నాకు ఇల్లు లాంటి జైలు అంటే ఇష్టం! | man robs bank to go 'home' to prison; sentenced to 3 yrs | Sakshi
Sakshi News home page

నాకు ఇల్లు లాంటి జైలు అంటే ఇష్టం!

Published Fri, Apr 18 2014 5:30 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

man robs bank to go 'home' to prison; sentenced to 3 yrs

చికాగో:జీవితంలో ఏయే అంశాలైతే  మనల్ని ఎక్కువగా ప్రభావం చేస్తాయో.. వాటి ఆధారంగానే జీవిత గమనం సాగుతూ ఉంటుంది.మనం జీవితంలో లక్ష్యాలను సాధించడానికైనా..తప్పుదారిలో పయనించడానికైనా మన చుట్టూ ఉన్న పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది బాహ్య జీవితంలో ఉన్న వారికే కాదు.  జైలు జీవితం గడిపే వారికి వర్తిస్తుందని ఓ ఖైదీ నిరూపించాడు. తనకు బయట ఉండటం కంటే జైలులో ఉండటమే యోగ్యం ఉందని బ్యాంక్ దొంగతనానికి పాల్పడిన వాలన్ బాహెన్ (74) అనే ఖైదీ స్పష్టం చేశాడు. చిన్నతనం నుంచి దొంగతనాలు చేస్తూ జైలు జీవితం గడిపిన అతను చోరీల నేరచరిత్రను 1968 మొదలు పెట్టి.. పలుమార్లు శిక్షపడటంతో జైలు జీవితాన్ని ఎక్కువగా గడిపాడు. ఈ క్రమంలోనే అతనికి జైలు జీవితంపై అనుబంధం ఎక్కువైంది. అనంతరం 2011లో విడుదలైన దక్షిణ కరోలినాలో ఉంటున్న తన సోదరి వద్ద కొంతకాలం గడిపాడు.

 

2013వ సంవత్సరం ఫిబ్రవరిలో నైల్స్ లోని ఓ బ్యాంక్ దొంగతనానికి పాల్పడి  మరోమారు జైలు జీవితం గడిపేందుకు సిద్ధమైయ్యాడు. అతనికి యూఎస్ జిల్లా జడ్జి మూడు సంవత్సరాల శిక్షను ఖరారు చేస్తూ తీర్పునివ్వడంతో అతను సంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు ఇల్లు లాంటి జైలు అంటేనే మమకారం ఎక్కువని..ఆ క్రమంలోనే మరోమారు జైలుకి వెళ్లడానికి దొంగతనం చేశానని పోలీసులకు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement