United clarion
-
షర్మిల యాత్రలో ఉద్యమం బలోపేతం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తిరుపతి నుంచి ప్రారంభించిన సమైక్య శంఖారావం ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రాష్ట్రాన్ని విభజించడం వల్ల తలెత్తే సమస్యలను వివరిస్తూ సోమవారం తిరుపతి నుంచి షర్మిల ప్రారంభించిన యాత్ర చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల మీదుగా బుధవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. 36 రోజు లుగా స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమం చేస్తున్న వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, అసోసియేషన్లు, జేఏసీలకు షర్మిల యాత్ర బలాన్నిచ్చింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అస్పష్ట విధానాలతో సీమాంధ్ర ప్ర జలను వంచిస్తున్న తరుణంలో వైఎస్సార్ సీపీ స్పష్టమైన వైఖరితో ముందుకు రావడాన్ని అన్ని వర్గాలు స్వాగతించాయి. స్వయంగా జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల బస్సుయాత్ర చేపట్టి సమైక్య రాష్ట్ర అవసరాన్ని వివరిస్తుండడంతో స్వ చ్ఛందంగా ఉద్యమిస్తున్న వివిధ వర్గాలు త మకు ఒక అండ దొరికిందన్న భావనను వ్యక్తం చే స్తున్నాయి. షర్మిల యాత్రకు ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభించడానికి కారణమిదే నని అంటున్నారు. నిజానికి తిరుపతి, చి త్తూరు, మదనపల్లెలో షర్మిల సభలు ఉంటాయ ని వైఎస్సార్ సీపీ నేతలు ప్రకటించారు. ప్ర జలు, సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఒత్తిడి మేరకు యాత్రకు మద్దతుగా వేల సంఖ్యలో రహదారులపైకి తరలివచ్చిన వారినుద్దేశించి పలమనేరు, పుంగనూరు, ములకలచెరువు ప్రాంతాల్లో ప్రసంగించాల్సి వచ్చింది. పలుచో ట్ల పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు షర్మిలకు మద్దతుగా రహదారులపైకి వచ్చి యా త్రకు స్వాగతం పలికారు. ఇందుకోసం గంటల సేపు రహదారులపైనే వేచి ఉన్నారు. మదనపల్లె సభ అనుకున్న సమయం కంటే మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైనా జనం కదలకుండా షర్మిల ప్రసంగం ముగిసే వరకూ ఉండడం సమైక్య ఉద్యమ స్ఫూర్తిని చాటింది. యాత్ర విజయవంతం పట్ల నేతల హర్షం తక్కువ సమయంలో తేదీలు ఖరారైనప్పటికీ షర్మిల యాత్రకు చిత్తూరు జిల్లా ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభించడం వైఎస్సార్ పార్టీ నేతలను ఆనందింపజేసింది. మండే ఎండలో సైతం జనం తరలిరావడం ప్రజల్లో పార్టీ తీసుకొన్న సమైక్య విధానం పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. యువతను ఆకట్టుకున్న మిథున్‌రెడ్డి ప్రసంగం షర్మిల మూడురోజుల జిల్లా పర్యటనలో పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషిం చారు. యాత్రలో ఆయన చేసిన ప్రసంగాలు యువతను ఆకట్టుకున్నాయి. రూట్ మ్యాప్ తయారు చేయడం నుంచి సమావేశాలపై ఎప్పటికప్పుడు పార్టీ నాయకుడు వైవీ.సుబ్బారెడ్డితో కలిసి చర్చించి విజయవంతం చేయడం వరకు ముఖ్య పాత్ర పోషించారు. తిరుపతి సభలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డితో, చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్‌తో, మ దనపల్లెలో సమన్వయకర్త షమీమ్ అస్లాం, ఎ మ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డికి సంపూర్ణంగా సహకరించారు. మదనపల్లెలో ఆయన మాట్లాడు తూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాయలసీమ వాసులకు తాగునీరు లేకుండా చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీ సుకుందని ధ్వజమెత్తారు. విభజన వల్ల న ష్టాలు జరుగుతాయని తెలిసినా చంద్రబాబునాయుడు తెలంగాణ కు అనుకూలమైన లేఖను ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్,టీడీపి కుమ్మక్కై జనాదరణ కలిగిన జగన్మోహన్రెడ్డిని కేసుల్లో ఇరికించాయన్నారు. మిథున్‌రెడ్డిని తండ్రికి తగ్గ తనయుడిగా పలువురు కొనియాడారు. -
ఉప్పొంగిన జనసంద్రం
సాక్షి, తిరుపతి: సమైక్య శంఖారావం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన తొలి బహిరంగ సభకు తిరుపతి జనం బ్రహ్మరథం పట్టారు. ఇడుపుల పాయలో సోమవారం ఉదయం ప్రారంభించిన బస్సు యాత్ర సాయంత్రం తిరుపతికి చేరుకుంది. వెంకన్న పాదాలచెంత తొలి బహిరంగ సభకు షర్మిలతో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వీరిద్దరూ సాయంత్రం 6.10 గంటలకు సభాప్రాంగణానికి చేరుకున్నారు. విజయమ్మ, షర్మిల ప్రసంగాలను జనం మంత్రముగ్ధుల్లా విన్నారు. ‘నేను మీ రాజన్న బిడ్డను... మీ జగనన్న చెల్లెలిని’ అంటూ ప్రసంగం ప్రారంభించగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ‘నేను జగనన్న పూరించిన సమైక్య శంఖారావాన్ని’ అనగా, ఆమెకు చేతులెత్తి అభివాదం చేశారు. సభా ప్రాంగణంలోని అశేష జనం హర్షధ్వానాలతో ఆమె మాటలకు మద్దతు పలికారు. చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి ఆత్మేలేని చంద్రబాబుకు గౌరవం ఎక్కడ నుంచి వస్తుందని బహిరంగ సభలో షర్మిల ప్రశ్నించారు. దీనిపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, తెలుగు ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆరు ప్రధాన పార్టీలుంటే, మూడు పార్టీలు వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం విభజనకు అంగీకరించకపోయినా, ఏకాభిప్రాయం కుదిరినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. రెండు పార్టీల నిరంకుశ ధోరణికి నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న రెండు పార్టీలకు జైలులో ఉంటూనే ముచ్చెమటలు పోయిస్తున్నారని తెలిపారు. జగనన్న మాటగా సమైక్యంగా ఉండాలని ఆమె ప్రసంగాన్ని ముగించారు. సమన్యాయం కావాలి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ సమన్యాయం చేయాలని పలుసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేద న్నారు. ముందుగా జగన్ నిరాహారదీక్ష చేస్తానంటే, ఆయనకు బదులుగా తాను చేస్తానని గుంటూరులో దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అయితే తన దీక్షను భగ్నం చేయడంతో, జగన్ జైలు నుంచే దీక్ష చేపట్టాడని అన్నారు. కేంద్రం చేసిన విభజన ప్రకటనతో సచివాలయం, విద్యుత్‌సౌథ తదితర కార్యాలయాల్లో ఉద్యోగులు రెండు వర్గాలయ్యారని అన్నారు. వైఎస్మూడు ప్రాంతాలకు సమన్యాయం చేశారని అన్నారు. విద్యుత్ నిలిపేసిన ప్రభుత్వం షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం సమావేశం ఆలస్యం కావడంతో, చీకటి పడింది. దీంతో ప్రభుత్వం విద్యుత్ నిలిపేసి కసి తీర్చుకుంది. షర్మిల ప్రసంగిస్తున్న వేదిక మీద ఆరు లైట్ల పోల్ఉన్నా, అది పనిచేయనీయకుండా చేశారు. దీంతో చీకటి మధ్య సమావేశం జరి గింది. టీవీ చానళ్ల వెలుగులో ఆమె ప్రసంగం కొనసాగింది. అంత చీకట్లోనూ ఆమె కోసం వచ్చిన ప్రజలు అక్కడ నుంచి కదలకుండా ప్రసంగాన్ని ఆద్యంతం విన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ మరణంపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన మరణాన్ని హత్యగానే పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, కొడాలినాని, పేర్నినాని, పార్టీ నాయకులు ఆర్కే రోజా, వాసిరెడ్డి పద్మ, చెవిరెడ్డిభాస్కర్ రెడ్డి, కాపుభారతి, వరప్రసాదరావు, ఓవీ రమణ, ఆదిమూలం, పోకలఅశోక్‌కుమార్, తలుపులపల్లెబాబురెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, యువజన కన్వీనరు ఉదయకుమార్, మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, చెలికం కుసుమ, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే బాబు, చెంచయ్య యాదవ్, తొండమనాటి వెంకటేష్, రాజేంద్ర పాల్గొన్నారు. -
నేడు తిరుపతికి షర్మిల
సాక్షి, తిరుపతి:సమైక్య శంఖారావం పూరించడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం తిరుపతికి రానున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధికి ఘన నివాళులర్పించి, సాయంత్రం 4 గంటలకు షర్మిల తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి లీలామహల్ సెం టర్ వద్ద జరుగనున్న భారీ బహిరంగసభలో ఆమె సమైక్య శంఖారావాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వం వహిస్తుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, కేంద్ర పాలకమండలి సభ్యురాలు రోజా తదితర నాయకులు ఈ బహిరంగసభలో పాల్గొంటారు. షర్మిల బహిరంగసభలో పాల్గొనేందుకు వేలాది మంది జగన్మోహన్రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు రానున్నారు. బహిరంగసభ ఏర్పాట్ల కు సంబంధించి ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నివాసంలో సమీక్ష సమావేశం జరిగింది. పార్టీ సీనియర్ నాయకుడు వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ షర్మిల బహిరంగసభను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. పార్టీ నాయకులు షర్మిలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇడుపులపాయ నుంచి వస్తున్న ఆమెకు కరకంబాడి నుంచే స్వాగత ఏర్పాట్లు చేపడుతున్నారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి బహిరంగ సభలో సీనియర్ నాయకులు కూడా ప్రసంగించనున్నారు. శ్రీకాళహస్తి నుంచి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నగరి నియోజవకర్గ సమన్వయకర్త ఆర్కే.రోజా, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఈ సభకు రానున్నారు. సభ అనంతరం షర్మిల తిరుపతిలోనే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం ఆమె పూతలపట్టు మీదుగా చిత్తూరు చేరుకుని, అక్కడ ఉదయం 11 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తరువాత పలమనేరు మీదుగా మదనపల్లె చేరుకుని, సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగసభలో మాట్లాడుతారు. రాత్రి మదనపల్లెలోనే బసచేసి బుధవార ం అనంతపురం జిల్లాకు బయలుదేరనున్నారు.