ఆటా ఆధ్వర్యంలో స్వామి చిదాత్మానంద ఈవెంట్ | ATA louisville successfully organized Swami Chidatmananda discourse | Sakshi
Sakshi News home page

ఆటా ఆధ్వర్యంలో స్వామి చిదాత్మానంద ఈవెంట్

Published Sun, Jun 18 2017 11:05 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

ఆటా ఆధ్వర్యంలో స్వామి చిదాత్మానంద ఈవెంట్

ఆటా ఆధ్వర్యంలో స్వామి చిదాత్మానంద ఈవెంట్

కెంటకీ: అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో స్వామి చిదాత్మానంద ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కెంటకీ రాష్ట్రం లూయిస్‌విల్లేలోని ఓ ఆలయంలో జరిగిన ఈవెంట్లో ఆటా సభ్యులతో పాటు తెలుగు ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భయాన్ని వీడాలి- ధైర్యంగా ఉండాలన్న అంశంపై స్వామి చిదాత్మానంద చెప్పిన విషయాలను అందరూ ఆసక్తిగా విన్నారు. తన మాటలతో ఆయన ఎన్నారైలలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఆటా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఉపయోగకరమైన ఈవెంట్లను మరిన్ని చేపట్టాలని హాజరైన ఎన్నారైలు ఆటా కార్యవర్గ బృందాన్ని కోరారు. ఆటా కెంటకీ సభ్యుడు డాక్టర్ మహేశ్ గుండ్లూరు, కెంటకీ రిజనల్ కో-ఆర్డినేటర్ హేమ ప్రసాద్ సడ్డాలా, అనిల్ గంటేటి, తేజు స్వరూప్, తదితరులు ఈవెంట్‌ను నిర్వహించారు. కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బొడ్డిరెడ్డి లాంటి ప్రముఖులు చిదాత్మానంద స్వామి విచ్చేసిన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement