బిల్లు 50 వేలు.. టిప్పు లక్ష రూపాయలు..!! | Chicago Restaurant Staff Gets Two Thousand Dollars As Tip | Sakshi
Sakshi News home page

బిల్లు 50 వేలు.. టిప్పు లక్ష రూపాయలు..!!

Published Tue, Apr 17 2018 1:05 PM | Last Updated on Tue, Apr 17 2018 1:05 PM

Chicago Restaurant Staff Got Two Thousand Dollars Tip - Sakshi

టిప్పు ఇచ్చిన వ్యక్తితో హోటల్‌ సిబ్బంది

చికాగో, అమెరికా : హోటల్‌లో సర్వీస్ చేసినందుకు సాధారణంగా అందరం టిప్పు ఇస్తూ ఉంటాం. మరి సర్వీసు ఆహారం కంటే అధికంగా నచ్చి వచ్చిన బిల్లు కంటే ఎక్కువ డబ్బు టిప్పుగా ఇస్తే?. అదే జరిగింది అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో. భోజనం, సర్వీస్‌ నచ్చిందని బిల్లు కంటే ఎక్కువ డబ్బును టిప్పుగా ఇచ్చాడు ఓ వ్యక్తి. చికాగోలోని బొకా రెస్టారెంట్‌కి ఓ వ్యక్తి ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కి వెళ్లాడు. మొత్తం బిల్లు 759 డాలర్లు(రూ.49,786/-) అయింది.

తొలుత బిల్లుతో పాటు 300 డాలర్లు టిప్పుగా ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తి కిచెన్‌లోకి వెళ్లి అక్కడి పని వాళ్లతో మాట్లాడారు. వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒక్కరికి 100 డాలర్ల చొప్పున 17 మందికి 1700 వందల డాలర్లు(రూ.1,31,190/-) టిప్పుగా ఇచ్చారు. దీంతో అక్కడి పనివాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు.

సంతోషంతో ఆ వ్యక్తితో ఫోటో దిగారు. ఇంత మొత్తంలో టిప్పు ఎప్పుడూ రాలేదని, వంటకాలు, సర్వీస్‌లకు మెచ్చి టిప్పు ఇచ్చారని రెస్టారెంట్‌ యాజమాన్యం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement