లారీలను ఆపుతున్న అసోసియేషన్ నాయకులు
భూపాలపల్లి వరంగల్: దేశ వ్యాప్త లారీల బంద్‌లో భాగంగా భూపాలపల్లి లారీ ఓనర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం లారీల యజమానులు ధర్నా నిర్వహించారు. రెండు రోజులపాటు లారీల ను నడిపించిన స్థానిక యజమానులు మూడో రోజు సమ్మెలో పాల్గొన్నారు. కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు వెళ్లుతున్న ఇసుక లారీలను ప్రధా న రహదారిపై అడ్డుకొని ధర్నా చేపట్టారు. అసోసియేషన్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షకు భుత్వ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణరెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజీల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో వాహనదారులపై అధిక భా రం పడుతోందన్నారు.
లారీ యజమానుల సమ్మెతో సరుకుల రవాణా నిలిచి పోయిందని వారు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్యక్షుడు కంకణాల రవీం దర్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగి స్తామని స్ప ష్టం చేశారు. బాలచంద్‌నాయక్, రమేష్, రాజేష్, హరిష్‌రెడ్డి, నర్సింగరావు, రవి, తిరుపతి, సేనప తి, వేణు, అయిలయ్య, రాజయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment