చికాగో ఆంధ్ర అసోసియేషన్ పల్లె సంబరాలు! | Chicago Andhra Association Celebrations | Sakshi
Sakshi News home page

చికాగో ఆంధ్ర అసోసియేషన్ పల్లె సంబరాలు!

Published Fri, Feb 16 2024 11:27 AM | Last Updated on Fri, Feb 16 2024 11:27 AM

Chicago Andhra Association Celebrations - Sakshi

చికాగో ఆంధ్ర అసోసియేషన్-సీఏఏ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హిందు టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో జరిగిన పల్లె సంబరాలకు విశేష స్పందన వచ్చింది. సంస్థ అధ్యక్షురాలు శ్వేత, చైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ, సంస్థ సభ్యుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు.

కాన్సలేట్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా సోమ్నాధ్ ఘోష్ ముఖ్య అతిధిగా విచ్చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారు. విందు భోజనాన్నిఆహూతులందరికీ ఎంతో ఆప్యాయంగా వడ్డించారు. పిల్లలు-పెద్దలు పోటీలు పడి మరీ భోజనం వడ్డించారు. చిన్నారులకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ వేడకలను ఘనంగా నిర్వహించారని పలువురు ప్రశంసించారు.

(చదవండి: టెక్సాస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement