
ఆటాకు వెళ్లటం లేదు : హీరోయిన్లు
ఆటా రజతోత్సవాలకు తాము వెళ్లడం లేదని ఇద్దరు హీరోయిన్లు స్పష్టం చేశారు.
ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే అమెరికన్ తెలుగు అసోషియేషన్ వేడుకలు ఈ ఏడాది మరింత గ్రాండ్ జరగనున్నాయి. అమెరికాలోని తెలుగు ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఈ అసోషియేషన్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రజతోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. జూలై 1, 2, 3 తేదిలలో జరగనున్నా వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
ఇప్పటికే ఈ వేడుకల్లో పాల్గొనే సెలబ్రిటీలకు సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదలైంది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కూడా ఆటా వేడుకలలో పాల్గొంటుందంటూ వస్తున్న వార్తలపై ఈ మిల్కీ బ్యూటీ స్పందించింది. తాను ఈ వేడుకలకు హాజరు కావటం లేదని ప్రకటించింది. ముందుగా వేడుకలకు హాజరవుతున్నట్టుగా ప్రకటించిన సమంత కూడా వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోతున్నట్టుగా ప్రకటించింది. చికాగోలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో జగపతిబాబు, నాని, రాశీ ఖన్నా, లావణ్య త్రిపాఠి వంటి స్టార్స్ తో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా సందడి చేయనున్నారు.
Hello everyone , I will not be attending ATA function in Chicago this year.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) 29 June 2016
Sorry due to a few issues will not be able to attend AATA in Chicago . Sorry
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 28 June 2016