associations
-
చికాగో ఆంధ్ర అసోసియేషన్ పల్లె సంబరాలు!
చికాగో ఆంధ్ర అసోసియేషన్-సీఏఏ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హిందు టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో జరిగిన పల్లె సంబరాలకు విశేష స్పందన వచ్చింది. సంస్థ అధ్యక్షురాలు శ్వేత, చైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ, సంస్థ సభ్యుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. కాన్సలేట్ జనరల్ ఆఫ్ ఇండియా సోమ్నాధ్ ఘోష్ ముఖ్య అతిధిగా విచ్చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారు. విందు భోజనాన్నిఆహూతులందరికీ ఎంతో ఆప్యాయంగా వడ్డించారు. పిల్లలు-పెద్దలు పోటీలు పడి మరీ భోజనం వడ్డించారు. చిన్నారులకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ వేడకలను ఘనంగా నిర్వహించారని పలువురు ప్రశంసించారు. (చదవండి: టెక్సాస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్!) -
ఆక్వా రైతుల ఫిర్యాదులపై సీఎం జగన్ సీరియస్
-
ఈజీఆర్ విభాగం ఏర్పాటు దిశలో బీఎస్ఈ అడుగులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) విభాగం ఏర్పాటు దిశలో బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) కీలక అడుగులు వేసింది. ఈ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడానికి మహారాష్ట్ర, తమిళనాడు నుంచి నాలుగు ప్రాంతీయ అసోసియేషన్లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బీఎస్ఈ తెలిపింది. వీటిలో తిరునెల్వేలి గోల్డ్ సిల్వర్ డైమండ్ జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్, నాందేడ్ సరాఫా అసోసియేషన్, సరాఫ్ సువర్కర్ సంత్నా పూసద్, ఘడ్చిరోలి జిలా సరాఫా అసోసియేషన్లు ఇందులో ఉన్నాయి. వీటిలోని దాదాపు 1,000 మంది సభ్యులు జ్యూయలరీ, బులియన్ ట్రేడ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యాలతో దేశీయ, అంతర్జాతీయ జోన్లలో శక్తివంతమైన గోల్డ్ ఎక్సే్చంజ్‌ని అభివృద్ధి చేయడంలో పరివర్తనాత్మక పాత్రను పోషించగలదనే విశ్వాసాన్ని బీఎస్ఈ వ్యక్తం చేసింది. ఈజీఆర్ సెగ్మెంట్ ఏర్పాటుకు కొద్ది రోజుల క్రితమే బీఎస్ఈకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో గోల్డ్ ఎక్సే్చంజ్‌ల ఏర్పాటుకు వీలుగా వాల్డ్ మేనేజర్స్ నిబంధనావళిని కూడా సెబీ ఇటీవలే నోటిఫై చేసింది. గోల్డ్ ఎక్సే్చంజ్‌ల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) రూపంలో బంగారం ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీఆర్‌ను బాండ్‌గా పరిగణిస్తారు. సంబంధిత ఈజీఆర్‌లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, ఫిజికల్ డెలివరీ ఫీచర్లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్‌కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం, పటిష్ట స్పాట్ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్ ఎక్సే్చంజ్ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గోల్డ్ ఎక్సే్ఛంజ్, వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్లు్యడీఆర్ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నాలుగో రోజుకు లారీల సమ్మె
నెల్లూరు(టౌన్): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానుల అసోసియేషన్ చేపట్టిన బంద్ నాలుగో రోజుకు చేరుకుంది. జిల్లాలో 10 వేలకు పైగా లారీలు నిలచిపోయాయి. ఇప్పటివరకు జిల్లాలో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడం ద్వారా రూ.22 కోట్ల మేర నష్టం వాటిల్లింది. నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట ప్రాంతాల్లో లారీల యజమానులు బంద్ నిర్వహిస్తున్నారు. పై రాష్ట్రాల నుంచి జాతీయ రహదారిపై లోడుతో వస్తున్న వాహనాలను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం ఆ లారీలను అక్కడ నుంచి పంపించి వేశారు. జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి నారాయణ బంద్‌ను ఉధృతం చేస్తామని తెలిపారు. యజమానుల సమస్యలను పరిష్కరించే వరకు బంద్‌ను విరమించేది లేదని చెబుతున్నారు. -
రవాణా బంద్!
పాలమూరు: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లారీలను ఎక్కడిక్కడే నిలిపివేశారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచే లారీ సమ్మె ప్రారంభం కావడంతో రోడ్లపై లారీ లు కన్పించలేదు. ప్రధానంగా జాతీయ రహదారిపై లారీలు తిరగకపోవడం వల్ల బోసిపోయి కని పించింది. నిత్యం వందల సంఖ్యలో లారీల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఒ క్కసారిగా లారీలు రాకపోకలు నిలిపివేయడం వ ల్ల రోడ్డు పూర్తిగా ఖాళీగా కన్పించింది. దీంతో పా టు నిత్యం రద్దీగా ఉండే తాండూర్ రోడ్డుకూడా లారీల రాకపోకలు లేక ఖాళీగా కన్పించింది. అలా గే, అంతరాష్ట్ర రహదారి అయిన రాయిచూర్ వైపు కూడా బోసిపోయింది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 5,500 లారీలు నిలిచిపోయినట్లు అంచనా. జిల్లా కేంద్రంలో ర్యాలీ లారీల సమ్మెలో భాగంగా మొదటి రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనం ఎదుట దీక్ష నిర్వహించారు. దీంతోపాటు జిల్లా కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లారీ ఓనర్స్ అ సోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, కార్యదర్శి బాబు జానీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిత్యావసరాలకు సంబంధించిన లారీలను అనుమతి ఇస్తామని అప్పటికి తమ డిమాండ్లపై స్పష్టత రాకపోతే అన్ని వాహనాలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివయ్య, రషీద్‌ఖాన్, అన్వర్ పాషా, రాఘవేందర్, దస్తగిరి, సలీం, మణెం పాల్గొన్నారు. లారీల అడ్డగింత హన్వాడ మండల పరిధిలోని చిన్నదర్పల్లి గ్రామసమీపంలో ప్రభుత్వ సహకారంతో పని చేస్తున్న సీడబ్ల్యూసీ గోదాం దగ్గర లారీలు నడుపుతున్నట్లు సమాచారంతో అసోసియేషన్ సభ్యులు వెళ్లి అడ్డుకున్నారు. గూడ్స్ రైలు ద్వారా వచ్చిన బియ్యంను గోదాంకు తరలించడంతో పాటు వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. -
లారీల బంద్ ప్రశాంతం
ఒంగోలు: లారీల బంద్ తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు లారీ యజమానులు తమ లారీలను యూనియన్ కార్యాలయం ఆవరణలోనే పార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వేమూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లారీ యూనియన్ కార్యాలయం ఆవరణలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లారీకి ఐటీ స్టాండర్డ్‌ను తగ్గించాలని, డీజిల్ రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిం చాలని, నేషనల్ పర్మిట్ లారీలకు డబుల్ డ్రైవర్ల వ్యవహారాన్ని విరమించాలంటూ పలు డిమాండ్లను నినదించారు. సుదూరం నుంచి బయలు దేరిన లారీలు గమ్యానికి చేరుకునేంత వరకు ఆపడం లేదని, కొత్తగా ఎవరు లోడ్లు ఎత్తుకోవడం లేదన్నారు. తొలి రోజు ట్యాంకర్ యాజమాన్యాలు సంఘీభావం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. బంద్ ప్రభావం రెండో రోజు నుంచి కనిపిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ మొండిపట్టు వీడాలని కోరారు. సింగరాయకొండలో కొద్దిసేపు లారీ ఓనర్లు లారీలను ఆపేందుకు యత్నించగా పోలీసులు ఆ ప్రక్రియను భగ్నం చేశారు. రవాణాశాఖ అధికారులు మాత్రం తొలిరోజు 92 శాతం లారీలు తిరిగాయని, జన జీవనంపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. -
వైఎస్ జగన్‌ను కలిసిన రైతుల సంఘాల నేతలు
-
పోస్టర్ యుద్ధం
తమను మావోయిస్టులుగా చిత్రీకరించడం ద్వారా పోలీసులు, ప్రభుత్వం మహిళా ఉద్యమాలను అణదొక్కుతున్నారని ఆరోపిస్తూ మహిళా చేతన, చైతన్య మహిళా సంఘం తదితర సంఘాల ధర్నా.. అదే సమయంలో ఈ సంఘాల సభ్యుల ఫొటోలతో కూడిన బ్యానర్లతో గిరిజనులతో పోలీసులు నిర్వహించిన ర్యాలీ.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ రెండు వర్గాలు తారసపడటంతో బుధవారం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. తమ ఫొటోలున్న బ్యానర్లను మహిళా సంఘాల ప్రతినిధులు లాక్కొని.. దహనం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రతిఘటించిన వారిని ఈడ్చుకుంటూ వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా పలువురు మహిళా సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయడంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చర్యలను నిరసిస్తూ పలు సంఘాలు పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకుంటూ వ్యాన్ ఎక్కించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని దౌర్జన్యంగా లాక్కెళ్లారు. ధర్నా టెంట్లను పడగొట్టారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఒకానొక సమయంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. తమ సభ్యులు మవోయిస్టులకు అనుకూలంగా పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వం పోస్టర్ల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ బుధవారం జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) పలు మహిళా సంఘాలు, వామపక్ష నాయకులతో కలిసి ధర్నా నిర్వహించింది. అదే సమయంలో అరుకు, పాడేరు మండలాల నుండి వచ్చిన కొంత మంది గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వారు పట్టుకున్న బ్యానర్లపై మావోయిస్టులుగా సీఎంఎస్ నేతలు రాజేశ్వరి, అన్నపూర్ణ, లలిత, పద్మ, రాధ ఫొటోలు ఉండటంతో సీఎంఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. మావోయిస్టులతో తమకు సంబంధం ఉందని నిరూపించగలరా అని సవాల్‌చేశారు. వారికి వ్యతిరేకంగా ముద్రించిన ప్లెక్సీలను తగలబెట్టారు. సీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ తమకు వ్యతిరేకంగా పోలీసులే కొందమంది గిరిజనులను తీసుకువచ్చారని, ప్లెక్సీలు, బ్యానర్లు ముద్రించారని పేర్కొన్నారు. హింసకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మహిళల్ని చైతన్య పరుస్తున్న సీఎంఎస్ నాయకులను నిర్బంధించడానికే ‘ఆదివాసీ విద్యార్థి సంఘం, విద్యార్థినీ చైతన్య పేరు మీద తమ కార్యకర్తలపై మావోయిస్టులనే ప్రచారం చంద్రబాబు ప్రభుత్వం చేయిస్తోందన్నారు. తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు ఇలాంటి చౌకబారు పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు, విజయవాడ తదితర చోట్ల కూడా తమ గురించి పోస్టర్లు వేయడంతో అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా విశాఖలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఇక్కడ కూడా పోలీసులు రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఉద్యమాలను అణచడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.మావోయిస్టులకు వ్యతిరేకంగా అరుకు నుంచి వచ్చిన భవానీ అనే మహిళ మాట్లాడుతూ పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే నేపంతో తమ గిరిజనులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కోసం పోరాడుతున్నామని చెప్పే మావోలు ఆ ప్రజలనే దండిస్తున్నారన్నారు.ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం.లక్ష్మి తదితరులు మాట్లాడారు. అనంతరం మహిళా సంఘం చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. వారిని ఈడ్చుకుంటూ వ్యాన్ ఎక్కించారు. ధర్నాలో పలు మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లెక్సీలు తగలబెడుతున్న మహిళా సంఘాల ప్రతినిధులు మహిళా సంఘాల నిరసన అల్లిపురం: మహిళా సంఘాల ప్రతినిధుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మహిళా సంఘాల నాయకులు బుధవారం సాయంత్రం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా చేతన కార్యదర్శి కత్తి పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం.లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రతినిధి ఎ.విమల, చైతన్య మహిళా సంఘం ప్రతినిధి ఎస్.అనిత, విరసం ప్రతినిధి కృష్ణబాబు, పౌర హక్కుల సంఘం ప్రతినిధి పి.అప్పారావులు మాట్లాడుతూ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తున్న శిబిరంపై దాడిచేశారని ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్‌లు చేశారన్నారు. -
సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలి
ఈఓపీఆర్ అండ్ ఆర్డీ జిల్లా అసోసియేషన్ డిమాండ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారుల (ఈఓపీఆర్ అండ్ ఆర్డీ) సర్వసభ్య సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో ఆదివారం సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈఓపీఆర్ అండ్ఆర్డీల అధీనంలో పనిచేసే పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించే బాధ్యతలను అప్పగించాలని, పంచాయతీల్లో ఆన్లైన్ విధానం అమలవుతున్న నేపథ్యంలో వాటిని పర్యవేక్షిస్తున్న తమకు కంప్యూటర్ఆపరేటర్ను, జూనియర్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జిల్లా అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జి.శ్రీరామరెడ్డి, ఎన్వీ సోమయాజులు, నాగేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. నూతన కార్యవర్గం జిల్లా అసోసియేషన్ అధ్యక్షునిగా పి.వెంకటరత్నం, జనరల్‌సెక్రటరీగా పి.మణేశ్వరరావు, గౌరవాధ్యక్షుడిగా డీవై నారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా జె. వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా సీహెచ్ జగ్గారావు, పి.బొజ్జిరాజు, కె. శేషారత్నం, జాయింట్ సెక్రటరీగా పీఆర్కే భగవాన్, కోశాధికారిగా జీజేఆర్ కృష్ణయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్వీ ప్రసాద్ ఎన్నికయ్యారు. డివిజన్ల అధ్యక్షులు వీరే.. వి. రత్నం (అమలాపురం డివిజన్), పి. విద్యాసాగర్ కుమార్ (కాకినాడ డివిజన్), పి. మహేశ్వర ప్రతాప్ (పెద్దాపురం డివిజన్), పీజీ రామకృష్ణ (రాజమహేంద్రవరం డివిజన్), ఎం. రాఘవులు (రామచంద్రపురం డివిజన్), జి. కృష్ణ (రంపచోడవరం డివిజన్), ఎస్. శివరామ్ (ఎటపాక డివిజన్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఈఓపీఆర్ అండ్ ఆర్డీలు ఘనంగా సత్కరించారు. -
ప్రాణాలు తీసిన పిడుగులు
ముత్తుకూరు, న్యూస్‌లైన్: ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో శుక్రవారం జిల్లా దద్దరిల్లిపోయింది. వర్షం పెద్దగా కురవకపోయినప్పటికీ ఉరుముల శబ్ధానికి ప్రజలు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. వేర్వేరు చోట్ల ఇద్దరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోగా, పెద్దసంఖ్యలో మూగజీవాలు కూడా మృత్యువాతపడ్డాయి. చలివేంద్ర రోడ్డులోని ముత్తుకూరు పాత దళితవాడ సమీపంలో కత్తి వెంకటరమణమ్మ (25) కొత్తగా నిర్మించిన ఇంటిపై ఎక్కి శ్లాబుపై నీళ్లు పడుతుండగా పిడుగుపాటుకు గురైంది. ఆ షాక్‌కు ఆమె ఇంటిపై నుంచి కిందపడి అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయింది. నెల్లూరులో ఉంటున్న వెంకటరమణమ్మ ఓటు వేసేందుకు భర్త సుబ్రహ్మణ్యంతో పాటు మూడు రోజుల క్రితం ముత్తుకూరుకు వచ్చింది. అనేకపల్లిలో ఒకరు వెంకటాచలం: అనికేపల్లికి చెందిన జానబోయిన వెంకటరమణయ్య(35) పశువులను మేత కోసం పొలాల్లోకి తోలుకెళ్లాడు. ఆయన కు సమీపంలోనే పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రమణయ్యకు భార్య గాయత్రి, పిల్లలు ప్రదీప్, ప్రవీణ్ ఉన్నారు. ఇంటిపెద్ద మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. అందరితో కలివిడిగా ఉండే వెంకటరమణయ్య చిన్నవయస్సులోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కావలిలో మూగజీవాలు కావలిఅర్బన్: పట్టణంలోని పెంకులఫ్యాక్టరీ గిరిజనకాలనీలో పిడుగుపాటుకు ఇస్సారపు రమణయ్యకు చెందిన రెండు గేదెలు, రెండు కోళ్లు మృతి చెందాయి. సుమారు రూ.70 వేలు నష్టపోయానని రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అదే ప్రాంతానికి చెందిన బండ్లమూడి కేశవులకు చెందిన 9 గొర్రెలు కూడా పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోవడంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల తీవ్రతతో గౌరవరంలో విద్యుత్ తీగలు రాసుకుని నిప్పురవ్వలు సమీపంలోని గడ్డివాములు, పూరిళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో ఏడు గడ్డివాములు, రెండు పూరిళ్లు కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. -
షర్మిల యాత్రలో ఉద్యమం బలోపేతం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తిరుపతి నుంచి ప్రారంభించిన సమైక్య శంఖారావం ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రాష్ట్రాన్ని విభజించడం వల్ల తలెత్తే సమస్యలను వివరిస్తూ సోమవారం తిరుపతి నుంచి షర్మిల ప్రారంభించిన యాత్ర చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల మీదుగా బుధవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. 36 రోజు లుగా స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమం చేస్తున్న వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, అసోసియేషన్లు, జేఏసీలకు షర్మిల యాత్ర బలాన్నిచ్చింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అస్పష్ట విధానాలతో సీమాంధ్ర ప్ర జలను వంచిస్తున్న తరుణంలో వైఎస్సార్ సీపీ స్పష్టమైన వైఖరితో ముందుకు రావడాన్ని అన్ని వర్గాలు స్వాగతించాయి. స్వయంగా జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల బస్సుయాత్ర చేపట్టి సమైక్య రాష్ట్ర అవసరాన్ని వివరిస్తుండడంతో స్వ చ్ఛందంగా ఉద్యమిస్తున్న వివిధ వర్గాలు త మకు ఒక అండ దొరికిందన్న భావనను వ్యక్తం చే స్తున్నాయి. షర్మిల యాత్రకు ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభించడానికి కారణమిదే నని అంటున్నారు. నిజానికి తిరుపతి, చి త్తూరు, మదనపల్లెలో షర్మిల సభలు ఉంటాయ ని వైఎస్సార్ సీపీ నేతలు ప్రకటించారు. ప్ర జలు, సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఒత్తిడి మేరకు యాత్రకు మద్దతుగా వేల సంఖ్యలో రహదారులపైకి తరలివచ్చిన వారినుద్దేశించి పలమనేరు, పుంగనూరు, ములకలచెరువు ప్రాంతాల్లో ప్రసంగించాల్సి వచ్చింది. పలుచో ట్ల పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు షర్మిలకు మద్దతుగా రహదారులపైకి వచ్చి యా త్రకు స్వాగతం పలికారు. ఇందుకోసం గంటల సేపు రహదారులపైనే వేచి ఉన్నారు. మదనపల్లె సభ అనుకున్న సమయం కంటే మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైనా జనం కదలకుండా షర్మిల ప్రసంగం ముగిసే వరకూ ఉండడం సమైక్య ఉద్యమ స్ఫూర్తిని చాటింది. యాత్ర విజయవంతం పట్ల నేతల హర్షం తక్కువ సమయంలో తేదీలు ఖరారైనప్పటికీ షర్మిల యాత్రకు చిత్తూరు జిల్లా ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభించడం వైఎస్సార్ పార్టీ నేతలను ఆనందింపజేసింది. మండే ఎండలో సైతం జనం తరలిరావడం ప్రజల్లో పార్టీ తీసుకొన్న సమైక్య విధానం పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. యువతను ఆకట్టుకున్న మిథున్‌రెడ్డి ప్రసంగం షర్మిల మూడురోజుల జిల్లా పర్యటనలో పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషిం చారు. యాత్రలో ఆయన చేసిన ప్రసంగాలు యువతను ఆకట్టుకున్నాయి. రూట్ మ్యాప్ తయారు చేయడం నుంచి సమావేశాలపై ఎప్పటికప్పుడు పార్టీ నాయకుడు వైవీ.సుబ్బారెడ్డితో కలిసి చర్చించి విజయవంతం చేయడం వరకు ముఖ్య పాత్ర పోషించారు. తిరుపతి సభలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డితో, చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్‌తో, మ దనపల్లెలో సమన్వయకర్త షమీమ్ అస్లాం, ఎ మ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డికి సంపూర్ణంగా సహకరించారు. మదనపల్లెలో ఆయన మాట్లాడు తూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాయలసీమ వాసులకు తాగునీరు లేకుండా చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీ సుకుందని ధ్వజమెత్తారు. విభజన వల్ల న ష్టాలు జరుగుతాయని తెలిసినా చంద్రబాబునాయుడు తెలంగాణ కు అనుకూలమైన లేఖను ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్,టీడీపి కుమ్మక్కై జనాదరణ కలిగిన జగన్మోహన్రెడ్డిని కేసుల్లో ఇరికించాయన్నారు. మిథున్‌రెడ్డిని తండ్రికి తగ్గ తనయుడిగా పలువురు కొనియాడారు.