బంద్ కారణంగా శుక్రవారం యూనియన్ కార్యాలయం వద్ద నిలిచి పోయిన లారీలు
ఒంగోలు: లారీల బంద్ తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు లారీ యజమానులు తమ లారీలను యూనియన్ కార్యాలయం ఆవరణలోనే పార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వేమూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లారీ యూనియన్ కార్యాలయం ఆవరణలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లారీకి ఐటీ స్టాండర్డ్‌ను తగ్గించాలని, డీజిల్ రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిం చాలని, నేషనల్ పర్మిట్ లారీలకు డబుల్ డ్రైవర్ల వ్యవహారాన్ని విరమించాలంటూ పలు డిమాండ్లను నినదించారు.
సుదూరం నుంచి బయలు దేరిన లారీలు గమ్యానికి చేరుకునేంత వరకు ఆపడం లేదని, కొత్తగా ఎవరు లోడ్‌లు ఎత్తుకోవడం లేదన్నారు. తొలి రోజు ట్యాంకర్ యాజమాన్యాలు సంఘీభావం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. బంద్ ప్రభావం రెండో రోజు నుంచి కనిపిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ మొండిపట్టు వీడాలని కోరారు. సింగరాయకొండలో కొద్దిసేపు లారీ ఓనర్లు లారీలను ఆపేందుకు యత్నించగా పోలీసులు ఆ ప్రక్రియను భగ్నం చేశారు. రవాణాశాఖ అధికారులు మాత్రం తొలిరోజు 92 శాతం లారీలు తిరిగాయని, జన జీవనంపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment