
టాలీవుడ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి చిత్రం భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకుల స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రస్తుతం రానా కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత రానా నాయుడు సీజన్-2లోనూ కనిపించనున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా దీనిని రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం రానా అమెరికాలోని చికాగోలో పర్యటిస్తున్నారు. అక్కడే ఆయన బాక్సింగ్ షో ఈవెంట్లకు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఆయన ఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment