వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తిరుపతి నుంచి ప్రారంభించిన సమైక్య శంఖారావం ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తిరుపతి నుంచి ప్రారంభించిన సమైక్య శంఖారావం ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రాష్ట్రాన్ని విభజించడం వల్ల తలెత్తే సమస్యలను వివరిస్తూ సోమవారం తిరుపతి నుంచి షర్మిల ప్రారంభించిన యాత్ర చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల మీదుగా బుధవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. 36 రోజు లుగా స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమం చేస్తున్న వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, అసోసియేషన్‌లు, జేఏసీలకు షర్మిల యాత్ర బలాన్నిచ్చింది.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అస్పష్ట విధానాలతో సీమాంధ్ర ప్ర జలను వంచిస్తున్న తరుణంలో వైఎస్సార్ సీపీ స్పష్టమైన వైఖరితో ముందుకు రావడాన్ని అన్ని వర్గాలు స్వాగతించాయి. స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బస్సుయాత్ర చేపట్టి సమైక్య రాష్ట్ర అవసరాన్ని వివరిస్తుండడంతో స్వ చ్ఛందంగా ఉద్యమిస్తున్న వివిధ వర్గాలు త మకు ఒక అండ దొరికిందన్న భావనను వ్యక్తం చే స్తున్నాయి. షర్మిల యాత్రకు ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభించడానికి కారణమిదే నని అంటున్నారు. నిజానికి తిరుపతి, చి త్తూరు, మదనపల్లెలో షర్మిల సభలు ఉంటాయ ని వైఎస్సార్ సీపీ నేతలు ప్రకటించారు.
ప్ర జలు, సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఒత్తిడి మేరకు యాత్రకు మద్దతుగా వేల సంఖ్యలో రహదారులపైకి తరలివచ్చిన వారినుద్దేశించి పలమనేరు, పుంగనూరు, ములకలచెరువు ప్రాంతాల్లో ప్రసంగించాల్సి వచ్చింది. పలుచో ట్ల పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు షర్మిలకు మద్దతుగా రహదారులపైకి వచ్చి యా త్రకు స్వాగతం పలికారు. ఇందుకోసం గంటల సేపు రహదారులపైనే వేచి ఉన్నారు. మదనపల్లె సభ అనుకున్న సమయం కంటే మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైనా జనం కదలకుండా షర్మిల ప్రసంగం ముగిసే వరకూ ఉండడం సమైక్య ఉద్యమ స్ఫూర్తిని చాటింది.
యాత్ర విజయవంతం పట్ల నేతల హర్షం
తక్కువ సమయంలో తేదీలు ఖరారైనప్పటికీ షర్మిల యాత్రకు చిత్తూరు జిల్లా ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభించడం వైఎస్సార్ పార్టీ నేతలను ఆనందింపజేసింది. మండే ఎండలో సైతం జనం తరలిరావడం ప్రజల్లో పార్టీ తీసుకొన్న సమైక్య విధానం పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
యువతను ఆకట్టుకున్న మిథున్‌రెడ్డి ప్రసంగం
షర్మిల మూడురోజుల జిల్లా పర్యటనలో పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషిం చారు. యాత్రలో ఆయన చేసిన ప్రసంగాలు యువతను ఆకట్టుకున్నాయి. రూట్ మ్యాప్ తయారు చేయడం నుంచి సమావేశాలపై ఎప్పటికప్పుడు పార్టీ నాయకుడు వైవీ.సుబ్బారెడ్డితో కలిసి చర్చించి విజయవంతం చేయడం వరకు ముఖ్య పాత్ర పోషించారు. తిరుపతి సభలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డితో, చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్‌తో, మ దనపల్లెలో సమన్వయకర్త షమీమ్ అస్లాం, ఎ మ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డికి సంపూర్ణంగా సహకరించారు.
మదనపల్లెలో ఆయన మాట్లాడు తూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాయలసీమ వాసులకు తాగునీరు లేకుండా చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీ సుకుందని ధ్వజమెత్తారు. విభజన వల్ల న ష్టాలు జరుగుతాయని తెలిసినా చంద్రబాబునాయుడు తెలంగాణ కు అనుకూలమైన లేఖను ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్,టీడీపి కుమ్మక్కై జనాదరణ కలిగిన జగన్‌మోహన్‌రెడ్డిని కేసుల్లో ఇరికించాయన్నారు. మిథున్‌రెడ్డిని తండ్రికి తగ్గ తనయుడిగా పలువురు కొనియాడారు.