అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం చికాగోలో ఘనంగా నిర్వహించారు. రాయల్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమానికి 'బీ బోల్డ్ ఫర్ ఏ ఛేంజ్' అనే థీమ్‌తో నిర్వహించారు. దాదాపు 250 మందికి పైగా మహిళలు ఈ వేడుకలకు హాజరయ్యారు. మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలపై చర్చ జరిగింది.
చికాగోలో మహిళా దినోత్సవ వేడుకలు
Published Wed, Mar 22 2017 7:14 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం చికాగోలో ఘనంగా నిర్వహించారు. రాయల్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమానికి 'బీ బోల్డ్ ఫర్ ఏ ఛేంజ్' అనే థీమ్‌తో నిర్వహించారు. దాదాపు 250 మందికి పైగా మహిళలు ఈ వేడుకలకు హాజరయ్యారు. మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలపై చర్చ జరిగింది.
వేడుకలకు హాజరైన సునీతారెడ్డి, డా.మెహర్ మేడవరంలు స్వాగత ఉపన్యాసాలు ఇచ్చారు. బ్రేస్ట్ క్యాన్సర్‌పై ప్రముఖ డాక్టర్ శీలా కొండా మహిళలకు అవగాహన కల్పించారు. మహిళల్లో మానసిక సమస్యలపై ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ అలయన్స్, ఇండియానాకు చెందిన నిపుణురాలు మేరీ బెడెల్ మాట్లాడారు.
ఆ తర్వాత అర్బన్ జస్టిస్‌కు చెందిన అటార్నీ స్వప్నా రెడ్డి ఇమిగ్రేషన్ సమస్యలపై విలువైన సమాచారాన్ని పంచుకున్నారు.కార్యక్రమానికి హాజరైన మహిళలకు క్విజ్, తెలుగు స్పీకింగ్ కాంపిటీషన్ తదితర పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హరి మాధురి పాడిని పాటలను ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారు.
Advertisement