'జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్' | MP kavitha attends American Telugu Association silver jubilee conference | Sakshi
Sakshi News home page

'జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్'

Published Sun, Jul 3 2016 10:53 PM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

'జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్' - Sakshi

'జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్'

ఎక్కడ ఉన్నా.. తెలుగువారంతా ఒక్కటే : ఎంపీ కవిత
రెండో రోజు అంగరంగ వైభవంగా ఆటా ఉత్సవాలు
బతుకమ్మ బోనాలతో ఘనస్వాగతం
హాజరైన తెలంగాణ, ఏపీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు


రాయికల్: ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒక్కటేనని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికాలోని చికాగోలో ఆటా రజతోత్సవ వేడుకలలో రెండో రోజైన శనివారం కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏ దేశంలోనైనా ఏదైనా ప్రమాదం జరిగితే తెలుగువారు ఎలా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తారని కవిత చెప్పారు. గతంలో అమెరికా అంటేనే తానా మహాసభలు, ఆటా మహాసభలు గుర్తుకు వచ్చేవని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు ఆచార సంప్రదాయాలను కాపాడటం కోసం ఆటా చేస్తున్న కృషి సహకరించిన ప్రతినిధులను అభినందించారు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలు విడిపోయాయని అన్నారు.

జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం అలరించింది. కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ బోనాలతో సభావేదికపైకి చేరుకోవడం ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్‌ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్, ఎంపీ జితేందర్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు మధుయాష్కీగౌడ్, రాజగోపాల్‌రెడ్డి, ఆటా సంఘం అధ్యక్షుడు పెర్‌కారి సుధాకర్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement