మహబూబ్‌నగర్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న లారీల యజమానులు
పాలమూరు: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లారీలను ఎక్కడిక్కడే నిలిపివేశారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచే లారీ సమ్మె ప్రారంభం కావడంతో రోడ్లపై లారీ లు కన్పించలేదు. ప్రధానంగా జాతీయ రహదారిపై లారీలు తిరగకపోవడం వల్ల బోసిపోయి కని పించింది. నిత్యం వందల సంఖ్యలో లారీల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఒ క్కసారిగా లారీలు రాకపోకలు నిలిపివేయడం వ ల్ల రోడ్డు పూర్తిగా ఖాళీగా కన్పించింది. దీంతో పా టు నిత్యం రద్దీగా ఉండే తాండూర్ రోడ్డుకూడా లారీల రాకపోకలు లేక ఖాళీగా కన్పించింది. అలా గే, అంతరాష్ట్ర రహదారి అయిన రాయిచూర్ వైపు కూడా బోసిపోయింది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 5,500 లారీలు నిలిచిపోయినట్లు అంచనా.
జిల్లా కేంద్రంలో ర్యాలీ
లారీల సమ్మెలో భాగంగా మొదటి రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనం ఎదుట దీక్ష నిర్వహించారు. దీంతోపాటు జిల్లా కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లారీ ఓనర్స్ అ సోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, కార్యదర్శి బాబు జానీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిత్యావసరాలకు సంబంధించిన లారీలను అనుమతి ఇస్తామని అప్పటికి తమ డిమాండ్లపై స్పష్టత రాకపోతే అన్ని వాహనాలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివయ్య, రషీద్‌ఖాన్, అన్వర్ పాషా, రాఘవేందర్, దస్తగిరి, సలీం, మణెం పాల్గొన్నారు.
లారీల అడ్డగింత
హన్వాడ మండల పరిధిలోని చిన్నదర్పల్లి గ్రామసమీపంలో ప్రభుత్వ సహకారంతో పని చేస్తున్న సీడబ్ల్యూసీ గోదాం దగ్గర లారీలు నడుపుతున్నట్లు సమాచారంతో అసోసియేషన్ సభ్యులు వెళ్లి అడ్డుకున్నారు. గూడ్స్ రైలు ద్వారా వచ్చిన బియ్యంను గోదాంకు తరలించడంతో పాటు వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment