చికాగో : టెక్సాస్‌లోని హోస్టన్‌లో ప్రపంచ తెలంగాణ కన్వెన్షన్ నిర్వహించడానికి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఆటా-తెలంగాణ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జూన్ 29, 30, జులై 1న నిర్వహించే ఈ కార్యక్రమం కోసం చికాగోలో 3,57,200 డాలర్ల విరాళాలను సేకరించారు. విరాళాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 400 మంది ఎన్‌ఆర్‌ఐలు హాజరయ్యారు. ఆటా తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేందర్ చిమర్ల అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ప్రపంచ తెలంగాణ కన్వెన్షన్ ఏర్పాట్లను ఆటా తెలంగాణ అధ్యక్షులు సత్య కందిమల్ల వివరించారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ చేపట్టిన చారిటీ కార్యక్రమాలను వివరిస్తూ.. హోస్టన్ వరద బాధితుల కోసం విరాళాల ద్వారా నిధులు సమకూర్చి వారికి తమవంతు సహాయం అందించామని పేర్కొన్నారు.
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావం, లక్ష్యాల గురించి ఛైర్మన్ కరుణాకర్ మాధవరం తెలిపారు. అడ్‌హక్ కమిటీ శ్రీనివాస్ చాడ, బోర్డు మెమర్, క్రిష్ణ రంగరాజు, స్టాండింగ్ కమిటీ ఛైర్స్ రామచంద్రారెడ్డి ఆడె, సాయి గొంగటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడంలో తమవంతు కృషి చేశారు. ప్రపంచ తెలంగాణ కన్వెన్షన్ కోసం విరాళాలు ఇచ్చిన దాతలకు ట్రెజరర్ ప్రతాప్ చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు. రీజినల్ డైరెక్టర్ రంగారెడ్డి లెంకల, పల్లె పాట ఆటా నోటా కోఆర్డినేటర్ బిందు గొంగటి, ఆటా తెలంగాణ చికాగో వాలంటీర్లు, అతిథులను మంచి కార్యక్రమాలతో అలరించిన ప్రవీణ్ జలిగమకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment