నెల్లూరు(టౌన్): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానుల అసోసియేషన్ చేపట్టిన బంద్ నాలుగో రోజుకు చేరుకుంది. జిల్లాలో 10 వేలకు పైగా లారీలు నిలచిపోయాయి. ఇప్పటివరకు జిల్లాలో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడం ద్వారా రూ.22 కోట్ల మేర నష్టం వాటిల్లింది. నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట ప్రాంతాల్లో లారీల యజమానులు బంద్ నిర్వహిస్తున్నారు. పై రాష్ట్రాల నుంచి జాతీయ రహదారిపై లోడుతో వస్తున్న వాహనాలను కొద్దిసేపు నిలిపివేశారు.
అనంతరం ఆ లారీలను అక్కడ నుంచి పంపించి వేశారు. జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి నారాయణ బంద్‌ను ఉధృతం చేస్తామని తెలిపారు. యజమానుల సమస్యలను పరిష్కరించే వరకు బంద్‌ను విరమించేది లేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment