నరేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. దళిత, రజక, ఎంబీసీ, బీసీ, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేం ద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో నరేష్ తల్లి దండ్రులు వెంకటయ్య, ఇందిరమ్మ, సోదరి నీలిమ పాల్గొన్నారు.