- ఉద్యోగులు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఎదుర్కోవాల్సిందే
- దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 17 వరకు అవకాశం
- డిసెంబర్‌లో ఆ¯ŒSలై¯ŒS విధానం పరీక్షలు
- విధివిధానాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
- ఏఏఎస్(ఆటోమేటిక్ అడ్వాన్‌సమెంట్ స్కీమ్)లో భాగంగా ఎస్‌జీటీ తత్సమాన కేడర్‌లో ఉన్న వారు 12 ఏళ్లు స్కేల్ పొందడానికి ఎటువంటి పరీక్షలు రాయాల్సిన పనిలేదు. కాని 24 సంవత్సరాల స్కేల్ పొందాలంటే మాత్రం జీవో, ఈఓ పరీక్షలు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి.
- స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులు 12 ఏళ్ల స్కేల్ పొందేందుకు డిగ్రీ, బీఎడ్ విద్యార్హతలతో పాటు జీఓ(గెజిటెడ్ ఆఫీసర్), ఈఓ(కార్యనిర్వహణ అధికారి) టెస్ట్ రెండు పరీక్షలు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి.
- స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందడానికి ఈవో, జీవో పరీక్షలు పాసవవ్వాలి.
- సర్వీస్‌లో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోని వారు 45 ఏళ్ల వయసు దాటితే ప్రస్తుతం పనిచేస్తున్న కేటగిరి నుంచి పై క్యాటగిరీకి వెళ్లేందుకు ఎటువంటి శాఖాపరమైన పరీక్ష లు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
- పేపర్–1(కోడ్ 88) : ఇన్‌స్పెక్షన్‌కోడ్స్, ది గ్రాంట్ ఇన్‌ఎయిడ్ కోడ్స్, ఎలిమెంటరీ స్కూల్ రూల్స్, పీఎఫ్ రూల్స్ ఫర్ నాన్–పెన్షబుల్ సర్వీస్‌తో పాటు వర్తమాన అంశాలు ప్రిపేర్ అవ్వాలి.
- పేపర్–2(కోడ్97) : ఏపీ పంచాయతీరాజ్ చట్టం–1994, ఏపీ పాఠశాల విద్య సర్వీస్ నిబంధనలు, ఏపీ సీసీఏ రూల్స్, ఏపీ మండల ప్రజా పరిషత్ చట్టం, ఏపీ ఓఎస్‌ఎస్ వీటితో పాటుగా వర్తమాన అంశాలు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.
- ఈవో పరీక్ష(కోడ్141) : ఏపీ బడ్జెట్ మాన్యువల్, ఏపీ ఖజానా శాఖ కోడ్, ఏపీ పింఛన్‌కోడ్ వీటితో పాటుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌స్కీమ్(సీసీఎస్), పీఆర్‌సీకి సంబంధించిన అంశాలను ప్రిపేర్ అవ్వాల్సి ఉంది.
- ప్రతి పేపర్‌కూ రూ.200 వంతున పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. జీవో టెస్ట్‌కు రెండు పేపర్లకు రూ.400, ఈవో టెస్ట్‌కు రూ.200 చొప్పున మొత్తం రూ.600 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.
- జీవో(కోడ్97) పేపర్–1 డిసెంబరు 10 పదో తేదీ ఉదయం 9 నుంచి 11గంటల వరకు, పేపర్–2 అదే రోజు మధ్యాహ్నం 2–4గంటల వరకు ఉంటుంది.
- ఈవో(కోడ్141) పరీక్ష డిసెంబరు 11వ తేదీ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉంటుంది.
పరీక్షలతో.. పదోన్నతి
Published Tue, Nov 15 2016 10:43 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
రాయవరం :
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే శాఖాపరమైన పరీక్ష ల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షలను ఏపీపీఎస్సీ ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తుంది. ప్రస్తుత నం దీనికి సంబంధించిన నోటిఫికేష¯ŒSను ఏపీపీఎస్సీ(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిష¯ŒS) విడుదల చేసింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు కలిపి 155 రకాల పేపర్ కోడ్‌లతో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ఈ నెల 17వ తేదీలోపు ఆ¯ŒSలై¯ŒSలో రిజిస్ట్రేష¯ŒS చేసుకోవాలి. ఈ డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉపాధ్యాయులు రాయాల్సిన పరీక్షల వివరాలివే..
ఎవరు పరీక్షలు రాయాలంటే..
40 శాతం మార్కులు సాధించాలి..
డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పరీక్షలో 40శాతం మార్కులు సాధించాలి. అయితే జీఓ టెస్ట్‌లో రెండు పేపర్లుంటాయి. కాబట్టి ప్రతి పరీక్షలో 40శాతం మార్కులు సాధించాలి.
సిలబస్ ఇదే..
పరీక్ష ఫీజు వివరాలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..
డిపార్ట్‌మెంట్ పరీక్షా విధానం–2016 నుంచి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోకి మార్పు చేశారు. ఈ ఏడాది నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్ష రాసే విధానం పూర్తిగా ఆన్‌లైన్‌పద్ధతిలోకి మార్చారు. తాజా నోటిఫికేషన్‌ప్రకారం ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఈ పరీక్షలు రాసేందుకు వ¯ŒS టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ విధానంలో ఉద్యోగి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంది. అనంతరం ఏ పరీక్ష రాస్తున్నారో వాటికి అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష తేదీలు..
Advertisement
Advertisement