Public unions
-
మూడు రాజధానులకే ఓటు
మూడు రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలని అఖిలాంధ్ర ప్రజానీకం నినదిస్తోంది. కొందరి రాజకీయ స్వార్థపు మాటలను పట్టించుకోనక్కర లేదని నినదించింది. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణతోనే సామాజిక, ఆర్థిక న్యాయం సాధ్యమవుతుందన్న శివరామకృష్ణన్, జీఎన్ రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన సూచనలకు వాస్తవ రూపం ఇవ్వాలని విన్నవించింది. ఇటు అనంతపురం మొదలు అటు శ్రీకాకుళం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు మూడు రాజధానులకు సై అంటూ ఉద్యమించారు.. ప్రతిపక్షనేత చంద్రబాబు కేవలం తన, తన బినామీల ఆస్తుల పరిరక్షణ కోసమే రాజధాని ప్రాంత రైతులను, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాంత అభివృద్ధికే పట్టు పడుతున్న చంద్రబాబు తీరును ఎండగడతామని, బస్సు యాత్రను అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు. పుట్టపర్తి టౌన్: పాలకుల నిర్లక్ష్యంతో రాయలసీమకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోందని రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక పేర్కొంది. పరిపాలన వికేంద్రీకరణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో లోచర్ల పెద్దారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి అ«ధ్యక్షతన బుధవారం రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. దీనికి ఆ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అయితే శ్రీభాగ్ ఒడంబడిక మేరకు కర్నూలుసహా రాయలసీమ ప్రాంతానికి మరింత న్యాయం చేయాలన్నారు. రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక సమావేశానికి హాజరైన నేతలు విశాఖలో మేధావుల ర్యాలీ ద్వారకానగర్ (విశాఖ): విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ మేధావులు, మహిళలు, విద్యార్థులు బుధవారం సాయంత్రం విశాఖలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో.. ఉత్తరాంధ్ర చైతన్య వేదిక కన్వీనర్ బలగప్రకాష్ మాట్లాడుతూ.. అన్ని హంగులు ఉండి పరిమిత వ్యయంతో రాజధాని నిర్మాణానికి అనుకూలమైన ఏకైక నగరం విశాఖ అన్నారు. ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ శివశంకర్ మాట్లాడుతూ.. విశాఖలో వెంటనే కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి సహకారం ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి చెప్పారు. జీఎన్ రావు కమిటీ నివేదిక వెలువడిన వెంటనే ఎన్జీవో కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చించామని, మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించాలని ఎన్జీవో సంఘం నిర్ణయించిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్‌ను కోల్పోయి కట్టుబట్టలతో రాష్ట్రానికి వచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, పాలన వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు నెల్లూరు (బారకాసు): ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరు వచ్చిన ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని, అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాల్లో విస్తరింపజేయడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. విశాఖ, కర్నూలు నగరాల్లో పాలన విస్తరించడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ రాజధాని విషయంలో బీజేపీకి ఒక స్పష్టమైన విధానం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారు వుడా మాజీ చైర్మన్ డాక్టర్ రెహమాన్ ధ్వజం మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విషం కక్కుతున్నారని వుడా మాజీ చైర్మన్, విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన డాక్టర్ ఎస్.ఎ.రెహమాన్ ధ్వజమెత్తారు. వాస్తవాలను కప్పిపుచ్చుకోవడానికి రైతులను పక్కదారి పట్టించి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందన్నారు. ఏమాత్రం ప్రజాదరణ లేని తన కుమారుడిని అధికారంలో కూర్చోబెట్టడానికి కుట్రలు పన్నుతున్నారని, దీని కోసం అమరావతిని పావుగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు స్వార్థానికి అమరావతి రైతులు బలవుతున్నారని విమర్శించారు. కేవలం గ్రాఫిక్స్‌తో ప్రజలకు జిమ్మిక్కులు చూపించిన చంద్రబాబు ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయడానికి సహాయపడతానని సీఎం వైఎస్ జగన్‌కి లేఖ రాయాలన్నారు. విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా మారితే త్వరలోనే ప్రపంచాన్ని తలదన్నే మహానగరంగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మంచి విజన్ కలిగిన నేత అని, అన్ని పథకాలు బడుగు, బలహీన వర్గాలకు చేరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎల్.ఎన్.పేట: అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ బుధవారం శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కడపలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం కడప కార్పొరేషన్: మూడు రాజధానులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా కడపలో బుధవారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు, శవరాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించం చంద్రబాబుకు ఎంపీ నందిగం హెచ్చరిక సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయత్నిస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ హెచ్చరించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులను రెచ్చగొట్టే చంద్రబాబు దుర్మార్గపు చర్యలు ఇక సాగవని చెప్పారు. ఆయన ఒక ప్రాంత, ఒక కులానికి నాయకుడిగా మిగిలిపోతున్నందుకు సిగ్గు పడాలన్నారు. అడుగడుగునా దుర్మార్గమైన వ్యక్తిగా, ఫ్యాక్షనిస్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ముసుగులో టీడీపీ గూండాలు చేరి ఎమ్మెల్యేలపై హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కారు దిగి ఉంటే వారిని అంతమొందించేందుకు కూడా టీడీపీ గూండాలు వెనకాడే వారు కాదన్నారు. దోచుకున్న సొమ్ము కోసమే పోరాటం రాజధాని రైతులు భూముల కోసం, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అందరూ బాగుండాలని పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం దోచుకున్న సొమ్మును కాపాడుకోవటం కోసమే పోరాటం చేస్తున్నారని ఎంపీ విమర్శించారు. ధర్నా, బంద్ జరిగితే ఒక్క బస్సు, కారయినా తగలబడలేదా అని అడిగే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రాజధాని రైతులకు సీఎం వైఎస్ జగన్ అన్నివిధాలుగా అండగా ఉంటారని చెప్పారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు మూడు ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వైజాగ్‌ను అభివృద్ధి చేసి, కర్నూలులో హైకోర్టు పెడితే చంద్రబాబుకు వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. ఒక వ్యక్తి బాధపడితేనే చూస్తూ ఊరుకునే మనస్తత్వం సీఎం వైఎస్ జగన్‌ది కాదని, అలాంటిది 29 గ్రామాల్లోని రైతులు ఏ చిన్న ఇబ్బంది పడినా చూస్తూ ఎలా ఊరుకుంటారని, వారికి తగిన న్యాయం చేస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీలు రాజమహేంద్రవరం: మూడు రాజధానులే ముద్దు... ఎవరి మాటా వినొద్దంటూ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పరిపాలన వికేంద్రీకరణను స్వాగతిస్తూ ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయా కూడళ్లలో మానవహారాలు చేపట్టారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరం మండలం కోటిపల్లిలో ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యండగండి, పామర్రు, తామరపల్లి, సత్యవాడ తదితర గ్రామాల్లో ఈ ర్యాలీ సాగింది. పాశర్లపూడి కొండాలమ్మచింత సెంటర్లో 216వ నంబర్ జాతీయ రహదారిపై స్థానికులు, ప్రభుత్వ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మూడు రాజధానులను అందరూ స్వాగతించాలి రాజాం: మూడు రాజధానులను అందరూ స్వాగతించాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు కోరారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖకుకేటాయించడం సరైన నిర్ణయమన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని మాధవ బజార్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. -
పరువు హత్యపై ఆగ్రహం
పలమనేరు (చిత్తూరు): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య ఉదంతంపై ప్రజా, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనలు చేశాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఊసరపెంట గ్రామంలో కులాంతర వివాహం చేసుకుందనే కసితో పచ్చి బాలింత అన్న కనికరం లేకుండా కన్నకూతురినే కుటుంబం అంతా కలసి కిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత, ప్రజా సంఘాల నేతలు శనివారం పలమనేరు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రాష్ట్రంలో దళితులపై అగ్రవర్ణాలు సాగిస్తున్న మారణహోమాన్ని రూపుమాపాలని, పరువు హత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేసేదాకా అంత్యక్రియలు నిర్వహించమంటూ బాధితులు, బంధువులు భీష్మించుకున్నారు. వారితో పోలీసులు జరిపిన మంతనాలు ఫలించలేదు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్ నారాయణ గుప్త ఆదేశాలతో మదనపల్లి సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల డిమాండ్లను విని వారికి ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం, భర్త కేశవకు ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి, నిందితులను వెంటనే అరెస్టు చేసి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన బాధితులు హేమావతికి అంత్యక్రియలు పూర్తి చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు, స్థానిక సీఐ ఈద్రుబాష, సత్యవేడు, మదనపల్లి సీఐలు రాజేంద్రప్రసాద్, మురళీకృష్ణ తదితరులు చర్యలు తీసుకున్నారు. కేసులో కీలకంగా మారిన వీడియో రికార్డింగ్ పరువు హత్య కేసులో బాధితుని బంధువులు పోలీసులకు పంపిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. సంఘటన జరిగిన రోజు హేమావతి, ఆమె భర్త కేశవులు వారి వారం రోజుల పసిబిడ్డతో కలసి దొమ్మరిపాపమ్మ ఆలయం వద్ద బస్సు దిగారు. అప్పటికే అక్కడ ఉన్న హేమలత తల్లిదండ్రులు భాస్కర్ నాయుడు, వరలక్ష్మి, సోదరులు భానుప్రకాష్, చరణ్, సోదరి నిఖిలలు ఒక్కసారిగా వారివద్దకొచ్చి హేమలతను బలవంతంగా బైక్‌పైకి ఎక్కించుకున్నారు. వారిని అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించగా దౌర్జన్యం చేశారు. అక్కడే ఉన్న కేశవులు మామ తన మొబైల్లో జరుగుతున్న తంతును వీడియో తీసి స్థానిక పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనే లోపే హత్య జరిగిపోయింది. ఈ కేసులో హతురాలి తల్లి, సోదరి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా తండ్రి, సోదరులు పరారీలో ఉన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నారు. -
నరేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి
-
నరేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి
సీపీఎం, ప్రజాసంఘాల డిమాండ్ సాక్షి, యాదాద్రి: నరేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. దళిత, రజక, ఎంబీసీ, బీసీ, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేం ద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో నరేష్ తల్లి దండ్రులు వెంకటయ్య, ఇందిరమ్మ, సోదరి నీలిమ పాల్గొన్నారు. అలాగే.. జిల్లాలోని వలిగొండ, మోత్కూర్, ఆలేరు, సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్, రామన్నపేట మండలాల్లో సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిం చారు. భువనగిరిలో నరేష్ చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, నింది తుడు శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఆస్తుల ను వెంటనే జప్తు చేయాలని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల పొలాన్ని పరిహారంగా ఇప్పిం చాలని డిమాండ్ చేశారు. పరువు హత్యల నివారణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, నరేశ్ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తన కుమారుడిని హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలని నరేష్ తండ్రి వెంకటయ్య డిమాండ్ చేశారు. -
ప్రభుత్వానిది దౌర్జన్యం
నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడంపై పలు పార్టీలు, ప్రజా సంఘాల మండిపాటు సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీపై పోలీసు నిర్భంధాన్ని ప్రయోగించడం దారుణమని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నేతలు, యువజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ‘‘ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన చూస్తుంటే తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ తీరు గుర్తుకొస్తోంది. పోలీసుల దౌర్జన్యం, అణచివేత సరికాదు..’’ – డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ‘‘టీజేఏసీ ర్యాలీ పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. జేఏసీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం సరికాదు..’’ – వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ‘‘ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి యువతను భయభ్రాంతులకు గురిచేసింది. కోదండరాం ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ అరెస్టు చేయడం ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తికే స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం దారుణం. కేసీఆర్ అప్రజాస్వామిక పోకడలకు ఇది పరాకాష్ట..’’ – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కచ్చితంగా ఇది ప్రభుత్వ కుట్రే... అక్రమ అరెస్టులు, నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరని, జేఏసీ ర్యాలీలో విధ్వంసం జరుగుతుందంటూ హైకోర్టులో అఫిడవిట్ వేయటం వెనుక అంతర్యం ఏమిటని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. శాంతియుతంగా తలపెట్టిన ర్యాలీపై అసత్యాలను ప్రచారం చేస్తూ, చివరి నిమిషంలో అనుమతి నిరాకరణ కచ్చితంగా ప్రభుత్వ కుట్రేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య విమర్శించారు. నిరుద్యోగ ర్యాలీని అడ్డుకునే పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం హింసాకాండకు, నిరంకుశత్వానికి పాల్పడిందని, పార్టీ, ప్రజాసంఘాల కార్యాలయాలను పోలీసులతో దిగ్భంధించడం దారుణమని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ (చంద్రన్న) నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్‌లు ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనంటూ ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ దుయ్యబట్టారు. యువజనులు, విద్యార్థుల భుజాలపై స్వారీ చేసి.. ఉద్యమాల ద్వారా గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల కోసం చేపట్టిన పోరాటాన్ని పోలీసు నిర్భందం ద్వారా అణచేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డా.పాండురంగారావు తెలిపారు. -
అవి విలాసాల బార్లు
బీచ్‌లో మద్యం అమ్మకాలకు సన్నాహాలు 470 జీవోతో గేట్లు తెరిచిన ప్రభుత్వం నిన్న బీచ్ లవ్.. నేడు బీర్ లవ్ పేరుతో తీరం విషతుల్యం అడ్డగోలు నిర్ణయాలపై సర్వత్రా ఆగ్రహం ఆరిలోవలో ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో ఆందోళన బాటలో ప్రజా సంఘాలు నిన్న బీచ్ లవ్ ఫెస్టివల్ అన్నారు.. నేడు బీచ్‌లో బార్లకు గేట్లు బార్లా తెరుస్తున్నారు.. వీటన్నింటికీ సర్కారు పెట్టుకున్న ముద్దుపేరు.. పర్యాటక రంగ అభివృద్ధి..సంప్రదాయాలను కాలరాసే.. ప్రమాదాలకు హేతువులయ్యే ఇటువంటివి వద్దని ప్రజాసంఘాలు, పార్టీలు మొత్తుకుంటున్నా.. ఉద్యమాలు చేస్తున్నా సర్కారు చలించడంలేదు.. పైగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. ఆదాయా మార్గాలను అణగదొక్కుతున్నారని ఎదురుదాడికి తెగబడుతోంది. విదేశీ విధానాల దిగుమతికే మొగ్గుచూపుతోంది. బీచ్ లవ్ ఫెస్టివల్‌ను ఆపేదిలేదని తెగేసి చెప్పిన పాలకులు.. తాజాగా ఎక్సైజ్ చట్టంలో సవరణలతో బీచ్‌లలో బార్ల పేరుతో మద్యం అమ్మకాలకు గేట్లు తెరుస్తోంది. అసలే సముద్రతీరాన్ని చూస్తే నగరవాసులే కాకుండా.. పర్యాటకులు అలలతోఆడుకోవాలని సంబరపడటం సహజం. ఆ సంబరంలో మునిగి.. కడలికి బలవుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు..అలాంటిది ఇప్పుడు తీరంలోనే మద్యం అందుబాటులోకి వస్తే.. తాగిన మైకంలో మరెంత మంది బలవుతారో.. ఊహిస్తేనే భయమేస్తుంది. మరి సంక్షేమ సర్కారుకు మాత్రం ఆదాయం తప్ప.. ఇంకేమీ కనిపించడం లేదు.. ఆలోచించడం లేదు. విశాఖపట్నం:ఆదాయం సమకూర్చుకోవడానికి టీడీపీ సర్కారు యువతను ఫణంగా పెట్టడమే పనిగా పెట్టుకుంది. విశాఖ మహా నగరంలో విష సంస్కృతికి దారులు వేస్తోంది. పాశ్చాత్య పోకడలను రుద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు విశాఖలో ఏ చోట చూసినా ఇదే చర్చ. ఫిబ్రవరిలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలాది విదేశీ ప్రేమ జంటలను తెచ్చి ఇక్కడ తీరంలో తాగినంత మందు పోసి చిందులేయించడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై నగర ప్రజ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ప్రజా, మహిళా సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలూ, టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ మండిపడుతున్నాయి. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. ఇంకా ఆ వేడి చల్లారకముందే ప్రభుత్వం బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలు, ఫుడ్ పార్లర్లలో మద్యం, బీర్ల అమ్మకాలకు లెసైన్సులు మంజూరు చేస్తామంటూ మరో వివాదానికి తెరలేపింది. ఇప్పటికే పెరిగిన ఆగడాలు ఇప్పటికే బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, నగర శివార్ల మందుబాబుల ఆగడాలకు అడ్డాగా మారిపోయింది. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న వారు వీరి చేష్టలతో పడుతున్న అవస్థలన్నీ ఇన్నీ కావు. కళాశాల విద్యార్థులు పెడదారి పడుతున్నారు. వీరిని ఆ దారి నుంచి తప్పించేందుకు పాటుపడాల్సిన ప్రభుత్వమే విచ్చలవిడిగా పార్లర్లు, బీచ్‌లు, పర్యాటక కేంద్రాల్లో స్వేచ్ఛగా మద్యం తాగే ఏర్పాట్లు చేస్తుండడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రభుత్వం ఇంతలా బరి తెగిస్తోందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ప్రశాంతతకు మారుపేరైన విశాఖను విషతుల్యం చేయవద్దని, ఆదాయం కోసం పాడు చేయవద్దని వేడుకుంటున్నారు. ‘మద్యాన్ని అందుబాటులోకి తెస్తే అక్కడికి వచ్చిన వారు అదుపు తప్పి అఘాయిత్యాలకు పాల్పడితే విశాఖ ఏమవుతుంది? దానికుున్న మంచి పేరు ఏమవుతుంది? శాంతిభద్రతల సమస్య తలెత్తితే పరిస్థితి ఏమిటి? విదేశీయులు మన సంస్కృతిని గొప్పగా అనుసరిస్తుంటే.. పాశ్చాత్య సంస్కృతిని ఇక్కడ పెంచి పోషించడానికి ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం చూపిస్తుంది?’ ఇవన్నీ విశాఖ వాసులు, విశాఖను ప్రేమించే వారి నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్నలు. పర్యాటకరంగం అభివృద్ధికి ఇలాంటి అడ్డగోలు అనుమతులిస్తారా? అంటూ నిలదీస్తున్నారు. రోజూ వేలాదిగా బీచ్‌లకు, పర్యాటక ప్రాంతాలకు వచ్చే స్థానికులు వెనక్కి పోయే ప్రమాదం కూడా ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. మరో ఉద్యమానికి సన్నద్ధం విశాఖ వాసులు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బీచ్ లవ్ ఫెస్టివల్‌ను రద్దు చేసే దాకా విశ్రమించబోమని వివిధ వర్గాలు ఆందోళన పథంలో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం బార్, బీర్లు అందుబాటులో ఉంచడానికి వీలుగా జారీ చేసిన 470 నంబరు జీవోను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని మహిళా, ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే శుక్రవారం ఆరిలోవలో ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించాయి. శనివారం జగదాంబ జంక్షన్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నాయి. -
గ్రానైట్‌ను ఎలా తరలిస్తారు..?
బోడికొండ గ్రానైట్ లారీని అడ్డుకున్న ప్రజా సంఘాలు * ఎస్సై జోక్యంతో వెనక్కి మళ్లిన లారీ పార్వతీపురం రూరల్: మండలంలోని టేకులోవ సమీపంలో ఉన్న బోడికొండపై వివాదం నడుస్తుండగా గ్రానైట్ తరలించడంపై ప్రజా సంఘాలు మండిపడ్డాయి. బోడికొండ నుంచి గ్రానైట్ తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు మండలంలోని పులిగుమ్మి సమీపంలో లారీని శుక్రవారం అడ్డుకున్నారుు. దీంతో క్వారీ సూపర్వైజర్ మహేష్ తమకు అనుమతులు ఉన్నాయని, అందుకే గ్రానైట్ తరలిస్తున్నామని చెప్పడంతో ప్రజా సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రానైట్ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేశామని, అలాంటి సమయంలో ఎలా తరలిస్తారని నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, పాలక రంజిత్‌కుమార్, పోల రమణి, పి. రాజశేఖర్, తదితరులు ప్రశ్నించారు. తరలింపు ఆపకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను వారించి గ్రానైట్ లారీని మళ్లీ వెనక్కి మళ్లించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి గ్రానైట్ తవ్వకాలు నిలుపుదల చేయూలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్యాచరణ సిద్ధం.. పార్వతీపురం: బోడికొండపై గ్రానైట్ తవ్వకాలపై సాగుతున్న పోరాటానికి సంబంధించి ఆందోళనకారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఐక్య సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు బోడికొండ పనులు అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను ప్రకటించారు. దీనిలో భాగంగా ఈ నెల 9,10 తేదీలలో ఐక్య సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా బోడికొండ ప్రాంతంలో ఉన్న పంచాయతీ గ్రామాల్లో పర్యటించి ప్రజలను ఆందోళనకు సన్నద్ధం చేయాలి. 11న ఐక్య సంఘాలు ఉమ్మడిగా గ్రామాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ను కలిసి బోడికొండ సమస్యపై నివేదించాలి. 12న బుదురువాడ పంచాయతీ బొడ్డవలసలో అన్ని గ్రామాల ప్రజలతో విస్తృత సమావేశం నిర్వహించి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్ణయించాలని తీర్మానించారు. కార్యక్రమంలో రెడ్డి శ్రీరామమూర్తి(వ్యవసాయ కార్మిక సంఘం), పి.రమణి, వెలగాడ కృష్ణ, పి.మల్లిక్, (అఖిల భారత రైతు కూలీ సంఘం), పి.రంజిత్ కుమార్, టి.సాయిబాబు(గిరిజన సంక్షేమ సంఘం), కె.రామస్వామి (ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం) నాయకులు పాల్గొన్నారు. -
ఉవ్వెత్తున ఎగిసిన నిరసన జ్వాల
- సాక్షిపై చంద్రబాబు దాష్టీకానికి వ్యతిరేకంగా వాడవాడలా ఆందోళనలు - మద్దతు తెలుపుతున్న అన్ని జర్నలిస్టు, ప్రజా సంఘాలు సాక్షి, నెట్వర్క్: ‘సాక్షి’పై చంద్రబాబు దాష్టీకానికి నిరసనగా ఊరూవాడా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో ఐదో రోజూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్, బీఎస్పీ, ప్రజాసంఘాలు, రైతుసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు,మద్దతు తెలిపాయి. కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించి ఆయా వినతిపత్రాలు అందించారు. సోమవారం అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్ద మానవహారం నిర్మించారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షడు శంకరనారాయణ, ఎమ్మేల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు వినతిపత్రం అందిచారు. కడపలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ధర్నా నిర్వహించాయి. విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు. నిరంకుశ పాలనకు చరమగీతమే.. ప్రభుత్వం అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ చానల్ ప్రసారాలను నిలిపివేయించిన పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కిసాన్ఘాట్ సమావేశ భవనంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. వక్తలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సాక్షి చానల్‌పై కక్ష కట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద సోమవారం భారీ ధర్నా, ర్యాలీ నిర్వహించారు.సాక్షి ప్రసారాలను నిలుపుదల చేయడాన్ని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లాలో అన్ని జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. విజయనగరం జిల్లా కలెక్టరేట్ జంక్షన్లో జర్నలిస్టు ఐక్యవేదిక పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరులో నిర్వహించిన ధర్నా జరిపారు. విశాఖపట్నంలో సాక్షి సిబ్బంది, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు నగరంలోని సాక్షి కార్యాలయం నుంచి జీవీఎంసీ కార్యాలయం మీదుగా పోలీస్ కమిషనర్ కార్యాలయం వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. తిరగబడుతున్న కేబుల్ ఆపరేటర్లు సాక్షి ప్రసారాలు నిలిపివేయడంపై విశాఖలోని పెందుర్తినాయుడు తోటలో కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభించారు. ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు చంద్రబాబు కుట్ర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజం నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రంలో సాక్షి చానల్ గొంతు నొక్కాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేస్తున్న సాక్షి చానల్‌పై కక్ష కట్టి ప్రసారాలను నిలిపివేయడం సిగ్గు చేటన్నారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలన్నారు. నిషేధం దారుణం: రామకృష్ణ సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సాక్షిపై కక్షగట్టినట్టు నిషేధం విధించడం దారుణమని, మీడియా గొంతు నొక్కే ఇలాంటి చర్యలు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్ధేశపూర్వకంగా ఒక మీడియాపై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టే చర్యలు సరికాదన్నారు. -
ఒక్కటిగా కదిలి.. ఉద్యమమై రగిలి..
మాటలతో మోసపుచ్చారు..పచ్చని రాష్ట్రాన్నిరెండు ముక్కలు చేశారు..ప్రత్యేక హోదా పేరిట మభ్యపెట్టారు.. ఓట్లు దండుకుని అందలమెక్కారు.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు.. చివరకు సాధ్యపడదని చేతులెత్తేశారు..ప్యాకేజీతో సరిపెట్టే ప్రయత్నానికి తెరతీశారు.. ఇప్పటి దాకా మౌనం దాల్చిన ప్రజలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసంపై భగ్గుమన్నారు.. పార్టీలకు అతీతంగా కదిలి గళమెత్తారు..రాష్ట్ర బంద్‌తో పాలకులకు హెచ్చరిక జారీ చేశారు.. మాట నిలుపుకోవాలని నినదించారు.. వెనక్కు తగ్గితే.. గద్దె దింపుతామని గర్జించారు. కర్నూలు(జిల్లా పరిషత్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో మంగళవారం చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కాగా.. విద్యాసంస్థలు, పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు ముందుగానే సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిం చాయి. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, మంత్రాలయం, కోడుమూ రు, డోన్, పాణ్యం, ఆలూరు, పత్తికొండ, శ్రీశైలం, సున్నిపెంటలో బంద్ ప్రభావం కనిపించింది. సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు నగరంలో బంద్‌ను పర్యవేక్షించాయి. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు నరసింహులుయాదవ్ ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తబస్తాండ్, రాజ్‌విహార్, ఎన్టీఆర్ సర్కిల్, సి.క్యాంప్ సెంటర్లలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మాజీ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలోనూ బంద్ సాగింది. వీరితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఐక్యవేదిక అధ్యక్షుడు టిజి వెంకటేష్, కర్నూలు ఎడ్యుకేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలు వి.జనార్దన్‌రెడ్డి, జి.పుల్లయ్య తదితరులు రాజ్‌విహార్ వద్ద రాస్తారోకో చేసి, కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పి.బి.వి.సుబ్బయ్య ఆధ్వర్యంలో రాజ్‌విహార్, కలెక్టరేట్ వద్ద రాస్తారోకో చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. -
ఓరుగల్లు బరిలో గద్దర్!
* ఉప ఎన్నికలో ప్రజాసంఘాల అభ్యర్థిగా రంగంలోకి.. * మద్దతు ప్రకటించే యోచనలో కాంగ్రెస్? * టీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికిదే మార్గమనే ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో గజ్జె ఘల్లుమనిపించిన ప్రజాగాయకుడు గద్దర్‌ను వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనిపై ఇప్పటికే కొన్ని ప్రజాసంఘాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గద్దర్ బరిలోకి దిగితే మద్దతు ఇవ్వడం ద్వారా టీఆర్ఎస్ను దెబ్బకొట్టవచ్చునని టీపీసీసీ కూడా యోచిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలంటూ దాదాపు 2 దశాబ్దాలపాటు సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలకు గద్దర్ నాయకత్వం వహించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఆ ఫ్రంట్‌కు దూరంగా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయినా గద్దర్ ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు సుపరిచితునిగా ఉన్న గద్దర్‌ను వరంగల్ ఉప ఎన్నికలో బరిలోకి దింపితే గెలుపు సునాయాసమేననే విశ్వాసంతో ప్రజాసంఘాల నేతలున్నారు. గద్దర్‌కు మద్దతుగా టీపీసీసీ..! గద్దర్ వరంగల్ ఉప ఎన్నిక బరిలోకి దిగితే మద్దతు ప్రకటించాలనే యోచనలో టీపీసీసీ ముఖ్యనేతలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనిపై ప్రజాసంఘాల నేతలతో కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే ఒక జాతీయ పార్టీగా ఎంపీ స్థానానికి తన అభ్యర్థిని పోటీలోకి దించకుండా ఉండటం సాధ్యమేనా, దీనికి అధిష్టానం అంగీకరిస్తుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉప ఎన్నికకు దూరంగా ఉంటే పార్టీ బలహీనంగా ఉందనే ప్రచారం వస్తుందని, దీనికి కాంగ్రెస్ వాదులు అంగీకరిస్తారా అనే అనుమానాలతో వారున్నారు. అయితే బలమైన అభ్యర్థి, ప్రజాదరణ ఉన్న అభ్యర్థికి కొరత ఉన్నప్పుడు తెలంగాణ కోసం పోరాడిన గద్దర్‌కు అండగా ఉంటూ టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడమే మంచిదని అంటున్నారు. -
మద్యం అమ్మితే ఊరుకోం...
- మహిళల ధర్నా, మూసివేత - ప్రజాసంఘాల మద్దతు మద్యం అమ్మకాలపై మహిళలు భగ్గుమన్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ప్ల కార్డులు చేతపట్టి ప్రదర్శన చేశారు. దుకాణం మూసే వరకూ ఉద్యమం ఆపేది లేదంటూ బైఠాయించారు. ఉలవపాడు: నిత్యం మా పిల్లలు ఇక్కడ నుంచి బస్సు ఎక్కాలి... ఒంటరిగా బస్సు దిగుతారు. మా పిల్లలకు రక్షణ ఉండాలంటే ఇక్కడ మద్యం షాపు ఉండకూడదు... బరితెగించి పెడితే ఊరుకునేది లేదంటూ మహిళలు ధ్వజమెత్తారు. పంచాయితీ తీర్మానం లేకుండా అన్యాయంగా గత మూడు రోజులుగా ఇక్కడ మద్యం షాపు నిర్మించారు. గత మూడు రోజులు నుంచి ఆందోళనలు చేస్తున్నా మంగళవారం రాత్రి ప్రారంభించారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ధర్నాకు దిగారు. ఎంపీపీ చిన్నమ్మి కూడా మద్దతు పలికారు. బస్‌స్టేషన్ నుంచి పీవీరావు విగ్రహం, అంబేద్కర్ బొమ్మ, పాతబస్టాండ్ వరకు ప్ల కార్డులు చేతపట్టి ప్రదర్శన చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని, అనుమతులు ఇచ్చిన సర్పంచి, కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఎస్.ఐ. రాజేష్ వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. అనుమతి ఉందా అని దుకాణం నిర్వాహకులను ఎస్ఐ అడిగినా చూపించలేకపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నమ్మి , పంచాయతీ వార్డు సభ్యుడు ప్రభావతి, రైతు కూలీ సంఘం నాయకులు ఆర్. మోహన్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ, సి.ఐ.టి.యు. నాయకులు కుమార్, దళిత నాయకులు, అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, వాసవీ వనితా క్లబ్ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మద్యం దుకాణం ఎదుట రాస్తారోకో మార్కాపురం టౌన్: పట్టణంలోని వైపాలెం రోడ్డులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని వార్డు కౌన్సిలర్‌తోపాటు మహిళలు మంగళవారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. సమీపంలో చర్చిలు, ప్రైవేటు పాఠశాలలు నివాస గృహాలున్నాయని, ఎత్తివేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. రోడ్డుపై బైఠాయించటంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో 31వ వార్డు కౌన్సిలర్ ఆదిమూలపు సుశీల, మాజీ కౌన్సిలర్ కొండయ్య, ఆ ప్రాంత మహిళలు పాల్గొన్నారు. -
కదంతొక్కిన నిర్వాసితులు
►కొల్లాపూర్‌లో భారీర్యాలీ, మంత్రి జూపల్లి ఇంటి ముట్టడి ►పార్టీలు, ప్రజాసంఘాల నేతల మద్దతు ►శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకోవాలని డిమాండ్ కొల్లాపూర్ : శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు కదం తొక్కారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితుల పట్ల ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. మంగళవారం కొల్లాపూర్‌లో భారీర్యాలీ నిర్వహించారు. వారి పోరాటానికి పలువురు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు మద్దతు తెలిపారు. న్యాయమైన పోరాటానికి అండగా ఉంటామని భరోసాఇచ్చారు. అనంతరం స్థానిక మహబూబ్ ఫంక్షన్హాల్లో జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను పైకి రానివ్వకుండా పాలకులు ముంచేస్తున్నారని మండిపడ్డారు. నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం ద ృష్టికి తీసుకెళ్తానన్నారు. జీఓ 98ను రద్దు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ.. ఉద్యమాలతో మంత్రి అయిన హరీష్‌రావు ఇప్పుడు నిర్వాసితుల గురించి పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సూపర్‌న్యూమరీ పోస్టులు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి కోరారు. జీఓ 98, జీఓ 68 అమలులో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయన్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపి తప్పించుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన వారందరికీ ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఉద్యమాల సత్తా ఏమిటో మంత్రి జూపల్లికి తెలుసని, స్పందించకుంటే ఆయనకు పరాభవం తప్పదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. నిర్వాసితుల సమస్యలను అసెంబ్లీలో చర్చించేలా బీజేపీ ఎమ్మెల్యేలకు విన్నవిస్తామన్నారు. తెలంగాణ వచ్చాక కూడా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలా అని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర నాయకురాలు పద్మజారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ప స్పుల రామకృష్ణ, సీపీఐ జిల్లా నాయకులు ఫయాజ్, టీజేఏసీ, శ్రీశైలం ని ర్వాసిత నిరుద్యోగ సంఘాల నాయకులు చంద్రారెడ్డి, అనంతరెడ్డి, రా జారాంప్రకాశ్, సుబ్బయ్యయాదవ్, బాబుగౌడ్, కుర్మయ్య పాల్గొన్నారు. -
నేడు డెల్టా బంద్
సాక్షి, చెన్నై: కావేరి నదిలో డ్యాం నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ శనివారం డెల్టా బంద్‌కు అన్నదాతలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. బంద్ విజయవంతం లక్ష్యంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఐదు వందల చోట్ల నిరసనలకు ఏర్పాట్లు చేశారు. పదిహేను రైల్వే స్టేషన్ల ముట్టడికి సిద్ధమయ్యారు. మెట్టూరు డ్యాంకు కావేరి జలాల్ని రానివ్వకుండా చేయడం లక్ష్యంగా కర్ణాటక కుట్రలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వివాదం చేస్తూ వచ్చిన కర్ణాటక పాలకు లు తాజాగా, చుక్కు నీరు తమిళనాడులోకి రాకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. 48 టీఎంసీల సామర్థ్యంతో రెండు డ్యాంలను తమిళనాడుకు సమీపంలోని కర్ణాటక భూ భాగంలో నిర్మిం చేందుకు సన్నద్ధమయ్యూరు. ఈ డ్యాం నిర్మాణం జరిగిన పక్షంలో డెల్టా జిల్లా లు కరువుతో తల్లడిల్లాల్సిందే. ఈ పను ల్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేం ద్రానికి లేఖాస్త్రంతో సరిపెట్టింది. అయి తే అన్నదాతల్లో ఆగ్రహ జ్వాల బయలుదేరింది. కావేరి జలాల మీద తమకు ఉన్న హక్కును పరిరక్షించుకోవడం లక్ష్యంగా పోరు బాటకు సిద్ధమైంది. నేడు బంద్: కర్ణాటక ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని, కావేరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, కావేరి జలాల పర్యవేక్షణ కమిటీని ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ శనివారం నుంచి అన్నదాతలు పోరు బాట చేపట్టనున్నారు. ఇందులోభాగంగా తొలి విడత నిరసనగా డెల్టా బంద్‌కు పిలుపు నిచ్చారు. తిరువారూర్, తంజావూరు , నాగపట్నం జిల్లాల్లో భారీ నిరసనలకు నిర్ణయించారు. ఇందుకు మద్దతు వెల్లువెత్తుతోంది. డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, ఎంఎంకేలతో పాటు చిన్నాచితకా పార్టీలు, త్వరలో పార్టీ పెట్టనున్న జికే.వాసన్ మద్దతు ప్రకటించారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు తాము సైతం అని మద్దతు ప్రకటించాయి. ఆయా ప్రాంతాల్లో ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నేతృత్వంలో భారీ నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ నిరసనల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడు జిల్లాల్లో భారీ బలగాల్ని రంగంలోకి దించారు. ఐదు వందల చోట్ల నిరసనలు: బంద్ విజయవంతం లక్ష్యంగా అన్ని పార్టీలు, సంఘాలు ఉరకలు తీస్తున్నాయి. దీంతో ఆ మూడు జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఒక్క మెడికల్ షాపులు తప్ప, వాణిజ్య సమూదాయాలు, అన్ని రకాలు దుకాణాలు మూత బడనున్నాయి. అలాగే, ప్రైవేటు బస్సులు, లారీలు, ఇతర వాహన యాజమాన్యాలు సైతం బంద్‌లో పాల్గొనేందుకు నిర్ణయించారు. తమ భవిష్యత్తు లక్ష్యం గా శనివారం ఎలాంటి సేవలు ఉండబోవని, అన్ని బంద్ అని ప్రజాసంఘాలు ప్రకటించాయి. ఈ విషయంగా ఈ బంద్‌కు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘం నాయకుడు పీఆర్ పాండి మనోజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తమ బంద్‌కు మద్దతు వెల్లువెత్తుతోందన్నారు. ఉదయం ఆరు గంట ల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని ప్రాంతాలు నిర్మానుష్యం కానున్నాయని, ప్రజాపయోగ సేవలు బంద్ కాబోతున్నాయని వివరించారు. ఐదు వందల ప్రదేశాల్లో రాస్తారోకోలకు నిర్ణయించామని తెలిపారు. తంజావూరు, పాపనాశం, మైలాడుతురై,నాగపట్నం, మన్నార్‌కుడి, నీడా మంగళం తదితర పదిహేను రైల్వే స్టేషన్లను మట్టుడించనున్నామని రైళ్ల సేవల్ని అడ్డుకోనున్నామని ప్రకటించారు. తంజావూరులో జరిగే రైల్‌రోకోకు ఎండీఎంకే నేత వైగో, మైలాడుతురైలో వాణిజ్య సంఘం నేత వెల్లయ్యన్ నేతృత్వం వహించనున్నారని తెలిపారు. -
ఇక దూకుడే
సాక్షి, తిరుపతి/ కార్పొరేషన్: సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వారం తా ఏకమయ్యారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి వేదికగా తిరుపతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేయాలని తీర్మానించారు. ఆర్టీసీ జేఏసీ, ఫ్రెండ్స్ అసోసియేషన్ పిలుపుమేరకు ఉద్యోగ , ప్రజాసంఘాల నాయకులు, రాజకీయవేత్తలు ఆది వారం రాత్రి ఓ ప్రైవేటు హోటల్లో ఉద్యోగ-ప్రజాసంఘాలు-సమైక్యవాదుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. జాతీయ మీడియా ద్వారా ఢిల్లీ పెద్దలకు సమైక్యవాణిని వినిపించాలంటే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతే వేదిక కావాలని తీర్మానించారు. అందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను కేంద్రం పట్టించుకోవడం లేదనే నిర్ణయానికి వచ్చారు. సమైక్యవాణి ఢిల్లీకి వినిపించాలంటే రైల్రోకోతోపాటు తిరుమలకు రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. కేసులుపెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. కేసు లు పెడితే ఉచితంగా న్యాయసహాయం అందించి నిర్దోషులుగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయవాదుల జేఏసీ హామీ ఇచ్చింది. ఒక్కటైన 150 జేఏసీలు సమైక్యాంధ్ర కోసం 48 ప్రభుత్వ శాఖల జేఏసీలు, 22 ఉపాధ్యాయ, 8 ఆర్టీసీ, 72 ప్రజాసంఘాలు ఒక్కటయ్యాయి. సంఘాల ప్రతినిధులంతా సోమవారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా తిరుమలకు రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. 24న శ్రీవారి భక్తులెవరూ తిరుమలకు రావద్దని పిలుపునిచ్చారు. కనీసం ద్విచక్ర వాహనాలూ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. సోమవారం నుంచి 30వ తేదీ వరకు ప్రైవేటు పాఠశాలలు సంపూర్ణంగా బంద్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేసేం దుకు నిర్ణయించారు. వీరే ఉద్యమానికి సారథ్యం వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 24న టీటీడీలోని అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొనాలన్నారు. అదే రోజు రహదారులను దిగ్బంధించాలన్నారు. నాల్గవ తరగతి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు తిరుపతి టౌన్‌బ్యాంక్ ముందుకొచ్చినట్టు ఆ బ్యాంక్ అధ్యక్షుడు పులుగోరు మురళీకృష్ణారెడ్డి ప్రకటిం చారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్, ఆర్డీవో రామచంద్రారెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకులు మునిసుబ్రమణ్యం, ప్రకాష్, ఆవుల ప్రభాకర్‌యాదవ్, సురేంద్రబాబు, లతారెడ్డి, ఈసీ బాబు, డాక్టర్ కృష్ణప్రశాంతి, నరసింహులునాయుడు, న్యాయవాద జేఏసీ నుంచి దినకర్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, నవీన్‌కుమార్‌రెడ్డి, విద్యా సంస్థల జేఏసీ నుంచి తమ్మినేని వెంకటేశ్వర్లు, శర్మ, టీటీడీ జేఏసీ నుంచి విజయకుమార్, మెడికల్ జేఏసీ నుంచి చెంగల్రాయులు, రుక్మిణి, ఏపీఎన్జీవోల నుంచి విజయలక్ష్మి, నిర్మల, సాం స్కృతిక జేఏసీ నుంచి సురేష్, బీసీ జేఏసీ నుంచి అశోక్‌సామ్రాట్, సాప్ప్ జేఏసీ నుంచి రాజారెడ్డి పాల్గొన్నారు. -
షర్మిల యాత్రలో ఉద్యమం బలోపేతం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తిరుపతి నుంచి ప్రారంభించిన సమైక్య శంఖారావం ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రాష్ట్రాన్ని విభజించడం వల్ల తలెత్తే సమస్యలను వివరిస్తూ సోమవారం తిరుపతి నుంచి షర్మిల ప్రారంభించిన యాత్ర చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల మీదుగా బుధవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. 36 రోజు లుగా స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమం చేస్తున్న వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, అసోసియేషన్లు, జేఏసీలకు షర్మిల యాత్ర బలాన్నిచ్చింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అస్పష్ట విధానాలతో సీమాంధ్ర ప్ర జలను వంచిస్తున్న తరుణంలో వైఎస్సార్ సీపీ స్పష్టమైన వైఖరితో ముందుకు రావడాన్ని అన్ని వర్గాలు స్వాగతించాయి. స్వయంగా జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల బస్సుయాత్ర చేపట్టి సమైక్య రాష్ట్ర అవసరాన్ని వివరిస్తుండడంతో స్వ చ్ఛందంగా ఉద్యమిస్తున్న వివిధ వర్గాలు త మకు ఒక అండ దొరికిందన్న భావనను వ్యక్తం చే స్తున్నాయి. షర్మిల యాత్రకు ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభించడానికి కారణమిదే నని అంటున్నారు. నిజానికి తిరుపతి, చి త్తూరు, మదనపల్లెలో షర్మిల సభలు ఉంటాయ ని వైఎస్సార్ సీపీ నేతలు ప్రకటించారు. ప్ర జలు, సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఒత్తిడి మేరకు యాత్రకు మద్దతుగా వేల సంఖ్యలో రహదారులపైకి తరలివచ్చిన వారినుద్దేశించి పలమనేరు, పుంగనూరు, ములకలచెరువు ప్రాంతాల్లో ప్రసంగించాల్సి వచ్చింది. పలుచో ట్ల పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు షర్మిలకు మద్దతుగా రహదారులపైకి వచ్చి యా త్రకు స్వాగతం పలికారు. ఇందుకోసం గంటల సేపు రహదారులపైనే వేచి ఉన్నారు. మదనపల్లె సభ అనుకున్న సమయం కంటే మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైనా జనం కదలకుండా షర్మిల ప్రసంగం ముగిసే వరకూ ఉండడం సమైక్య ఉద్యమ స్ఫూర్తిని చాటింది. యాత్ర విజయవంతం పట్ల నేతల హర్షం తక్కువ సమయంలో తేదీలు ఖరారైనప్పటికీ షర్మిల యాత్రకు చిత్తూరు జిల్లా ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభించడం వైఎస్సార్ పార్టీ నేతలను ఆనందింపజేసింది. మండే ఎండలో సైతం జనం తరలిరావడం ప్రజల్లో పార్టీ తీసుకొన్న సమైక్య విధానం పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. యువతను ఆకట్టుకున్న మిథున్‌రెడ్డి ప్రసంగం షర్మిల మూడురోజుల జిల్లా పర్యటనలో పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషిం చారు. యాత్రలో ఆయన చేసిన ప్రసంగాలు యువతను ఆకట్టుకున్నాయి. రూట్ మ్యాప్ తయారు చేయడం నుంచి సమావేశాలపై ఎప్పటికప్పుడు పార్టీ నాయకుడు వైవీ.సుబ్బారెడ్డితో కలిసి చర్చించి విజయవంతం చేయడం వరకు ముఖ్య పాత్ర పోషించారు. తిరుపతి సభలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డితో, చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్‌తో, మ దనపల్లెలో సమన్వయకర్త షమీమ్ అస్లాం, ఎ మ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డికి సంపూర్ణంగా సహకరించారు. మదనపల్లెలో ఆయన మాట్లాడు తూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాయలసీమ వాసులకు తాగునీరు లేకుండా చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీ సుకుందని ధ్వజమెత్తారు. విభజన వల్ల న ష్టాలు జరుగుతాయని తెలిసినా చంద్రబాబునాయుడు తెలంగాణ కు అనుకూలమైన లేఖను ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్,టీడీపి కుమ్మక్కై జనాదరణ కలిగిన జగన్మోహన్రెడ్డిని కేసుల్లో ఇరికించాయన్నారు. మిథున్‌రెడ్డిని తండ్రికి తగ్గ తనయుడిగా పలువురు కొనియాడారు.