సినారెకు ఆటా ఘన నివాళి
కెంటకీ: తెలుగు జాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన మహాకవి డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సంతాపాన్ని తెలిపింది. కెంటకీ, లెక్సింగ్టన్‌లో ఆటా సభ్యులు సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడి మసాలా ఇండియన్ రెస్టారెంట్‌లో ఆటా బృందంతో పాటు తెలుగు ఎన్నారైలు సినారెకు తుది నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యానికి సినారె అందించిన సేవల్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, టీడీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి అనుగు, మిమిక్రీ రమేశ్, అనిల్ బొడ్డిరెడ్డి, ఆటా స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ తిరుపతిరెడ్డి ఎర్రంరెడ్డి, కెంటకీ రీజనల్ కో-ఆర్డినేటర్ మహేశ్ గుండ్లూరు, అనిల్ గంటేటి, ఆటా కార్యవర్గ బృందం హేమ ప్రసాద్ సడ్డాలా, బాబు కొండవీటి, సురేశ్.ఎం, డాక్టర్ రాపూరి, రమేశ్ సొంటేనమ్, రమేశ్ మల్నేని, నయన్.ఎం, సురేశ్ పొట్లూరీ, శ్రీని ఆకుల, పార్శి, శ్రీనివాస్ సత్రశాల, శ్రీనివాస్ రెడ్డి, లెక్సింగ్టన్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు పాల్గొని సాహితీ శిఖరం సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. సినారె లేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు.