాటలతో కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్బంగా కార్యక్రమంలో పాల్గొన్నచిన్నారులకు, కళాకారులకు, అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే, దాతలు & సంస్థ వాలంటీర్‌లతో సర్టిఫికెట్‌లు అందజేశారు. అలాగే ఈ సంవత్సరము ఎలాంటి లాభార్జన లేకుండా సంస్థ కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందించిన వాలంటీర్‌లకు రామచంద్రా రెడ్డి జ్ఞాపికలు ప్రదానం చేశారు. సంస్థ గత సంవత్సర అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్లని, వారు చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తుగా రామచంద్ర రెడ్డి ఏడే, కార్యవర్గ సభ్యులతో కలిసి శాలువా కప్పి, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన సంస్థ సభ్యులకు, అతిథులకు, కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్‌లకి, దాతలకు, కమిటీల కార్యదర్శికి, కమిటీల సభ్యులకు, అన్ని పనులలో చేదోడువాదోడుగా ఉన్న మాజీ అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్ల, వచ్చే సంవత్సర అధ్యక్షులు జ్యోతి చింతలపని, చక్కని భోజనాన్ని తక్కువ ధరకు అందించిన స్థానిక రెస్టారెంట్స్ యాజమాన్యానికి, భారతదేశము నుండి విచ్చేసిన అనూప్ రూబెన్స్, వారి బృందానికి రామచంద్రా రెడ్డి ఏడే హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు
Published Mon, Nov 6 2017 3:00 PM | Last Updated on Mon, Nov 6 2017 3:13 PM
1/4
2/4
3/4
4/4
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment