అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏర్పడి 25 సంవత్సరాలు గడచిన సందర్భంగా.. మూడు రోజుల పాటు రజతోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి ఆటా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూలై 1 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలోని చికాగోలోని రోజ్‌మెంట్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఆటా రజతోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం జూన్ 12న ఆరోరాలో పలువురు ఆటా సభ్యులు సమావేశమయ్యారు. ఏర్పాట్ల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆటా అధ్యక్షుడు సుధాకర్.ఆర్.పెర్కారి, ఆటా ట్రస్టీ హనుమంత్ రెడ్డి, కన్వెన్షన్ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, కన్వెన్షన్ డైరెక్టర్ కేకే రెడ్డి, ఆటా కీలక సభ్యులు కృష్ట ముశ్యమ్, కమల్ చిమ్టాలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సూక్ష్మ స్థాయి నుంచి జరుగుతున్న పనుల గురించి చర్చించారు. అమెరికాలో నివాసముంటున్న తెలుగు వారి సంక్షేమం కోసం 25 సంవత్సరాల క్రితం ఆటా ఏర్పడింది. అప్పటి నుంచి తెలుగు రాష్ర్టాలు, అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను ఆటా నిర్వహిస్తోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాషా పరిరక్షణ ధ్యేయంగా పని చేస్తూ, అమెరికాలోని చిన్నారులకు వాటిపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని అవలంభించే విధంగా కృషి చేస్తోంది. గత సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించిన సంగీత, నృత్యపోటీల్లో విజేతలుగా నిలిచిన వారిచే ప్రదర్శన ఇప్పించడంతో పాటు ఆట రజతోత్సవాల్లో వారిని ఘనంగా సన్మానించనున్నారు.
ఆటా రజతోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు..
Published Mon, Jun 13 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM
Advertisement
Advertisement