టాలీవుడ్‌లో ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోహీరోయిన్ల హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజ్ అయి..మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు సమంత నటించిన ఓ సినిమా కూడా రీరిలీజ్ కాబోతుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత, నాని జంటగా నటించిన చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.
ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ చిత్రాన్ని వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment