వాషింగ్టన్: సాధారణంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళితే టిప్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎక్కువ మంది వంద రూపాయలలోపే టిప్పుగా ఇస్తారు. చాలా రేర్‌గా ఎవరో కొందరు మాత్రమే వేలు టిప్పుగా ఇస్తారు. కానీ లక్షల రూపాయలు టిప్పుగా ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా లేదు కదా. కానీ ఈ సంఘటన వాస్తవంగా చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వెయిట్రెస్‌కి ఏకంగా 500 డాలర్లు టిప్పుగా ఇచ్చాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 3,67,287 రూపాయలన్న మాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చెస్టర్లోని వైడెనర్ విశ్వవిద్యాలయంలో నర్సింగ్ చదవుతోన్న జియానా డి ఏంజెలో పెన్సిల్వేనియాలోని ఓ ఇటాలియన్ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పార్ట్ టైం వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కి వచ్చి.. ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నారు. బిల్లు 205 డాలర్లు(రూ.15,058)అయ్యింది. జియానా బిల్ తీసుకొచ్చి ఇవ్వగా సదరు కస్టమర్ 5,205 డాలర్లు టెబుల్ మీద పెట్టి వెళ్లాడు. జియానా వచ్చి చూడగా.. ఐదు వేల డాలర్లు అదనంగా కనిపించాయి. మర్చిపోయాడేమో అని భావించిన జియానా డబ్బులు తిరిగి ఇచ్చేసేందుకు చూసింది. కానీ కస్టమర్ అప్పటికే వెళ్లిపోయాడు. (ట్రెండింగ్: పొరపాటున 42 ఆర్డర్‌లను బుక్ చేసిన చిన్నారి)
దాంతో అతడు ఆ డబ్బుని టిప్పుగా ఇచ్చాడని అర్థం అయ్యింది. దీని గురించి రెస్టారెంట్ యాజమాన్యానికి చెప్పగా వారు బిల్ పేపర్‌ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఇక దాని మీద బిలు దగ్గర 205 డాలర్లు ఉండగా.. టిప్పు దగ్గర 5,000 అని రాసి ఉంది. మొత్తం 5,205 డాలర్లుగా చూపిస్తుంది. ఇంత భారీ మొత్తాన్ని టిప్పుగా అందుకున్న జియానా ఆనందానికి హద్దులు లేవు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంత టిప్పు ఇచ్చిన వ్యక్తి ఈ రెస్టారెంట్‌కి రెగ్యులర్ కస్టమర్. ఎంతో మంచి మనసుతో నాకు ఇంత భారీ మొత్తాన్ని టిప్పుగా ఇచ్చాడు. దీన్ని నా స్వంత ఖర్చులకు వాడను. ఏదైనా మంచి పని కోసం వినియోగిస్తాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ స్టోరి ఫేస్‌బుక్‌లో తెగ వైరలవుతోంది. మహమ్మారి సమయంలో అతడు తన మంచి మనసు చాటుకున్నాడని.. అతడి మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అంటూ నెటిజనులు సదరు కస్టమర్‌ని ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment