న్యూ జెర్సీ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో ఘనంగా నిర్వహించారు. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమానికి న్యూ జెర్సీ, పెన్సిల్ వేనియా, న్యూయార్క్, డెలావేర్ , కనీక్ట్ కట్ల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.
ఆటా న్యూజెర్సీ ప్రాంతీయ సమన్వయకర్తలు రవీందర్ గూడురు, విలాస్ జంబులలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకకు వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. ఆటా మహిళా విభాగం ఛైర్పర్సన్ ఇందిరా శ్రీరాం రెడ్డి ఈ సభకు అధ్యక్షత వహించారు.
న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ రీవా గంగూలీ దాస్, ఎయిర్ ఇండియా జనరల్ మేనేజర్ ఆఫ్ అమెరికా వందన శర్మ, న్యూ జెర్సీ కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ పింకిన్స్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు శక్తివంతంగా తయారు కావల్సిన ఆవశ్యకత ఉందని అతిథులు పేర్కొన్నారు. అలాగే స్త్రీలు విద్యావంతులై, ఆర్థిక స్వావలంబన సాధించుకున్ననాడే జగతికి నిజమైన ప్రగతి అని తెలిపారు. ఈ సందర్భంగా రీవా గంగూలీ దాస్, వందన శర్మ, వసంత పెర్కారిలను వారి వారి రంగాల్లో కనబరిచిన ప్రతిభకుగానూ సన్మానించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తరచూ వార్తలో నిలుస్తున్న భారతీయ ప్రముఖ మహిళలపై శ్రీదేవి జాగర్లమూడి, గీతారెడ్డి, మాధవి శ్రీకోటి క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ క్విజ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఫ్యాషన్ షోలో ఇచ్చే బహుమతికి శ్రావణి ఎంపికయ్యారు. వినోదకరమైన ప్రదర్శనలతో కార్యక్రమం ఆసాంతం సభికులను అలరించాయి. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చీరెలు, బంగారు ఆభరణాల స్టాళ్లు సందడిగా కనిపించాయి.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన నందిని దర్గుల, మాధవి అరువ, జమున పుస్కూర్, శాంతి ఇప్పన పల్లి, అరుణ గున్న, శిల్పి కుందూరు, చిత్రలేఖ జంబుల, మాధవి గూడూరు, విజిత దేవనపల్లి, జ్యోతి, నిహారిక గుడిపాటి, భాను మాగంటి, శ్రీలత రెడ్డిలకు ఆటా నిర్వాహక సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ పరమేష్ భీంరెడ్డి, మాజీ అధ్యక్షులు సుధాకర్ పెర్కారి, సంయక్త కోశాధికారి శ్రీనివాస్ దార్గుల, అడ్వైజరీ కో ఛైర్మన్ సురేష్ జిల్లా, ట్రస్టీలు పరశురామ్ పిన్నపురెడ్డి, రవి పట్లోళ్ల, వినోద్ కోడూరు, కృష్ణ ధ్యాప, శరత్ వేముల, విజయ్ కుందూరు, రఘువీర్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేష్ మాగంటి, ప్రొఫెసర్ రాజశేఖర్ వంగపాటి, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ గుడిపాటి రీజినల్ డైరెక్టర్ మహీధర్ సనపరెడ్డి, రీజినల్ అడ్వైజర్ రాజ్ చిలుములలు కార్యక్రమం జయప్రదం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు.
ఘనంగా 'ఆటా' మహిళా దినోత్సవం
Published Wed, Mar 15 2017 11:17 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM
Advertisement
Advertisement