కృష్ణప్రసాద్ (ఫైల్‌ఫొటో)
షికాగో : అమెరికాలోని షికాగోలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంబారిపేట కృష్ణప్రసాద్ (33) మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు మానవతావాదులు ముందుకొస్తున్నారు. కృష్ణప్రసాద్‌తో కలసి పనిచేసిన వారు, స్నేహితులు, ఆయన సోదరుడు విరాళాల కోసం గోఫండ్‌మీ పేజీని రూపొందించారు. 20 వేల డాలర్ల కోసం ఈ పేజీని ఏర్పాటుచేశారు. మృతదేహాన్ని భారత్‌కు పంపడానికి ఆయన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ డబ్బును ఉపయోగించనున్నారు.
హైదరాబాద్‌లోని రామంతాపూర్ శాంతినగర్‌కు చెందిన కృష్ణప్రసాద్ ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. షికాగోలోని హంటర్‌డ్రైవ్ అపార్ట్‌మెంట్–2ఏలో ఉంటూ విటెక్ కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అమెరికాలో పని చేస్తూ కుటుంబానికి కృష్ణప్రసాదే పెద్ద దిక్కు ఉండేవారు. గురువారం అతని గది తలుపులు ఎంతకూ తెరుచుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు గది తలుపులు తెరచి చూడగా కృష్ణప్రసాద్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అతనికి భార్య మైథిలి, కూతురు సాహితి(6), కుమారుడు అర్జున్(3) ఉన్నారు. భార్యాపిల్లలు హైదరాబాద్‌లోనే ఉండగా.. కృష్ణప్రసాద్ ఒక్కడే షికాగోలో ఉంటున్నాడు. కృష్ణప్రసాద్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. విరాళాలు ఇవ్వాలనుకునే వారు గోఫండ్‌మీ పేజీ కోసం కింది లింక్ క్లిక్ చేయగలరు.
Comments
Please login to add a commentAdd a comment