TAGC
-
చికాగోలో ఘనంగా సంక్రాంతి, గణతంత్ర వేడుకలు
చికాగో: చికాగో మహానగర తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చికాగోలోని హిందూ టెంపుల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1న ఏర్పాటు చేశారు. టీఏజీసీ సంఘం అధ్యక్షులు ప్రవీణ్ వేములపల్లి, క్రాంతి వేములపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్, వెంకట్ గూనుగంటి, ముఖ్య కార్యదర్శి అంజిరెడ్డి కందిమళ్ల ఇతర ప్రముఖులు గణపతి ప్రార్థన, జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు రైతులు ప్రాముఖ్యతను, వారి కష్టాలను తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ విశిష్టతను, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను, పర్యావరణ ప్రాముఖ్యతను చాటుతూ వివిధ నృత్య ప్రదర్శలతో వివరించారు. సంస్థ సాంస్కృతిక కార్యదర్శి వినీత ప్రొద్దుటూరి మాట్లాడుతూ.. 32 టీమ్స్‌తో 350 ప్రదర్శనకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ప్రదర్శనకారులకు టీఏజీసీ తరుపున సర్టిఫికెట్స్, వినూత్నంగా పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలిపే విధంగా మొక్కలను టీం కో-ఆర్డినేటర్‌కు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయటానికి రెండు నెలలుగా శ్రమించిన కల్చరల్ కో-చైర్‌పర్సన్స్ శిరీష మద్దూరి, మాధవి రాణి కొనకళ్ల, శిల్పలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. టీఏజీసీ అధ్యక్షులు ప్రవీణ్ వేములపల్లి మాట్లాడుతూ: రెండు చేతులు కలవనిదే చప్పట్లు మ్రోగవు, నలుగురు లేనిదే సభని అలంకరించలేము అలాగే కొన్ని కుటుంబాలు కలవనిదే ఒక పండుగ పూర్తికాదు.ఈ రోజు మన ఈ సంక్రాంతి పండుగ సంబరాలను వెయ్యి రేట్లు అద్భుతంగా, కనుల పండుగగా తీర్చిదిద్ది విజయవంతం చెయ్యటానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు,కళాకారులకు, కళా అభిమానులకు, కళా పోషకులకు, కూర్పుకర్తలు, సమన్వయకర్తలు, కార్యకర్తలకు, కార్యవర్గ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు ఆయన ధన్యవాదములు తెలిపారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతం పాడి ముగించారు. -
టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ
కాన్సాస్ : అమెరికాలోని కాన్సాస్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటి (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్లూవ్యాలీ నార్త్ వెస్ట్ హైస్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు వెయ్యి మంది తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా నుండి వచ్చిన రఘు వేముల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సూపర్ సింగర్ ఫేమ్ అంజనా సౌమ్య, కాన్సాస్ సిటి స్థానిక సింగర్ శ్రియ పొందుర్తిలు తమ గాత్రంతో ఊర్రూతలూగించారు. స్థానిక దేవాలయ పూజారి నిర్వహించిన బతుకమ్మ, అమ్మ వారి పూజలతో కార్యక్రమం ప్రారంభమయింది. నగరంలోని తెలుగు వారు అందరు సాంప్రదాయ వేషధారణలో తాము చేసిన బతుకమ్మలను తీసుకోని రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సాంస్కృతిని ప్రతిభింబించే జానపద, బతుకమ్మ పాటలను మహిళలు, యువతులు ఆడిపాడారు. బతుకమ్మలన్నింటిలో మంచి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలు నిర్ణయించి, వారికి స్పాన్సర్స్ ద్వారా బహుమతులు అందజేశారు. అనంతరం బతుకమ్మలను తీసుకొని వెళ్లి నిమజ్జనం చేసి, ప్రసాదాలు పంచారు. కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన అందరికి టీఏజీకేసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. -
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
చికాగో: చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చికాగోలోని స్ట్రీమ్వుడ్ హై స్కూల్ ఆడిటోరియంలో ఏప్రిల్ 14న జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 1000మంది తెలుగు వారు పాల్గొన్నారు. 325 మంది స్థానిక కళాకారులు వివిధ కార్యక్రమాలతో అతిథులను అలరించారు. కిడ్స్ కామెడీ స్కిట్, బాల రామాయణం, దివంగత నటి శ్రీదేవికి నివాళి, ఉగాది, శ్రీరామనవమికి సంబంధించి కార్యక్రమాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, కల్చరల్ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి లెంకల, కో ఛైర్స్ ఉమా అవదూత, శ్వేత జనమంచి, మాధవి కొనకొల్లలు, కల్చరల్ కమిటీ సభ్యులు, కో ఆర్డినేటర్స్ గత 6 వారాలుగా ఈ వేడుకల కోసం అహర్నిశలు కృషి చేశారు. వేడుకల డెకరేషన్ పనులను వాణి యెంట్రింట్ల దగ్గరుండి చూశారు. టీఏజీసీ మెంబర్షిప్ కమిటీ, ప్రవీణ్ వేములపల్లి, మమత లంకల, విజయ్ బీరం, మమత లంకలలు అతిథులను సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎంఎస్‌ఐకి చెందిన అశోక్ లక్ష్మణన్, టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, మాజీ అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్ల, యూత్ ఛైర్ అవినాష్ లటుపల్లి ఎంపిక చేసిన యువతకు ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్(పీవీఎస్ఏ) సర్టిఫికెట్స్ అందజేశారు. ఫుడ్ కమిటీ ఛైర్ శ్రీనివాస్ కంద్రు ఉగాది పచ్చడితోపాటూ, రుచికరమైన వంటకాలను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంజి రెడ్డి కందిమల్ల, సంపత్ సప్తగిరిలు ఆహారం సరఫరా, ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాలంటీర్లకు జ్యోతి చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు. -
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు
చికాగో: చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) ఆధ్వర్యంలో ఎల్లో బాక్స్ఆడిటోరియంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ , వారి బృందం ధనుంజయ్, పృథ్విచంద్ర, రోల్ రిదా, భార్గవి పిళ్ళై, ఉమా నేహా, రినైనా రెడ్డిల గాన కచేరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రముఖులతో పాటూ దాదాపు 2000మందికి పైగా ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేశారని సంస్థ కోశాధికారి వెంకట్ గునుగంటి తెలిపారు. సప్త సముద్రాలూ దాటి విదేశాల్లో ఉన్న తెలుగు వారిని తమ సంస్కృతి సంప్రాదాయాలకు టీఏజీసీ ఈ సంబరాల ద్వారా మరింత దగ్గర చేసిందన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా స్వాగత ద్వారం వద్ద టీఏజీసీ బ్యానర్, తోరణాలు కట్టారు. స్టేజి వద్ద టీఏజీసీ లోగోతో చాలా చక్కగా కనిపించేలా కార్యదర్శి దీప్తి ముత్యంపేట, ప్రదీప్ గింగు టీమ్ చక్కగా అలంకరించారు. టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే, సంస్కృతిక కమిటీ సభ్యులు, సంస్థ కార్యవర్గ సభ్యులతో కలిసి దీపావళి ఉత్సవ కార్యక్రమాలను గణపతి ప్రార్ధనతో ప్రారంభించారు. సంస్థ సభ్యులకు అతిథులకు రామచంద్రా రెడ్డి ఏడే దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలు, దీపావళి పండుగ ఔన్నత్యాన్ని కొనియాడారు. సంస్కృతిక కమిటీ సభ్యులు, కార్యదర్శి సుజాత కట్ట, కో-ఛైర్మన్ ప్రవీణ్ వేములపల్లి ఈ దీపావళి వేడుకలను పురస్కరించుకొని పలు సాంసకృతిక కార్యాక్రమాలను 330 మంది స్థానిక కళాకారులతో రూపొందించారు. దీపావళి పండుగ విశిష్టతను తెలుపుతూ చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే విధముగా చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. నిన్న- మొన్నటి -నేటి తరాల హిందీ నటుల పాటలతో కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్బంగా కార్యక్రమంలో పాల్గొన్నచిన్నారులకు, కళాకారులకు, అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే, దాతలు & సంస్థ వాలంటీర్లతో సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ఈ సంవత్సరము ఎలాంటి లాభార్జన లేకుండా సంస్థ కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందించిన వాలంటీర్లకు రామచంద్రా రెడ్డి జ్ఞాపికలు ప్రదానం చేశారు. సంస్థ గత సంవత్సర అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్లని, వారు చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తుగా రామచంద్ర రెడ్డి ఏడే, కార్యవర్గ సభ్యులతో కలిసి శాలువా కప్పి, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన సంస్థ సభ్యులకు, అతిథులకు, కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్లకి, దాతలకు, కమిటీల కార్యదర్శికి, కమిటీల సభ్యులకు, అన్ని పనులలో చేదోడువాదోడుగా ఉన్న మాజీ అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్ల, వచ్చే సంవత్సర అధ్యక్షులు జ్యోతి చింతలపని, చక్కని భోజనాన్ని తక్కువ ధరకు అందించిన స్థానిక రెస్టారెంట్స్ యాజమాన్యానికి, భారతదేశము నుండి విచ్చేసిన అనూప్ రూబెన్స్, వారి బృందానికి రామచంద్రా రెడ్డి ఏడే హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ పోటీలు
చికాగో : తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (టీఏజీసీ) వాలీబాల్, త్రో బాల్ పోటీలను ఈ నెల 8వ తేదీన బౌలింగ్ బ్రూక్‌లోని పెలికాన్ హార్బర్ ఇండోర్ ఆక్వాటిక్ పార్కులో ఇండ్సాఫ్ట్, హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సహకారాలతో ఘనంగా నిర్వహించింది. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్ర ప్రతిపాదించిన బొబ్బిలి మాధవరెడ్డి జ్ఞాపక వాలీబాల్, త్రో బాల్ పోటీలను పిలవాలని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను టీఏజీసీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. దివంగత మాధవ రెడ్డి అధ్యక్షుడిగా, టీఏజీసీ స్థాపక సభ్యుడిగా ఉన్నారు. టీఏజీసీ సభ్యులను, తెలుగు వారందరిని సరదాగా ఉండటానికి సాధారణ జీవితాల నుండి ఉపశమనం పొందడానికి, అలాగే కొత్త స్నేహితులను సంపాదించడానికి ప్రోత్సహించడం ఈ పోటీల యొక్క ప్రధాన లక్ష్యమని టీఏజేసీ పేర్కొంది. టీఏజీసీ కార్యవర్గం, క్రీడా విభాగం అంకితభావంతో ఈ సంవత్సరము నమోదు చేసిన జట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియాను ఉపయోగించడం ద్వారా ఈ కార్యక్రమానికి బాగా ప్రాచుర్యం వచ్చింది. టీఏజీసీ పురుషుల కోసం వాలీబాల్ టోర్నమెంట్‌ను 3 విభాగాలలో నిర్వహించింది. మహిళలకు త్రో బాల్ పోటీలను నిర్వహించారు. వాలీబాల్ విభాగంలో బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ కేటగీరీల్లో పోటీలు జరిగాయి. మొత్తం ౩౦ వాలీబాల్ జట్లు, 4 గ్రూపులు, 90 పైగా మ్యాచ్‌లు జరిగాయి. 280 మంది పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే, ఆటల పర్యవేక్షణ, విజయాలు, నష్టాలను నమోదు చేయడం, స్కోర్లను నవినీకరించడం, తదుపరి మ్యాచ్‌లకు కచ్చితంగా జట్లు మరియు రిఫరీలు సమకూర్చడము చేయడం వంటివి సమయానుసారంగా అందుబాటులో ఉన్నవాలంటీర్స్, బీఓడీ ప్రవీణ్ వేమలపల్లి, అవినాష్ లట్టుపల్లి, విజయ్ భీరమ్, అంజి కందిమళ్ల, రాము బిల్లకంటి, మమతా లంకల, ప్రదీప్ కందిమళ్ల, జ్యోతి చినాతలాపని, వాలంటీర్స్ శశి, రమణ కాల్వ, రోహిత్ అకులా, సంతోష్ కొండూరి ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే, ఇండ్ సాఫ్ట్, హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సంస్థల యజమాని వినోజ్ చనుమోలు, టీఏజీసీ కార్యవర్గ సభ్యులు, క్రీడా విభాగ సభ్యులతో కలిసి పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. త్రో బాల్ : విజేత: వెస్ట్ మాంట్ ఫ్యూరియస్ సిక్స్ రన్నరప్: రుద్ర జట్టు వాలీబాల్ (అడ్వాన్స్డ్): విజేత : వాలీబాల్ ఆడిక్ట్స్ రన్నరప్ : స్పార్టాన్స్ ఇంటర్మీడియట్ వాలీబాల్: విజేతలు : దేశీ బాయ్స్ -1 రన్నరప్ : చికాగో బుల్స్ పురుషుల వాలీ బాల్: విజేతలు :స్మ్న్-1 రన్నరప్ : దేశీ బాయ్స్ -2 టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే, ఇండోర్ త్రో బాల్. వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ఇండ్ సాఫ్ట్ సీఈవో వినోజ్ చనుమోలు, హైదరాబాద్ హౌస్ శంబుర్గ్ వాసు వల్లభనేని, ఆటస్థలం నిర్వహణ యాజమాన్యానికి, వాలంటీర్లకు, రిఫరీలకు, లైన్ మెన్లకు, టీఏజీసీ కార్యవర్గ సభ్యులకు, క్రీడా కమిటీ, జట్టు కెప్టెన్లు అలాగే అన్ని జట్ల సభ్యులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
చికాగోలో ఘనంగా ఉగాది, నవమి వేడుకలు
చికాగో: శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది, శ్రీ రామ నవమి వేడుకలు చికాగో మహా నగర తెలుగు సంస్థ( టీఏజీసీ) ఆధ్వర్యంలో యెల్లో బాక్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక భారత దౌత్య కార్యాలయ అధికారి ఓ.పీ మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు స్థానిక ప్రముఖులతోపాటూ భారీగా ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సప్త సముద్రాలూ దాటి విదేశాల్లో ఉన్న తెలుగు వారిని టీఏజీసీ ఈ సంబరాల ద్వారా దగ్గర చేసింది. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే సంస్కృతిక, సంస్థ కార్యవర్గ సభ్యులతో కలిసి కార్యక్రమాలను గణపతి ప్రార్ధనతో ప్రారంభించారు. తెలుగు జాతి, మన సంస్కృతి, సంప్రదాయాలు వాటి ఔన్నత్యాన్ని ఆయన కొనియాడారు. అతిథులకు ఉగాది, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతిక కమిటి కార్యదర్శి సుజాత కట్ట, కో-ఛైర్మన్ ప్రవీణ్ వేములపల్లి 321 మంది కళాకారులతో పలు కార్యాక్రామాలను రూపొందించారు. శ్రీ రాముని ఉద్దేశించిన పలు పాటలు, కీర్తనలకు నృత్య రూపం, ఉగాది కథాంశంతో నాటిక, మాయాబజార్ పాటలకు నృత్యాలు, నిన్న- మొన్నటి -నేటి తరాల తెలుగు నటుల పాటలతో నృత్యాలు, శివుడు హనుమంతుడి మధ్య జరిగే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు దాతలు, సంస్థ కార్యవర్గ సభ్యులతో సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత దౌత్య కార్యాలయ అధికారి ఓ.పీ మీనా మాట్లాడుతూ ఉగాది, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబోతున్న యోగా దినోత్సవ ప్రాముఖ్యత చాటి చెప్పుతూ జూన్ 25న చికాగోలో జరిగే యోగా డేలో ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. గత సంవత్సరం స్వచ్ఛందంగా సమాజ సేవా, టీఏజీసీ ప్రయోజనార్థం తమ సమయాన్ని వెచ్చించిన యువతకు అమెరికా అధ్యక్షులు ట్రంప్ సంతకంతో అందజేసే పీవీఎస్ఏ సర్టిఫికేట్లని ఓ.పీ మీనా, టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రా ఏడే, టీఏజీసీ యువజన సంఘ కార్యదర్శి వెంకట్ గూనుగంటిలతో కలిసి అర్హులైన యువతకు బహుకరించారు. టీఏజీసీ ఏటా నిర్వహించే పలు సేవ కార్యక్రమాలలో భాగంగా ఈ ఈవెంట్లో రాఫిల్ ద్వారా సేకరించిన నిధులను అక్షయ విద్య సంస్థకు అందజేశారు. ప్రముఖ టాలీవుడ్ ప్లేబాక్ సింగర్స్ అంజనా సౌమ్య, దామిని భట్ల , యాజిన్ నిజార్, నరేంద్ర దొడ్డపనేనిలు తమ మధుర గాత్రంతో ప్రేక్షకులను రంజింపజేశారు. హైదరాబాద్ హౌస్ యజమాన్యం, రంగారెడ్డి లెంకల, ఉమా అవధూత, టీఏజీసీ సభ్యులు, అతిథులు, కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, మాజీ అధ్యక్షులు కళ్యాణ్ ఆనందుల, ప్రదీప్ కందిమళ్ల, వచ్చే సంవత్సర అధ్యక్షులు జ్యోతి చింతలపనిలు కార్యక్రమం విజయవంతం చేయడంలో కృషి చేసినందుకుగానూ శ్రీ రామచంద్రా రెడ్డి ఏడే కృతజ్ఞతలు తెలిపారు.