సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలి
Published Mon, Jul 18 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
ఈఓపీఆర్ అండ్ ఆర్డీ జిల్లా అసోసియేషన్ డిమాండ్
నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారుల (ఈఓపీఆర్ అండ్ ఆర్డీ) సర్వసభ్య సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో ఆదివారం సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈఓపీఆర్ అండ్‌ఆర్డీల అధీనంలో పనిచేసే పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించే బాధ్యతలను అప్పగించాలని, పంచాయతీల్లో ఆన్‌లైన్ విధానం అమలవుతున్న నేపథ్యంలో వాటిని పర్యవేక్షిస్తున్న తమకు కంప్యూటర్‌ఆపరేటర్‌ను, జూనియర్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జిల్లా అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జి.శ్రీరామరెడ్డి, ఎన్‌వీ సోమయాజులు, నాగేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.
నూతన కార్యవర్గం
జిల్లా అసోసియేషన్ అధ్యక్షునిగా పి.వెంకటరత్నం, జనరల్‌సెక్రటరీగా పి.మణేశ్వరరావు, గౌరవాధ్యక్షుడిగా డీవై నారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా జె. వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా సీహెచ్ జగ్గారావు, పి.బొజ్జిరాజు, కె.
శేషారత్నం, జాయింట్ సెక్రటరీగా పీఆర్‌కే భగవాన్, కోశాధికారిగా జీజేఆర్ కృష్ణయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్‌వీ ప్రసాద్ ఎన్నికయ్యారు.
డివిజన్‌ల అధ్యక్షులు వీరే..
వి. రత్నం (అమలాపురం డివిజన్), పి. విద్యాసాగర్ కుమార్ (కాకినాడ డివిజన్), పి. మహేశ్వర ప్రతాప్ (పెద్దాపురం డివిజన్), పీజీ రామకృష్ణ (రాజమహేంద్రవరం డివిజన్), ఎం. రాఘవులు (రామచంద్రపురం డివిజన్), జి. కృష్ణ (రంపచోడవరం డివిజన్), ఎస్. శివరామ్ (ఎటపాక డివిజన్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఈఓపీఆర్ అండ్ ఆర్డీలు ఘనంగా సత్కరించారు.
Advertisement
Advertisement